Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
ika pATa viShayAniki vastE.. vAhinI vAri 'svargasIma ' sinimAlOni 'ohoho pAvuramA' pATa taruvAta rakarakAla pOkaDalatO, vinyAsAlatO malacapaDDa pATagA I pATanu ceppukOvAli. arabik, parShiyan saMgItaMlO oka rakamaina vaSIkaraNa Sakti uMTuMdi. A AkarShaNanu CAyAcitraMgA spRuSistU A svaBAvAnni aMdiMcaDAniki 'kIravANi ' rAgAnni ennukOvaTaMlOnE rAjESvararAvugAri praj~ja telustuMdi. paigA pADiMdi 'BAnumati ganuka A gamakAlu, A saMgatulu ati aMdaMgA atukkupOyAyi A kaMThAniki ' . aMdukE A rOjullO koMdaru anEvAru 'BAnumati gaLaMlO adhButaMgA palukutAyi - gamakAlU, saMgatulU...adE migatA kaMThAlakistE ika aMtE saMgatulu ' ani.
marO muKya maina saMgati EmiTaMTE I pATa svara racanaku mugdhulai pOyina - racayita, saMgIta darSakuDu, SivaSakti dattA tana koDukuki 'kIravANi' anE pEruni peTTukunnAru. A kIravANE pramuKa saMgIta darSakuDu kIravANi.
ఇక పాట విషయానికి వస్తే.. వాహినీ వారి 'స్వర్గసీమ ' సినిమాలోని 'ఒహొహొ పావురమా' పాట తరువాత రకరకాల పోకడలతో, విన్యాసాలతో మలచపడ్డ పాటగా ఈ పాటను చెప్పుకోవాలి. అరబిక్, పర్షియన్ సంగీతంలో ఒక రకమైన వశీకరణ శక్తి ఉంటుంది. ఆ ఆకర్షణను ఛాయాచిత్రంగా స్పృశిస్తూ ఆ స్వభావాన్ని అందించడానికి 'కీరవాణి ' రాగాన్ని ఎన్నుకోవటంలోనే రాజేశ్వరరావుగారి ప్రజ్ఞ తెలుస్తుంది. పైగా పాడింది 'భానుమతి గనుక ఆ గమకాలు, ఆ సంగతులు అతి అందంగా అతుక్కుపోయాయి ఆ కంఠానికి ' . అందుకే ఆ రోజుల్లో కొందరు అనేవారు 'భానుమతి గళంలో అధ్భుతంగా పలుకుతాయి - గమకాలూ, సంగతులూ...అదే మిగతా కంఠాలకిస్తే ఇక అంతే సంగతులు ' అని.