This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » Padavoyi Bharateyudaa / పాడవోయి భారతీయుడా
Click To Rate




* Voting Result *
16.67 %
0 %
16.67 %
0 %
66.67 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu SrISrI rAyagA suSIla, GaMTasAla, bRuMdaM AlapiMcAru. terapai rAjasulOcana, akkinEni pradhAna pAtradhArulugA aBinayiMcAru. prEkShakulugA rElaMgi, sAvitri taditarulu kanipistAru. taruvAta kAlaMlO nRutyadarSakuDigA, darSakuDigA pEru teccukunna ke.yas.reDDi I pATalO O grUp DAnsargA kanipistAru. appaTlO SrISrI rOjuki reMDu, mUDu pATalu rAsESAru. I pATanu rAyaDAniki padihEnu rOjulu paTTiMdAyanaki, Ayanaku aKaMDa kIrtipratiShTalanu saMpAdiMci peTTina pATalalO idokaTi. aMdukE tana sanI gItAla saMkalanAniki 'pADavOyi BAratIyuDA' anE pErunu peTTukunnArAyana.

aMtEkAdu pATa civaralO tALagatini mAristE bAvuMTuMdanna AlOcanakUDA AyanadE. aMdukE aMtavarakU tiSraMlO sAgina tALagatini 'samasamAja nirmANamaina nI dhyEyaM' daggara nuMci caturasraMlOki mArcaDaM jarigiMdi. 'padavIvyAmOhAlu', caraNAniki SivaraMjani rAgAnni, migilina caraNAlaki mOhanarAgAni#0C4D;na, pallaviki SaMkarABaraNaMlOni kArDsni mAtramE vADukuni sAhityarItyA SASvatatvAnni saMtariMcukunna I gItAniki vennudannugA nilicAru peMDyAla.

ika  sAhitya rItyA I pATa goppadanAnni viSlEShiMcAlsi vastE prativAkyAnni padE padE pErkonAli. 'mA sAhityAnni bAgA cadavi sinimAllOki veLLipOyAvanE bAdha uMDEdi. kAnI I pATa vinnAka A bAdhapOyiMdi' ani dukkipATi vAritO pramuKa kamyUnisT nAyakulu caMDra rAjESvararAvu annAraTa. appaTi Arthika maMtrigA unna kAsu brahmAnaMdareMDDi, arjaMTugA rammanamani O rOju kaburupeTTi tIrA veLLAka - 'nEnu sinimAlu ekkuvagA cUstAnani mIku telusu kadA... ninnanE tADEpalligUDeMlOni rElaMgi svaMta thiyETarlO mI 'velugunIDalu' sinimAni cUSAnu.

EM pATaMDI adi...!? marO yABaiyELLayinA sarE sajIvaMgA uMTuMdi' aMTU tegapogiDArI pATa guriMci. nijAniki appuDU eppuDU pADukunnA sarE - ivALE spaMdiMci rAsArA annaMta nityanUtanaMgA uMTuMdI gItaM. praButva nibaMdhanala rItyA ibbaMdigA uMTuMdEmOnani AliMDiyA rEDiyO vALLu konnALLu pATu mohamATapaDDA A taruvAta pATalOni balaM A mohamATAnni tappiMcEsiMdi. pratI AgasT 15na AMdhradESaMlO innELLayinA I nATikI I pATa vinipiMcani Uru uMDadanE ceppAli. nijAniki pATa yokka prayOjanaM aMtaTi sArthakatvAnni saMpAdiMcukOvaDamE kadA....

Important information - Telugu

ఈ పాటను శ్రీశ్రీ రాయగా సుశీల, ఘంటసాల, బృందం ఆలపించారు. తెరపై రాజసులోచన, అక్కినేని ప్రధాన పాత్రధారులుగా అభినయించారు. ప్రేక్షకులుగా రేలంగి, సావిత్రి తదితరులు కనిపిస్తారు. తరువాత కాలంలో నృత్యదర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కె.యస్.రెడ్డి ఈ పాటలో ఓ గ్రూప్ డాన్సర్గా కనిపిస్తారు. అప్పట్లో శ్రీశ్రీ రోజుకి రెండు, మూడు పాటలు రాసేశారు. ఈ పాటను రాయడానికి పదిహేను రోజులు పట్టిందాయనకి, ఆయనకు అఖండ కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టిన పాటలలో ఇదొకటి.

అందుకే తన సనీ గీతాల సంకలనానికి 'పాడవోయి భారతీయుడా' అనే పేరును పెట్టుకున్నారాయన. అంతేకాదు పాట చివరలో తాళగతిని మారిస్తే బావుంటుందన్న ఆలోచనకూడా ఆయనదే. అందుకే అంతవరకూ తిశ్రంలో సాగిన తాళగతిని 'సమసమాజ నిర్మాణమైన నీ ధ్యేయం' దగ్గర నుంచి చతురస్రంలోకి మార్చడం జరిగింది. 'పదవీవ్యామోహాలు', చరణానికి శివరంజని రాగాన్ని, మిగిలిన చరణాలకి మోహనరాగాని్న, పల్లవికి శంకరాభరణంలోని కార్డ్స్ని మాత్రమే వాడుకుని సాహిత్యరీత్యా శాశ్వతత్వాన్ని సంతరించుకున్న ఈ గీతానికి వెన్నుదన్నుగా నిలిచారు పెండ్యాల.

ఇక  సాహిత్య రీత్యా à°ˆ పాట గొప్పదనాన్ని విశ్లేషించాల్సి వస్తే ప్రతివాక్యాన్ని పదే పదే పేర్కొనాలి. 'మా సాహిత్యాన్ని బాగా చదవి సినిమాల్లోకి వెళ్ళిపోయావనే బాధ ఉండేది. కానీ à°ˆ పాట విన్నాక à°† బాధపోయింది' అని దుక్కిపాటి వారితో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు చండ్ర రాజేశ్వరరావు అన్నారట. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెండ్డి, అర్జంటుగా రమ్మనమని à°“ రోజు కబురుపెట్టి తీరా వెళ్ళాక - 'నేను సినిమాలు ఎక్కువగా చూస్తానని మీకు తెలుసు కదా... నిన్ననే తాడేపల్లిగూడెంలోని రేలంగి స్వంత థియేటర్లో మీ 'వెలుగునీడలు' సినిమాని చూశాను.

ఏం పాటండీ అది...!? మరో యాభైయేళ్ళయినా సరే సజీవంగా ఉంటుంది' అంటూ తెగపొగిడారీ పాట గురించి. నిజానికి అప్పుడూ ఎప్పుడూ పాడుకున్నా సరే - ఇవాళే స్పందించి రాసారా అన్నంత నిత్యనూతనంగా ఉంటుందీ గీతం. ప్రభుత్వ నిబంధనల రీత్యా ఇబ్బందిగా ఉంటుందేమోనని ఆలిండియా రేడియో వాళ్ళు కొన్నాళ్ళు పాటు మొహమాటపడ్డా ఆ తరువాత పాటలోని బలం ఆ మొహమాటాన్ని తప్పించేసింది. ప్రతీ ఆగస్ట్ 15న ఆంధ్రదేశంలో ఇన్నేళ్ళయినా ఈ నాటికీ ఈ పాట వినిపించని ఊరు ఉండదనే చెప్పాలి. నిజానికి పాట యొక్క ప్రయోజనం అంతటి సార్థకత్వాన్ని సంపాదించుకోవడమే కదా....