This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » O Rangayo / à°“ రంగయో
Click To Rate




* Voting Result *
33.33 %
0 %
0 %
33.33 %
33.33 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English


I pATanu SrI SrI rAyagA suSIla, GaMTasAla bRuMdaM AlapiMcAru. sAvitri, akkinEnitO pATu koMdaru jUniyar ArTisTulu aBinayiMcAru. sannivESaparaMgA cUsukuMTE hIrO, hIrOyinlu alA callagAli kOsaM baiTikeLLi pADukuni okarinokaru mariMtagA arthaM cEsukOvAli. ippaTi paristhitullO iTuvaMTi sannivESAlaki eTuvaMTi pATalu vastAyO talacukuMTE - viluvalaku viluvaniccE manasEdainA sarE kumilipOtuMdE tappa marEM cEyalEdu. kAnI 'annapUrNa' vAriki iTuvaMTi Uhalu rAvu. hIrO elAgU aByudaya BAvAlunna vyakti kanuka hIrOyin ataDi BAvAlanu aBimAnistU uMTuMdi kanuka bOTpai viharistunnappuDu kUlipanulu mugiMcukuni iLLaku veLutunna SramajIvulanu cUstU pADukuMTE bAvuMTuMdanI - kathalO taruvAta vaccE BAgaMlO akkinEni mATa mIda okaTaina jaggayya, sAvitri tama jIvitAlanu pEdavAriki aMkitaM cEyAlanukOvaDAniki, A taruvAta vaividhyaM poMdina sAvitri pAtra vAri sEvalalO tana jIvitAlanu gaDapAlanukunE nirNayaM tIsukODAniki I sannivESaM AlaMbanagA uMTuMdanI - plAn cEsukunnAru.

SramaSaktini gauravistU aByudayaBAvAlaku tAviccE pATa anagAnE SrISrI kalaM eMtagA pulakiMcipOtU ennELLayinA vanne taggani amRutadhAralanu akShara rUpaMlO elA varShistuMdO pratyEkaMgA ceppanavasaraMlEdu. I pATanu tamiLa verShan 'tUya uLLam'lO rAsina uDUmalai nArAyaNa kavi pallavi kOsaM cAlA rakAlugA prayatniMci prayatniMci civaraki asaMtRuptigAnE 'O vElappA - taMgavElappA' aMTU saripeTTukOvalasi vacciMdi. hari kAMBOji rAgAniki kaiSika niShAdAnni anyasvaraMgA cEsukuMTU svaraparicina I pATalO iMTarlUDslO PlUT - A venuka vinipiMcE ridham, A taruvAta vayolinla naDakanu bAgA oMTapaTTiMcukOgaligitE tarvAti rOjullO peMDyAla svaraparicina ennO pATalalO A pOkaDanu gamaniMcavaccu. 

ee paaTaku maatRka geetaadat^ paaDagaa 1949 lO viDudalaina - kOyi raMgalyO - anae gujaraat^ geetaM. aa paaTanu vinaalaMTae ee kriMdi liMk ni klik cheyyaMDi.

youtu.be/y2flGjnjYIk

Important information - Telugu

ఈ పాటను శ్రీ శ్రీ రాయగా సుశీల, ఘంటసాల బృందం ఆలపించారు. సావిత్రి, అక్కినేనితో పాటు కొందరు జూనియర్ ఆర్టిస్టులు అభినయించారు. సన్నివేశపరంగా చూసుకుంటే హీరో, హీరోయిన్లు అలా చల్లగాలి కోసం బైటికెళ్ళి పాడుకుని ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో ఇటువంటి సన్నివేశాలకి ఎటువంటి పాటలు వస్తాయో తలచుకుంటే - విలువలకు విలువనిచ్చే మనసేదైనా సరే కుమిలిపోతుందే తప్ప మరేం చేయలేదు. కానీ 'అన్నపూర్ణ' వారికి ఇటువంటి ఊహలు రావు. హీరో ఎలాగూ అభ్యుదయ భావాలున్న వ్యక్తి కనుక హీరోయిన్ అతడి భావాలను అభిమానిస్తూ ఉంటుంది కనుక బోట్పై విహరిస్తున్నప్పుడు కూలిపనులు ముగించుకుని ఇళ్ళకు వెళుతున్న శ్రమజీవులను చూస్తూ పాడుకుంటే బావుంటుందనీ - కథలో తరువాత వచ్చే భాగంలో అక్కినేని మాట మీద ఒకటైన జగ్గయ్య, సావిత్రి తమ జీవితాలను పేదవారికి అంకితం చేయాలనుకోవడానికి, ఆ తరువాత వైవిధ్యం పొందిన సావిత్రి పాత్ర వారి సేవలలో తన జీవితాలను గడపాలనుకునే నిర్ణయం తీసుకోడానికి ఈ సన్నివేశం ఆలంబనగా ఉంటుందనీ - ప్లాన్ చేసుకున్నారు.


శ్రమశక్తిని గౌరవిస్తూ అభ్యుదయభావాలకు తావిచ్చే పాట అనగానే శ్రీశ్రీ కలం ఎంతగా పులకించిపోతూ ఎన్నేళ్ళయినా వన్నె తగ్గని అమృతధారలను అక్షర రూపంలో ఎలా వర్షిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. à°ˆ పాటను తమిళ వెర్షన్ 'తూయ ఉళ్ళమ్'లో రాసిన ఉడూమలై నారాయణ కవి పల్లవి కోసం చాలా రకాలుగా ప్రయత్నించి ప్రయత్నించి చివరకి అసంతృప్తిగానే 'à°“ వేలప్పా - తంగవేలప్పా' అంటూ సరిపెట్టుకోవలసి వచ్చింది. హరి కాంభోజి రాగానికి కైశిక నిషాదాన్ని అన్యస్వరంగా చేసుకుంటూ స్వరపరిచిన à°ˆ పాటలో ఇంటర్లూడ్స్లో ఫ్లూట్ - à°† వెనుక వినిపించే రిధమ్, à°† తరువాత వయొలిన్ల నడకను బాగా ఒంటపట్టించుకోగలిగితే తర్వాతి రోజుల్లో పెండ్యాల స్వరపరిచిన ఎన్నో పాటలలో à°† పోకడను గమనించవచ్చు. 
ఈ పాటకు మాతృక గీతాదత్ పాడగా 1949 లో విడుదలైన - కోయి రంగల్యో - అనే గుజరాత్ గీతం. ఆ పాటను వినాలంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.