This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » Siva Govinda / శివ గోవింద
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu kosarAju rAGavayya caudari rAyagA mAdhavapeddi satyaM, sarOjini AlapiMcAru. rElaMgi, bEbi SaSikaLa, Ti.ji. kamalAdEvi aBinayiMcAru. harikAMBOji rAgAnni AdhAraMgA cEsukuni svaraparicina I pATa aMdari AdarABimAnAlanU cUragonnadaMTE kAraNaM - kathalO, kathatO imiDipOyE sAhityaM, vinnaveMTanE nOTiki paTTukunE TyUn, vyaMgya dhOraNi lOkarItini sunnitaMgA teliyajEsina vidhAnAlE! nirmAta dukkipATi madhusUdhanarAvu gAriki bAgA paricayaM unna oka kuTuMbaMlO saMtAnaM lEkapOtE okarini teccipeMcukuMTU tama kaMTU pillalu puTTAka vArini nirlakShyaM cEyaTaM jarigiMdi. A anuBavAnni 'velugu nIDalu' kathaku mUlaMgA vADukOvaDamE kAkuMDA I pATa modaTi caraNAniki kUDA upayOgiMcukunnAru. guDivADa daggarlO Arugolanu anE grAmaM uMDEdi.

A cuTTu prakkala prAMtaMlOnE O kAMgres nAyakuDu uMDEvAru. Ayanaku 'SrImatE rAmanujAyanamaH' ani mATimATikI anE alavATu uMDEdi. A mATanE I pATalO peDitE bAvuMTuMdani kosarAjuki sUciMcAru dukkipATi. alA vADEsariki pATa cAlAbAgA vacciMdanipiMci mottaM sinimAlO rElaMgiki A mATanu UtapadaMgA cESAru. idilA uMDagA tana pAtraki paMcakaTTu, pilaka, burramIsAlu ivannI uMDaTaM cEta glAmar lEdani rElaMgiki anipiMciMdi. dukkipATi vAritO edurugA anE dhairyaM lEka tamiLa naTuDu taMgavElutO ceppiMcArAyana. 'velugunIDalu' tamiLa verShan 'tUya uLLuM' ShUTiMg kUDA EkakAlaMlO jarigEdi. aMdulO rElaMgi pAtranu taMgavElu cESAru. iddari vAdana vinna dukkipATi vAru 'mI pAtranu janaM KaccitaMgA bAgA risIv cEsukuMTAru. I pATa kUDA hiT avutuMdi' ani paMdeM kASAru. alAgE jarigiMdi kUDA!

Important information - Telugu

ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి రాయగా మాధవపెద్ది సత్యం, సరోజిని ఆలపించారు. రేలంగి, బేబి శశికళ, టి.జి. కమలాదేవి అభినయించారు. హరికాంభోజి రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరపరిచిన ఈ పాట అందరి ఆదరాభిమానాలనూ చూరగొన్నదంటే కారణం - కథలో, కథతో ఇమిడిపోయే సాహిత్యం, విన్నవెంటనే నోటికి పట్టుకునే ట్యూన్, వ్యంగ్య ధోరణి లోకరీతిని సున్నితంగా తెలియజేసిన విధానాలే! నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు గారికి బాగా పరిచయం ఉన్న ఒక కుటుంబంలో సంతానం లేకపోతే ఒకరిని తెచ్చిపెంచుకుంటూ తమ కంటూ పిల్లలు పుట్టాక వారిని నిర్లక్ష్యం చేయటం జరిగింది. ఆ అనుభవాన్ని 'వెలుగు నీడలు' కథకు మూలంగా వాడుకోవడమే కాకుండా ఈ పాట మొదటి చరణానికి కూడా ఉపయోగించుకున్నారు. గుడివాడ దగ్గర్లో ఆరుగొలను అనే గ్రామం ఉండేది.

ఆ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే ఓ కాంగ్రెస్ నాయకుడు ఉండేవారు. ఆయనకు 'శ్రీమతే రామనుజాయనమః' అని మాటిమాటికీ అనే అలవాటు ఉండేది. ఆ మాటనే ఈ పాటలో పెడితే బావుంటుందని కొసరాజుకి సూచించారు దుక్కిపాటి. అలా వాడేసరికి పాట చాలాబాగా వచ్చిందనిపించి మొత్తం సినిమాలో రేలంగికి ఆ మాటను ఊతపదంగా చేశారు. ఇదిలా ఉండగా తన పాత్రకి పంచకట్టు, పిలక, బుర్రమీసాలు ఇవన్నీ ఉండటం చేత గ్లామర్ లేదని రేలంగికి అనిపించింది. దుక్కిపాటి వారితో ఎదురుగా అనే ధైర్యం లేక తమిళ నటుడు తంగవేలుతో చెప్పించారాయన. 'వెలుగునీడలు' తమిళ వెర్షన్ 'తూయ ఉళ్ళుం' షూటింగ్ కూడా ఏకకాలంలో జరిగేది. అందులో రేలంగి పాత్రను తంగవేలు చేశారు. ఇద్దరి వాదన విన్న దుక్కిపాటి వారు 'మీ పాత్రను జనం ఖచ్చితంగా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ పాట కూడా హిట్ అవుతుంది' అని పందెం కాశారు. అలాగే జరిగింది కూడా!