Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,
Lyrics Writer : Anisetti / అని శెట్టి ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla pADagA akkinEni, sAvitri aBinayiMcAru. ''dEvI SrIdEvi'' pATa guriMci ceppEmuMdu A pATaku AdhAramaina ShaNmuKa priyarAgaM guriMci koMceM ceppAli. 56va mELa karta rAgamaina I ShaNmuKa priya rAgAnni pUrvaM nATakAllO padyAlaku upayOgiMcEvAru. kAraNaM I rAgaM maMdraMlO kaMTE madhyama tArAsthAyilO svara saMcAraM cEsukOTAniki, gAyakuni Sakti sAmarthyAlu cATukOvaDAniki cAlA anukUlaMgA uMTuMdi. I rAgaMlO nanisari, sadApa anE svaraprayOgAlu janaraMjakaMgA uMTAyi. aMtE kAka 'ri' (riShaBa) daggara ApinA, 'risadA...pa' anE dATu prayOgaM cEsinA karNapEyaMgA uMTuMdi. ivannI bahu cakkagA telisina saMgItaj~juDu susarla dakShiNAmUrti A prayOgAlanniTini poMduparustU rUpoModicAru.
ఈ పాటను ఘంటసాల పాడగా అక్కినేని, సావిత్రి అభినయించారు. ''దేవీ శ్రీదేవి'' పాట గురించి చెప్పేముందు ఆ పాటకు ఆధారమైన షణ్ముఖ ప్రియరాగం గురించి కొంచెం చెప్పాలి. 56వ మేళ కర్త రాగమైన ఈ షణ్ముఖ ప్రియ రాగాన్ని పూర్వం నాటకాల్లో పద్యాలకు ఉపయోగించేవారు. కారణం ఈ రాగం మంద్రంలో కంటే మధ్యమ తారాస్థాయిలో స్వర సంచారం చేసుకోటానికి, గాయకుని శక్తి సామర్థ్యాలు చాటుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాగంలో ననిసరి, సదాప అనే స్వరప్రయోగాలు జనరంజకంగా ఉంటాయి. అంతే కాక 'రి' (రిషభ) దగ్గర ఆపినా, 'రిసదా...ప' అనే దాటు ప్రయోగం చేసినా కర్ణపేయంగా ఉంటుంది. ఇవన్నీ బహు చక్కగా తెలిసిన సంగీతజ్ఞుడు సుసర్ల దక్షిణామూర్తి ఆ ప్రయోగాలన్నిటిని పొందుపరుస్తూ రూపొందించారు.