This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sree-Venkateswara-Mahatmyam
Song » Sridevini needu deveri / శ్రీదేవిని నీదు దేవేరి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu es. varalakShmi gAnaM cEyagA, enTI^^Ar, es. varalakShmi aBinayiMcAru. kathAnuguNaMgA pATa madhyalO gummaDi kUDA kanipistAru. bEhAg rAgaMlO vaccina marO maMci pATa idi. 'enalEni anurAga saMtOShamulatO...' daggara vaccE rAgAlApanalO amIr kaLyANi rAgacCAyalu kUDA prayOgiMcabaDDAyi. I AlApananu es. varalakShmi AviShkariMcina tIru cUstE Amenu 'susvaralakShmi' ani pilavAlanipistuMdi. paigA aBinayiMciMdi kUDA lakShmIdEvi pAtranE kanuka kathaku avasaramaina rItilO A pAtra svaBAvAnni pUrtigA AkaLiMpu cEsukuni, AvahiMpajEsukuni... saMpUrNa nyAyaMtO, paripUrNa j~jAnaMtO pADina pATa idi. gAyanImaNulugA pEru teccukOvAlanukunE vAriki I pATa O parIkShalAMTidi. ika racayitagA I pATaku Arudra addina sogasulu InATikI pasivADanivi. 'pAlakaDalilO praBaviMci, muripAla kaDalilO tElitini' aMTU upayOgiMcina aBaMga SlESha, 'padunAlugu BuvanAlu pAliMcu nI madinEli lAliMcu BAgyamu nADE'. 'kalimiki nEnE dEvatanainA nI celimiyE nA kalimi kadA' vaMTi Sabdagata camatkArAla dvArA aBivyaktIkariMcina kavitA sauMdaryaM - ivannI Arudraku BASha mIdaku gala adhikArAnni paTTunu cATi cebutAyi.

Important information - Telugu

ఈ పాటను ఎస్. వరలక్ష్మి గానం చేయగా, ఎన్టీఆర్, ఎస్. వరలక్ష్మి అభినయించారు. కథానుగుణంగా పాట మధ్యలో గుమ్మడి కూడా కనిపిస్తారు. బేహాగ్ రాగంలో వచ్చిన మరో మంచి పాట ఇది. 'ఎనలేని అనురాగ సంతోషములతో...' దగ్గర వచ్చే రాగాలాపనలో అమీర్ కళ్యాణి రాగచ్ఛాయలు కూడా ప్రయోగించబడ్డాయి. ఈ ఆలాపనను ఎస్. వరలక్ష్మి ఆవిష్కరించిన తీరు చూస్తే ఆమెను 'సుస్వరలక్ష్మి' అని పిలవాలనిపిస్తుంది. పైగా అభినయించింది కూడా లక్ష్మీదేవి పాత్రనే కనుక కథకు అవసరమైన రీతిలో ఆ పాత్ర స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఆవహింపజేసుకుని... సంపూర్ణ న్యాయంతో, పరిపూర్ణ జ్ఞానంతో పాడిన పాట ఇది. గాయనీమణులుగా పేరు తెచ్చుకోవాలనుకునే వారికి ఈ పాట ఓ పరీక్షలాంటిది. ఇక రచయితగా ఈ పాటకు ఆరుద్ర అద్దిన సొగసులు ఈనాటికీ పసివాడనివి. 'పాలకడలిలో ప్రభవించి, మురిపాల కడలిలో తేలితిని' అంటూ ఉపయోగించిన అభంగ శ్లేష, 'పదునాలుగు భువనాలు పాలించు నీ మదినేలి లాలించు భాగ్యము నాడే'. 'కలిమికి నేనే దేవతనైనా నీ చెలిమియే నా కలిమి కదా' వంటి శబ్దగత చమత్కారాల ద్వారా అభివ్యక్తీకరించిన కవితా సౌందర్యం - ఇవన్నీ ఆరుద్రకు భాష మీదకు గల అధికారాన్ని పట్టును చాటి చెబుతాయి.