This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Chandi-rani
Song » O Tarakaa O / ఓ - తారకా ఓ
Click To Rate




* Voting Result *
7.14 %
0 %
0 %
0 %
92.86 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

miSra yaman rAgaccAyalalO svaraparacabaDina I pATalO havAyin giTAr vAdyaM aDugaDugunA  mAdhuryAnni vinipistU uMTuMdi. pATa modaTlO vaccE sAkIlO gala navvulElA anE padaM vadda  maMdrasdhAyilO vinipiMcina GaMTasAla gaLa parimaLAnni j~jApakAla doMtarlatO anuBUti paraMgA AvahiMpa  cEsukOgaligitE SarIraM rOmAMcitaM ayipOtuMdi. mojAyik PlOr mIda maMcugaDDalA, paTTudAraMpai maMci  mutyaMlA jAluvArE gamakAlatO eppuDU vilakShaNaMgA BAsiMcE BAnumati svaramAdhuryaM - I pATalO  aMta daggari gamakAlu lEkapOyinA - susvarAniki paravaSiMcagala prati hRudayAnnI pulakiMpa jEstuMdi.


 racanalOnU, svararacanalOnU pavitrata toNikisalADE I pATaki mugiMpulO vaccE myUjik - A tarvAta  iMkO caraNaM uMdEmO - aMduku idi iMTarlUDEmO anE BAvana kaligiMci ati AScaryaMgA mugustuMdi.  I pATaku en.Ti.Ar, BAnumati aBinayiMcAru. okavaipu dvipAtrABinayAnni, marOvaipu darSakatvAnni  Eka kAlaMlO cEyaDamanE prakriyanu O sAhasaMgA, O rikArD gA BAvistunna I taraM vAriki - ivannI  'caMDIrANi ' citraMlO ... AnADE aMTE 1953 lOnE BAnumati cESArani, adI mUDu BAShalalO cESarani telistE  AnATi kaLakArulani goppavArugA I nATikI eMduku ceppukuMTunnArO koMta ardhamayyE avakASaM uMdi.

I citrAniki saMgItaM si.Ar.subbarAman - viSvanAdh ani TaiTils lO vESAru. nijAniki 'caMDIrANi '   muhUrtaMtO modalaina tarvAta si.Ar.subbarAman maraNiMcAru. Ayanaku asisTeMT gA panicEsina  viSvanAdh I citrAnni pUrticESAru. mottaM svararacanA bAdhyatanaMtaTinI tAnE ayi svIkariMcinA "idi  guruvugAri sinimA...Ayana pEru vEyaDamE dharmaM aMdukani muMdu Ayana pErE vEyaMDi " aMTU  paTTubaTTi marI ayana pErunE vEyiMcAru viSvanAdh. I rOjullO aMtaTi naitika viluvalani cUDagalamA!?

Important information - Telugu

మిశ్ర యమన్ రాగచ్చాయలలో స్వరపరచబడిన ఈ పాటలో హవాయిన్ గిటార్ వాద్యం అడుగడుగునా మాధుర్యాన్ని వినిపిస్తూ ఉంటుంది. పాట మొదట్లో వచ్చే సాకీలో గల నవ్వులేలా అనే పదం వద్ద మంద్రస్ధాయిలో వినిపించిన ఘంటసాల గళ పరిమళాన్ని జ్ఞాపకాల దొంతర్లతో అనుభూతి పరంగా ఆవహింప చేసుకోగలిగితే శరీరం రోమాంచితం అయిపోతుంది. మొజాయిక్ ఫ్లోర్ మీద మంచుగడ్డలా, పట్టుదారంపై మంచి ముత్యంలా జాలువారే గమకాలతో ఎప్పుడూ విలక్షణంగా భాసించే భానుమతి స్వరమాధుర్యం - ఈ పాటలో అంత దగ్గరి గమకాలు లేకపోయినా - సుస్వరానికి పరవశించగల ప్రతి హృదయాన్నీ పులకింప జేస్తుంది. రచనలోనూ, స్వరరచనలోనూ పవిత్రత తొణికిసలాడే ఈ పాటకి ముగింపులో వచ్చే మ్యూజిక్ - ఆ తర్వాత ఇంకో చరణం ఉందేమో - అందుకు ఇది ఇంటర్లూడేమో అనే భావన కలిగించి అతి ఆశ్చర్యంగా ముగుస్తుంది. ఈ పాటకు ఎన్.టి.ఆర్, భానుమతి అభినయించారు. ఒకవైపు ద్విపాత్రాభినయాన్ని, మరోవైపు దర్శకత్వాన్ని ఏక కాలంలో చేయడమనే ప్రక్రియను ఓ సాహసంగా, ఓ రికార్డ్ గా భావిస్తున్న ఈ తరం వారికి - ఇవన్నీ 'చండీరాణి ' చిత్రంలో ... ఆనాడే అంటే 1953 లోనే భానుమతి చేశారని, అదీ మూడు భాషలలో చేశరని తెలిస్తే ఆనాటి కళకారులని గొప్పవారుగా ఈ నాటికీ ఎందుకు చెప్పుకుంటున్నారో కొంత అర్ధమయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రానికి సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ - విశ్వనాధ్ అని టైటిల్స్ లో వేశారు. నిజానికి 'చండీరాణి '  ముహూర్తంతో మొదలైన తర్వాత సి.ఆర్.సుబ్బరామన్ మరణించారు. ఆయనకు అసిస్టెంట్ గా పనిచేసిన విశ్వనాధ్ ఈ చిత్రాన్ని పూర్తిచేశారు. మొత్తం స్వరరచనా బాధ్యతనంతటినీ తానే అయి స్వీకరించినా "ఇది గురువుగారి సినిమా...ఆయన పేరు వేయడమే ధర్మం అందుకని ముందు ఆయన పేరే వేయండి " అంటూ పట్టుబట్టి మరీ అయన పేరునే వేయించారు విశ్వనాధ్. ఈ రోజుల్లో అంతటి నైతిక విలువలని చూడగలమా!?

ఈ విశ్వనాధ్ ఎవరో గాదు...తర్వాతి రోజుల్లో తన సంగీత ఝురితో దక్షిణ భారత దేశాన్ని ఒక ఊపు ఊపేసి ఇళయరాజా వంటి సంగీత దర్శకులకు ఆరాధ్య దైవంగా గౌరవాలందుకున్న - ఎం.ఎస్.విశ్వనాధనే!!.. 


రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ