This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Santhanam
Song » Challani vennelalo / చల్లని వెన్నెలలో
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu GaMTasAla pADagA akkinEni, sAvitri aBinayiMcAru. I pATa mottaM okkaTI oka ettu. AlApana okkaTI oka ettu. AlApana varaku hRudayAniki paTTiMcEsukOgaligitE kaLyANi rAgaMlO unna E  pATainA sarE iTTE gurtu paTTeyyoccu. 


kaLyANi rAgaMlO mAMD rAgacCAyulanu kalupukuMTU sarvaparacina 'callani vennelalO'  pATa 'lalita gItaM aMTE ilA uMDAli' anipistuMdi. 'gAli pedavulE mellaga sOkina pUlu navvelE nidduralO' anE pada  prayOgaM -  prEma eMtO sunnitamainadi; dAnni aBivyaktIkariMcaTaMlO kUDA koMta vyaktitvaM, aBiruci, sunnitatvaM uMDAli - anE viShayAnni anyApadESaMgA ceputuMdi.

I pATanu pADaDAniki labdapratiShTulaina gAyakulu kUDA utsAhapaDutuMTAru. aMdulO yassI bAlasubrahmaNyaM okaru. GaMTasAlaki saMbaMdhiMcina konna saBalalO, saMgIta kAryakramAlalO vAri  goppatanAnni varNiMcaDAniki I pATanu bAlu pADi viSlEShistU vivariMcEvAru. aMteMdukU - praBudEvA, nagmA hIrO hIrOyinlugA naTiMcina 'prEmikuDu' sinimA gurtuku teccukOMDi. aMdulO naTiMcina  bAlasubrahmaNyaM - praBudEvAtO kalisi DAbA mIda kUrcuni prEma vivarAlu rAbaTTE sannivESaMlO I 'callani vennelalO' pATanu AlapiMci tana saradA tIrcukOvaTaM aMduku marO udAharaNa.
Important information - Telugu

 ఈ పాటను ఘంటసాల పాడగా అక్కినేని, సావిత్రి అభినయించారు. ఈ పాట మొత్తం ఒక్కటీ ఒక ఎత్తు. ఆలాపన ఒక్కటీ ఒక ఎత్తు. ఆలాపన వరకు హృదయానికి పట్టించేసుకోగలిగితే కళ్యాణి రాగంలో ఉన్న ఏ పాటైనా సరే ఇట్టే గుర్తు పట్టెయ్యొచ్చు.  కళ్యాణి రాగంలో మాండ్ రాగచ్ఛాయులను కలుపుకుంటూ సర్వపరచిన 'చల్లని వెన్నెలలో'  పాట 'లలిత గీతం అంటే ఇలా ఉండాలి' అనిపిస్తుంది. 'గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెలే నిద్దురలో' అనే పద ప్రయోగం -  ప్రేమ ఎంతో సున్నితమైనది; దాన్ని అభివ్యక్తీకరించటంలో కూడా కొంత వ్యక్తిత్వం, అభిరుచి, సున్నితత్వం ఉండాలి - అనే విషయాన్ని అన్యాపదేశంగా చెపుతుంది.

ఈ పాటను పాడడానికి లబ్దప్రతిష్టులైన గాయకులు కూడా ఉత్సాహపడుతుంటారు. అందులో యస్సీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఘంటసాలకి సంబంధించిన కొన్న సభలలో, సంగీత కార్యక్రమాలలో వారి గొప్పతనాన్ని వర్ణించడానికి ఈ పాటను బాలు పాడి విశ్లేషిస్తూ వివరించేవారు. అంతెందుకూ - ప్రభుదేవా, నగ్మా హీరో హీరోయిన్లుగా నటించిన 'ప్రేమికుడు' సినిమా గుర్తుకు తెచ్చుకోండి. అందులో నటించిన బాలసుబ్రహ్మణ్యం - ప్రభుదేవాతో కలిసి డాబా మీద కూర్చుని ప్రేమ వివరాలు రాబట్టే సన్నివేశంలో ఈ 'చల్లని వెన్నెలలో' పాటను ఆలపించి తన సరదా తీర్చుకోవటం అందుకు మరో ఉదాహరణ.