This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Chakrapani
Song » Uyyala Jampaala / ఉయ్యాల జంపాల
Click To Rate




* Voting Result *
45.45 %
9.09 %
9.09 %
9.09 %
27.27 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English


 kadhA gamanAnni tETatellaM cEsE I pATa sAhityAnni gamaniMcagAnE siTyuyEShan sAMg ki vuMDavalasina lakShaNaM aMTE idi kadA anipistuMdi. manuvaDu tanatO pOTlADi illu vadali pOvaTaM valla - peLLayi attavAriLLalO unna manavarALLalO evaru tanaku muMdugA munimanavaNNi istArO vAriki lakSharUpAyalistAnani prakaTistADu si.yas.Ar ! dAMtO manavarALLa madhya pOTI perugutuMdi. aMdulO oka manavarAlaina BAnumati tanu manOramakkAy aMTU ApyAyaMgA pilucukunE sUryakAMtaM iccina salahApai eduriMTlO kottagA digina illAli oDilOni pillADini tIsukuvacci tana koDukEnani tAtayyaki cUpiMcAlani niScayiMcukuMTuMdi.

sadaru nATakaMlOni BAgaMgA pillADini  uyyAllO vEsi jOlapADi nidrapuccE tataMgAnni O rihArsillA BAnumati cEta cEyistuMdi sUryakAMtaM. A saMdharBaMgA vaccE pATa idi. BIMplAs rAgaMlO svaraparacina I pATa I  nATikI vinasoMpugA uMTuMdi. 1950 daSakaMlO vaccina pATalalO lAgAnE I pATalalOnU havAyin giTAr vAdyaM vEru cEsi pADukOlEnaMtaTi prAdhAnyata paravaSiMpa cEstU uMTuMdi.   

1954 lO 'cakrapANi ' viDudalaina sumAru iravaiyELLaki 'tallitaMDrulu ' anE citraM vacciMdi. A citraMlO 'InADu ammAyi puTTina rOju ' anE pATanu GaMTasAla svaraparaci suSIlatO  pADAru. A pATa vinagAnE idi 'uyyAla jaMpAla lUgarAvayyA pATanu tIsukuni cEsEsAru ' anESAru koMtamaMdi.  nijAniki A pATakI, IpATakI pallavilOni modaTi Aru akSharAla varakE svaraparaMgA kAsta pOlika kanapaDutuMdi adi yAdRuccika sAmyamE tappa kApI gAnI, prEraNagAnI kAnE kAdu. ayinA sarE koMtamaMdi aTuvaMTi aBiprAyAniki lOnayyaraMTE adi A 'uyyAla jaMpAlalUgarAvayyA' pATa vEsina ceragani mudra praBAvamE tappa vErokaTi kAdu.

saMgIta paraMgA cUsukunnA, hAsya pradhAnaMgA cUsukunnA 'cakrapANi ' teluguvALLaMdarU garvaMgA ceppukOdagga sinimA. telugutanaM AsAMtaM uTTipaDutU uMTuMdi. cinna samasyani ati sunnitaMgA citrIkariMcaDaM elA anE viShayAnni I sinimA cUsi telusukOvaccu.  


 


Important information - Telugu

 కధా గమనాన్ని తేటతెల్లం చేసే ఈ పాట సాహిత్యాన్ని గమనించగానే సిట్యుయేషన్ సాంగ్ కి వుండవలసిన లక్షణం అంటే ఇది కదా అనిపిస్తుంది. మనువడు తనతో పోట్లాడి ఇల్లు వదలి పోవటం వల్ల - పెళ్ళయి అత్తవారిళ్ళలో ఉన్న మనవరాళ్ళలో ఎవరు తనకు ముందుగా మునిమనవణ్ణి ఇస్తారో వారికి లక్షరూపాయలిస్తానని ప్రకటిస్తాడు సి.యస్.ఆర్ ! దాంతో మనవరాళ్ళ మధ్య పోటీ పెరుగుతుంది. అందులో ఒక మనవరాలైన భానుమతి తను మనోరమక్కాయ్ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సూర్యకాంతం ఇచ్చిన సలహాపై ఎదురింట్లో కొత్తగా దిగిన ఇల్లాలి ఒడిలోని పిల్లాడిని తీసుకువచ్చి తన కొడుకేనని తాతయ్యకి చూపించాలని నిశ్చయించుకుంటుంది. సదరు నాటకంలోని భాగంగా పిల్లాడిని  ఉయ్యాల్లో వేసి జోలపాడి నిద్రపుచ్చే తతంగాన్ని ఓ రిహార్సిల్లా భానుమతి చేత చేయిస్తుంది సూర్యకాంతం. ఆ సంధర్భంగా వచ్చే పాట ఇది. 


భీంప్లాస్ రాగంలో స్వరపరచిన ఈ పాట ఈ  నాటికీ వినసొంపుగా ఉంటుంది. 1950 దశకంలో వచ్చిన పాటలలో లాగానే ఈ పాటలలోనూ హవాయిన్ గిటార్ వాద్యం వేరు చేసి పాడుకోలేనంతటి ప్రాధాన్యత పరవశింప చేస్తూ ఉంటుంది.    


1954 లో 'చక్రపాణి ' విడుదలైన సుమారు ఇరవైయేళ్ళకి 'తల్లితండ్రులు ' అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో 'ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు ' అనే పాటను ఘంటసాల స్వరపరచి సుశీలతో  పాడారు. ఆ పాట వినగానే ఇది 'ఉయ్యాల జంపాల లూగరావయ్యా పాటను తీసుకుని చేసేసారు ' అనేశారు కొంతమంది.  నిజానికి ఆ పాటకీ, ఈపాటకీ పల్లవిలోని మొదటి ఆరు అక్షరాల వరకే స్వరపరంగా కాస్త పోలిక కనపడుతుంది అది యాదృచ్చిక సామ్యమే తప్ప కాపీ గానీ, ప్రేరణగానీ కానే కాదు. అయినా సరే కొంతమంది అటువంటి అభిప్రాయానికి లోనయ్యరంటే అది ఆ 'ఉయ్యాల జంపాలలూగరావయ్యా' పాట వేసిన చెరగని ముద్ర ప్రభావమే తప్ప వేరొకటి కాదు. 

సంగీత పరంగా చూసుకున్నా, హాస్య ప్రధానంగా చూసుకున్నా 'చక్రపాణి ' తెలుగువాళ్ళందరూ గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా. తెలుగుతనం ఆసాంతం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న సమస్యని అతి సున్నితంగా చిత్రీకరించడం ఎలా అనే విషయాన్ని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు.   
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ