Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Lyrics Writer : Ravuri Satyanarayana Rao / రావూరి సత్యనారాయణ రావు ,
Singer : Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
Song Category : Others
Song- Ragam :
pATaku gAnaM, aBinayaM kUDA BAnumatE...! nidraku upakramiMcE muMdu I pATanu kanuka peTTukuMTE manasu praSAMtamai ati tvaragA nidura mabbulOki jArukOvaDaM nUTiki nUrupALLu gyAraMTI ani ceppE sdhAyilO UMTuMdI pATa. alAgE pATa sAhityaM kUDA nidraku saMbaMdhiMcinadE kAvaTaM valla manakunna maMci jOla pATala lisTulO pramuKa sdhAnAnni AkramiMcukOgala sattA unna pATa idi ani pATanu vinna vALLevarainA oppukuMTAru. BAnumati sinimAllO...kaLyANi rAgaMlO... muKyaMgA yaman kaLyaNirAgaMlO KaccitaMgA okka pATainA uMTuMdi. A saMpradAyAnni teliyajEstuMdI pATa. caraNAla madhya vaccE iMTarlUD lani gamanistE yas.rAjESvararAvu yaman kaLyANini upayOgiMcE paddati gurtostuMdi. I pATa ganaka dorikitE vinicUDaMDi.
modaTi caraNaM tarvAta vaccE iMTarlUD rAjESvararAvu svaraparacina pAlakaDalipai SEShatalpamuna pavaLiMcEvA dEvA (ceMculakShmi) pATa naDakanu j~jApakaM cEstU uMTuMdi. aMduku kAraNaM "mallISvari" rOjulanuMDI ennO myUjik siTTiMgulatO rAjESvararAvutO BAnumati kUrcOvaTaM kAvaccu. Ame aBiruci mEraku rAjESvararAvu yaman lO cEsina konni pATala ripiTEShan kAvaccu. yaman rAgaM paTla vAriruvuriki gala vEv leMgt kAvaccu. Edi EmainA iMta maMci pATanu tirigi I taraM vAriki aMdiMcE prayatnaM jarigitE bAvuMTuMdi. ivannI ilA uMDagA I pATalO havAyin giTAr nu upayOgiMcina tIru oka ettu ayitE spaShTata paraMgA "vrAlave" aMTU palikina BAnumati vAcakaM maroka ettu.
ఈ పాటకు గానం, అభినయం కూడా భానుమతే...! నిద్రకు ఉపక్రమించే ముందు ఈ పాటను కనుక పెట్టుకుంటే మనసు ప్రశాంతమై అతి త్వరగా నిదుర మబ్బులోకి జారుకోవడం నూటికి నూరుపాళ్ళు గ్యారంటీ అని చెప్పే స్ధాయిలో ఊంటుందీ పాట. అలాగే పాట సాహిత్యం కూడా నిద్రకు సంబంధించినదే కావటం వల్ల మనకున్న మంచి జోల పాటల లిస్టులో ప్రముఖ స్ధానాన్ని ఆక్రమించుకోగల సత్తా ఉన్న పాట ఇది అని పాటను విన్న వాళ్ళెవరైనా ఒప్పుకుంటారు. భానుమతి సినిమాల్లో...కళ్యాణి రాగంలో... ముఖ్యంగా యమన్ కళ్యణిరాగంలో ఖచ్చితంగా ఒక్క పాటైనా ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని తెలియజేస్తుందీ పాట. చరణాల మధ్య వచ్చే ఇంటర్లూడ్ లని గమనిస్తే యస్.రాజేశ్వరరావు యమన్ కళ్యాణిని ఉపయోగించే పద్దతి గుర్తొస్తుంది. ఈ పాట గనక దొరికితే వినిచూడండి. మొదటి చరణం తర్వాత వచ్చే ఇంటర్లూడ్ రాజేశ్వరరావు స్వరపరచిన పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా (చెంచులక్ష్మి) పాట నడకను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకు కారణం "మల్లీశ్వరి" రోజులనుండీ ఎన్నో మ్యూజిక్ సిట్టింగులతో రాజేశ్వరరావుతో భానుమతి కూర్చోవటం కావచ్చు. ఆమె అభిరుచి మేరకు రాజేశ్వరరావు యమన్ లో చేసిన కొన్ని పాటల రిపిటేషన్ కావచ్చు. యమన్ రాగం పట్ల వారిరువురికి గల వేవ్ లెంగ్త్ కావచ్చు. ఏది ఏమైనా ఇంత మంచి పాటను తిరిగి ఈ తరం వారికి అందించే ప్రయత్నం జరిగితే బావుంటుంది. ఇవన్నీ ఇలా ఉండగా ఈ పాటలో హవాయిన్ గిటార్ ను ఉపయోగించిన తీరు ఒక ఎత్తు అయితే స్పష్టత పరంగా "వ్రాలవె" అంటూ పలికిన భానుమతి వాచకం మరొక ఎత్తు.
రాజా
డి. టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ