This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Thodikodallu-
Song » Town Pakkakelladdura / టౌను పక్కకెల్లొద్దురా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu kosarAju rAyagA GaMTasAla, jikki AlapiMcAru. i.vi.sarOja, I citra nRutyadarSakuDu e.ke.cOprA kalisi aBinayiMcina I nRutyagItaMlO akkinEni, sAvitritOpATu, koMtamaMdi upapAtradhArulu kUDA kanipistAru. vAstavAlanu vyaMgya vaiBavaMtO jODiMci ceppaTaMlO kosarAju eppuDU muMduMDE rAjE tappa kosana uMDE rAju mAtraM kAdu. E caraNAniki A caraNaM 'karekTE kadA' ani anipistU aMdulOni guNadOShAlanu vyaMgyarItilO teliyajEyaTaMlO kosarAju pratiBA viSEShAlu eTuvaMTivO teliyajeppE maroka gItamidi. vikAsAnni peMcE vidhaMgA vij~jAnAnni vinOdaMtO pATu aMdiMcE saMdESAtmaka gItAlanu prati citraMlOnU uMDElA cUsukOvaTaM annapUrNa saMstha AnavAyitI.

ika TyUn paraMgA cUsukuMTE A rOjullO bAgA pApular avaTamE kAka ivALa vinnA kUDA eMtO PreShgA PIlayyE svararacana idi. grAma janABA pedda saMKyalO paTTaNAlaku valasa rAvaDaMtO grAmINa Arthika vyavastha debbatinaDaM, nagarapAlanA vyavastha adupu tappaDaM jarigiMdi. adi anEka sAmAjika samasyalaku dAri tIsiMdi. I pramAdAnni 45 saMvatsarAla kritamE pasigaTTi peddagA caduvukOni grAmavAsulaku (I heccarika vArikEgA) saitaM arthamayyE rItilO viDamarci ceppAru kosarAju. arbanaijEShannu nirasistUnE grAmINa samAjaMlO uMDE lOpAlanu (SrAmika vargAlaku maryAda ivvakapOvaDaM, parimiti lEkuMDA pani cEyiMcaDaM) kUDA etti cUpi 'nETiv sOShal saiMTisT'gA tana sattA cUpiMcArAyana.

Important information - Telugu

ఈ పాటను కొసరాజు రాయగా ఘంటసాల, జిక్కి ఆలపించారు. ఇ.వి.సరోజ, ఈ చిత్ర నృత్యదర్శకుడు ఎ.కె.చోప్రా కలిసి అభినయించిన ఈ నృత్యగీతంలో అక్కినేని, సావిత్రితోపాటు, కొంతమంది ఉపపాత్రధారులు కూడా కనిపిస్తారు. వాస్తవాలను వ్యంగ్య వైభవంతో జోడించి చెప్పటంలో కొసరాజు ఎప్పుడూ ముందుండే రాజే తప్ప కొసన ఉండే రాజు మాత్రం కాదు. ఏ చరణానికి ఆ చరణం 'కరెక్టే కదా' అని అనిపిస్తూ అందులోని గుణదోషాలను వ్యంగ్యరీతిలో తెలియజేయటంలో కొసరాజు ప్రతిభా విశేషాలు ఎటువంటివో తెలియజెప్పే మరొక గీతమిది. వికాసాన్ని పెంచే విధంగా విజ్ఞానాన్ని వినోదంతో పాటు అందించే సందేశాత్మక గీతాలను ప్రతి చిత్రంలోనూ ఉండేలా చూసుకోవటం అన్నపూర్ణ సంస్థ ఆనవాయితీ.

ఇక ట్యూన్ పరంగా చూసుకుంటే ఆ రోజుల్లో బాగా పాపులర్ అవటమే కాక ఇవాళ విన్నా కూడా ఎంతో ఫ్రెష్గా ఫీలయ్యే స్వరరచన ఇది. గ్రామ జనాభా పెద్ద సంఖ్యలో పట్టణాలకు వలస రావడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, నగరపాలనా వ్యవస్థ అదుపు తప్పడం జరిగింది. అది అనేక సామాజిక సమస్యలకు దారి తీసింది. ఈ ప్రమాదాన్ని 45 సంవత్సరాల క్రితమే పసిగట్టి పెద్దగా చదువుకోని గ్రామవాసులకు (ఈ హెచ్చరిక వారికేగా) సైతం అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పారు కొసరాజు. అర్బనైజేషన్ను నిరసిస్తూనే గ్రామీణ సమాజంలో ఉండే లోపాలను (శ్రామిక వర్గాలకు మర్యాద ఇవ్వకపోవడం, పరిమితి లేకుండా పని చేయించడం) కూడా ఎత్తి చూపి 'నేటివ్ సోషల్ సైంటిస్ట్'గా తన సత్తా చూపించారాయన.