This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sarangadhara
Song » Adugadugo / అడుగడుగో
Click To Rate




* Voting Result *
12.50 %
12.50 %
12.50 %
12.50 %
50.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

'aDugaDugO allaDugO' pATanu BAnumati pADAru, aBinayiMcAru ani vErugA ceppaDaM kannA 'idi BAnumati pATa' ani aMTE nErugA BAvaM aMdarikI aMdipOtuMdi. BIM plAs rAgaMlO malacabaDDa I pATa BAnumati svarajIvitAniki marO plas ayiMdi. daggari gamakAlu Ame goMtulO eMta hAyigA palukutAyO grahiMci samayaspUrtitO ...iMkA ceppAlaMTE 'rasamayaspUrtitO....' upayOgiMcukunnAru GaMTasAla. hiMdUsthAnI saMpradAyaMlO gala sAkIla prayOgaMlO reMDava, mUDava caraNAlanu malacukuni pATaku kotta sogasulu samakUrcArAyana. I pATa viMTuMTE - GaMTasAla saMgIta darSakatvaMlO vaccina marO reMDu citrAllOni pATalu gurtoccE avakASaM uMdi. modaTi caraNaMlOni reMDava lain 'kanipiMcenu kannulakE' pUrti kAgAnE vaccE iMTar lUD - 'mAyAbajAr'lOni 'nIvEnA nanu talacinadi' pATalO 'A melukuvalOnE oka kalagA' lain tarvAta vaccE iMTar lUDnu sPuriMcEstuMdi. alAgE I pATalOni sAkIlavale sAgE caraNAlu viMTuMTE 'peLLinATi pramANAlu' citraMlOni 'nItOnE nA lOkaM' pATalO gala 'kanula tericinA kanulu mUsinA APIsulO PaiLLu tericinA' caraNaM (idi kUDA sAkIlA sAgE prayOgamE) j~japtiki vastuMdi.

 

click here to hear the song

Important information - Telugu

'అడుగడుగో అల్లడుగో' పాటను భానుమతి పాడారు, అభినయించారు అని వేరుగా చెప్పడం కన్నా 'ఇది భానుమతి పాట' అని అంటే నేరుగా భావం అందరికీ అందిపోతుంది. భీం ప్లాస్ రాగంలో మలచబడ్డ ఈ పాట భానుమతి స్వరజీవితానికి మరో ప్లస్ అయింది. దగ్గరి గమకాలు ఆమె గొంతులో ఎంత హాయిగా పలుకుతాయో గ్రహించి సమయస్పూర్తితో ...ఇంకా చెప్పాలంటే 'రసమయస్పూర్తితో....' ఉపయోగించుకున్నారు ఘంటసాల. హిందూస్థానీ సంప్రదాయంలో గల సాకీల ప్రయోగంలో రెండవ, మూడవ చరణాలను మలచుకుని పాటకు కొత్త సొగసులు సమకూర్చారాయన. ఈ పాట వింటుంటే - ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన మరో రెండు చిత్రాల్లోని పాటలు గుర్తొచ్చే అవకాశం ఉంది. మొదటి చరణంలోని రెండవ లైన్ 'కనిపించెను కన్నులకే' పూర్తి కాగానే వచ్చే ఇంటర్ లూడ్ - 'మాయాబజార్'లోని 'నీవేనా నను తలచినది' పాటలో 'ఆ మెలుకువలోనే ఒక కలగా' లైన్ తర్వాత వచ్చే ఇంటర్ లూడ్ను స్ఫురించేస్తుంది. అలాగే ఈ పాటలోని సాకీలవలె సాగే చరణాలు వింటుంటే 'పెళ్ళినాటి ప్రమాణాలు' చిత్రంలోని 'నీతోనే నా లోకం' పాటలో గల 'కనుల తెరిచినా కనులు మూసినా ఆఫీసులో ఫైళ్ళు తెరిచినా' చరణం (ఇది కూడా సాకీలా సాగే ప్రయోగమే) జ్ఞప్తికి వస్తుంది.

 

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి