Actor : Allari Naresh / అల్లరి నరేష్ ,
Actress : Monal Gajjar / మోనాల్ గజ్జర్ ,
Music Director : Sree Vasanth / శ్రీ వసంత్ ,
Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,
Singer : Geetha madhuri / గీతా మాధురి , Hema chandra / హేమచంద్ర ,
Song Category : Special Experimental Songs
Song- Ragam :
" reMDu mahA vRukShAlani taTTukoni pakkanE edagaDaM sAmAnyamaina viShayaM kAdu " annAru sirivennela sItArAma SAstri - caMdrabOs guriMci. nijamE ... vETUri, sirivennela lAMTi mahA vRukShAlu Pul sviMg lO uMTuMDagA pratyEkamaina mudratO janaM lOki dUsukupOyADu caMdrabOs. A mudra samudra taraMgaM lA rakarakAla AkArAllO egasipaDutOMdE tappa okkarOju kUDA cappagA callAripOlEdu ivAlTi varaku.
atani tarvAta rAmajOgayya SAstri,anaMta SrIrAM , BAskaraBaTla, vanamAli, appuDappuDu viSva, I madhya dEviSrI prasAd lAMTi vALLu hiT la mIda hiTlu istunnA caMdrabOs lOni nitya prayOgaSIlatvaM mAtraM cekku cedaralEdu. A prayOgaM - okkOsAri janaraMjakaMgAnU , marOsAri sAhitya 'prayOjanaraMjakaM' gAnU uMDElA cUsukuMTunna caMdrabOs 'suDigADu' anE sinimAlO Pul mAs levellO O eks perimeMT cEsADu. ippaTi varaku sinimA pATallO vaccina kyAcI varDs tO mottaM O pATE rASAsADu. I aiDiyA anukODAniki eMta huShAru gA vuMTuMdO AcaraNa lO peTTaDAniki aMtaku miMcina eksarsaij ceyyAlsi vuMTuMdi. lirik mottaM gamaniMci cUDaMDi. mIkE telustuMdi.
" రెండు మహా వృక్షాలని తట్టుకొని పక్కనే ఎదగడం సామాన్యమైన విషయం కాదు " అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి - చంద్రబోస్ గురించి. నిజమే ... వేటూరి, సిరివెన్నెల లాంటి మహా వృక్షాలు ఫుల్ స్వింగ్ లో ఉంటుండగా ప్రత్యేకమైన ముద్రతో జనం లోకి దూసుకుపోయాడు చంద్రబోస్. ఆ ముద్ర సముద్ర తరంగం లా రకరకాల ఆకారాల్లో ఎగసిపడుతోందే తప్ప ఒక్కరోజు కూడా చప్పగా చల్లారిపోలేదు ఇవాల్టి వరకు.
అతని తర్వాత రామజోగయ్య శాస్త్రి,అనంత శ్రీరాం , భాస్కరభట్ల, వనమాలి, అప్పుడప్పుడు విశ్వ, ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు హిట్ ల మీద హిట్లు ఇస్తున్నా చంద్రబోస్ లోని నిత్య ప్రయోగశీలత్వం మాత్రం చెక్కు చెదరలేదు. ఆ ప్రయోగం - ఒక్కోసారి జనరంజకంగానూ , మరోసారి సాహిత్య 'ప్రయోజనరంజకం' గానూ ఉండేలా చూసుకుంటున్న చంద్రబోస్ 'సుడిగాడు' అనే సినిమాలో ఫుల్ మాస్ లెవెల్లో ఓ ఎక్స్ పెరిమెంట్ చేసాడు. ఇప్పటి వరకు సినిమా పాటల్లో వచ్చిన క్యాచీ వర్డ్స్ తో మొత్తం ఓ పాటే రాశాసాడు. ఈ ఐడియా అనుకోడానికి ఎంత హుషారు గా వుంటుందో ఆచరణ లో పెట్టడానికి అంతకు మించిన ఎక్సర్సైజ్ చెయ్యాల్సి వుంటుంది. లిరిక్ మొత్తం గమనించి చూడండి. మీకే తెలుస్తుంది.