This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » Sariganchu Chira katti / సరిగంచు చీరకట్టి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu kosarAju rAyagA GaMTasAla, suSIla AlapiMcAru. i.vi.sarOja, bi.dharmarAju aBinayiMcAru. yasvI raMgArAvu, jaggayya, sAvitri, saMdhya, prEkShakulalO sannivESa prAdhAnyaMgA kanipistAru. aMtarlInaMgA gAnI, nErugA gAni eMtO koMta saMdESaM uMDE prayOjanAtmaka gItaM kanIsaM okkaTainA tama citrAlalO uMDAlani iMcumiMcu prati nirmANa saMsthA A rOjullO BAviMcEdi. aMdulO annapUrNA saMstha ayitE ceppanavasaramE lEdu. kaccitaMgA uMDi tIrEdi. aMtEkAdu iTuvaMTi gItAlalO aBinayiMcE vAriki, lEdA nartiMcEvAriki klOjaplu, miD ShATlu uMDEvi.

aMtEgAni lAMg ShATlalO DrassulatOnu, lokEShan aMdAlatOnU myAnEj ceyyaDaM A tarAniki teliyadanE anukOvAli. aMdukE iTuvaMTi gItAlalO pAlgonEvAriki prEkShakula nuMDi gurtiMpu laBiMcEdi. I pATalO nRutyaM cEsina i.vi.sarOjaku annapUrNA vAri tarvAti citraM 'iddaru mitrulu' citraMlO EkaMgA nAgESvararAvu pakkanE hIrOyin gA cEsE avakASaM vastE prEkShakulAmenu eMtOkAlaMgA paricayaM unna naTilA AdariMcaDAniki gala kAraNAlalO idokaTi.

I citraM CAnalslO vaccinappuDu gAni, DiviDi dorikinappuDu gAni jAgrattagA cUDaMDi - pATalO ekkaDA valgar mUmeMTs uMDavu. paigA kaShTapaDi cEyavalasina sTeppu, mUmOMTs uMTAyi. nRutyagItaM aMTE adI! tirigi baiTa evarainA pradarSistE prEkShakula nuMDi gauravaMtO kUDina spaMdana laBiMcAlE tappa vErokaTi kAdu. ika sAhityaparaMgA cUsukuMTE - cakkaTi telugu nuDikAraMtO, jAnapada SaililO, aMdariki telisina sUktulatO pATaku kosarAju kalpiMcina gauravAnni talucukuMTE Ayanaku pAdABivaMdanaM ceyyAlanipistuMdi.

sarigaMcu, bommaMcu, sOkuThIku, nITugOTu, miMgametuku lE#0C4D;kapOyinA mIsAlaku seMTu (ikkaDa saMpaMgi nUne ani anakuMDA TyUn ki kudirETTu seMTu ani vADaDaM DIseMTu prayOgamE) sAgumAnaM, pillagOLLu, ciMtalEni kApuraM SrIraMgaM - lAMTivi maccuki, meccuki konni.... I pATa ivALa viMTuMnnA iMkA vinabuddEstuMdaMTE aMduku marO kAraNaM A sAhityAnni sajIvaMgA uMcina saMgItaM, suspaShTaMgA aMdiMcina gaLAla mAdhuryaM.

Important information - Telugu

ఈ పాటను కొసరాజు రాయగా ఘంటసాల, సుశీల ఆలపించారు. ఇ.వి.సరోజ, బి.ధర్మరాజు అభినయించారు. యస్వీ రంగారావు, జగ్గయ్య, సావిత్రి, సంధ్య, ప్రేక్షకులలో సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. అంతర్లీనంగా గానీ, నేరుగా గాని ఎంతో కొంత సందేశం ఉండే ప్రయోజనాత్మక గీతం కనీసం ఒక్కటైనా తమ చిత్రాలలో ఉండాలని ఇంచుమించు ప్రతి నిర్మాణ సంస్థా ఆ రోజుల్లో భావించేది. అందులో అన్నపూర్ణా సంస్థ అయితే చెప్పనవసరమే లేదు. కచ్చితంగా ఉండి తీరేది. అంతేకాదు ఇటువంటి గీతాలలో అభినయించే వారికి, లేదా నర్తించేవారికి క్లోజప్లు, మిడ్ షాట్లు ఉండేవి. అంతేగాని లాంగ్ షాట్లలో డ్రస్సులతోను, లొకేషన్ అందాలతోనూ మ్యానేజ్ చెయ్యడం ఆ తరానికి తెలియదనే అనుకోవాలి. అందుకే ఇటువంటి గీతాలలో పాల్గొనేవారికి ప్రేక్షకుల నుండి గుర్తింపు లభించేది. ఈ పాటలో నృత్యం చేసిన ఇ.వి.సరోజకు అన్నపూర్ణా వారి తర్వాతి చిత్రం 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో ఏకంగా నాగేశ్వరరావు పక్కనే హీరోయిన్ గా చేసే అవకాశం వస్తే ప్రేక్షకులామెను ఎంతోకాలంగా పరిచయం ఉన్న నటిలా ఆదరించడానికి గల కారణాలలో ఇదొకటి.

ఈ చిత్రం ఛానల్స్లో వచ్చినప్పుడు గాని, డివిడి దొరికినప్పుడు గాని జాగ్రత్తగా చూడండి - పాటలో ఎక్కడా వల్గర్ మూమెంట్స్ ఉండవు. పైగా కష్టపడి చేయవలసిన స్టెప్పు, మూమోంట్స్ ఉంటాయి. నృత్యగీతం అంటే అదీ! తిరిగి బైట ఎవరైనా ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుండి గౌరవంతో కూడిన స్పందన లభించాలే తప్ప వేరొకటి కాదు. ఇక సాహిత్యపరంగా చూసుకుంటే - చక్కటి తెలుగు నుడికారంతో, జానపద శైలిలో, అందరికి తెలిసిన సూక్తులతో పాటకు కొసరాజు కల్పించిన గౌరవాన్ని తలుచుకుంటే ఆయనకు పాదాభివందనం చెయ్యాలనిపిస్తుంది. సరిగంచు, బొమ్మంచు, సోకుఠీకు, నీటుగోటు, మింగమెతుకు లే్కపోయినా మీసాలకు సెంటు (ఇక్కడ సంపంగి నూనె అని అనకుండా ట్యూన్ కి కుదిరేట్టు సెంటు అని వాడడం డీసెంటు ప్రయోగమే) సాగుమానం, పిల్లగోళ్ళు, చింతలేని కాపురం శ్రీరంగం - లాంటివి మచ్చుకి, మెచ్చుకి కొన్ని.... ఈ పాట ఇవాళ వింటుంన్నా ఇంకా వినబుద్దేస్తుందంటే అందుకు మరో కారణం ఆ సాహిత్యాన్ని సజీవంగా ఉంచిన సంగీతం, సుస్పష్టంగా అందించిన గళాల మాధుర్యం.