ఈ పాటను పాడిన రేణుక ప్రముఖ గాయని అనూరాధా శ్రీరామ్ కి తల్లి. శ్రీరామ్ ఎవరో తెలుసా ... త్రీ బ్రదర్స్ అండ్ ఎ వయొలిన్ అనే ఆల్బమ్ విన్నారా ?
1990 లో పెద్ద హిట్ అయిన ఆ ఆల్బమ్ ని విశ్వనాథ్ పరుశురామ్, శ్రీరామ్ పరుశురామ్, నారాయణ్ పరుశురామ్ రూపొందించారు. అందులోని శ్రీరామ్ పరశురామే ఈ శ్రీరామ్.
ఇక ఈ పాట విషయానికొస్తే - మూడు చరణాలలోనూ - ఘంటసాల పాడిన లైన్స్ కి ట్యూన్ ఒకేలా వుండడం, రేణుక పాడిన లైన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్
వుండడం - అయినా సరే - రేణుక పాడిన లైన్స్ తో ఘంటసాల పాడిన లైన్స్ కలపడం లో ట్యూన్ పరంగా ఏ ఇబ్బందీ లేకపోవడం ఇది పాటకు సంబంధించిన
ప్రత్యేకత మాత్రమే కాదు సంగీత దర్శకుడు టి.జి. లింగప్ప ప్రతిభ కూడా.
ఈ పాటకు చాలా వరకు యమన్ రాగం ఆధారం.
ఈ చిత్ర దర్శకుడు బి. రామకృష్ణయ్య పంతులు తెలుగు వాడిగా పుట్టి కర్ణాటక రాష్ట్రంలో పెరిగి బి.ఆర్. పంతులు గా కన్నడ, తమిళ భాషలలో మంచి మంచి చిత్రాలు తీసి ప్రసిద్ధి చెందాడు. ఈ చిత్రాన్ని గాలిమేడలు గా తెలుగులోనూ, గాలిగోపుర గా కన్నడంలోనూ ఏక కాలంలో నిర్మించాడు. కన్నడ చిత్రం కోసం సంగీత దర్శకుడు టి.జి.లింగప్ప చేసిన ట్యూన్స్ నే రెండు చిత్రాలకూ వాడుకున్నారు కనుక రెండిటికీ సంగీత దర్శకుడిగా టి.జి. లింగప్ప పేరునే వేశారు. ఈ పాటను తెలుగులో పాడిన ఘంటసాల, రేణుక కన్నడంలో కూడా పాడేరు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, లీలావతి నటించారు. ఇక కన్నడం లో ఈ ప్రేమ గీతాన్ని రాసిందెవరో తెలుసా ? ఆది శంకరాచార్య చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జి.వి.అయ్యర్.
-- రాజా