Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Master Venu / మాస్టర్ వేణు ,
Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ ,
Singer : Ghantasala / ఘంటసాల , P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu SrI SrI rAyagA GaMTasAla, bRuMdaM AlapiMcAru. akkinEni nAgESvararAvu, sAvitri, koMtamaMdi upapAtradhArulapai citrIkariMcAru. I pATalO sAhitya guriMci muMdugA ceppukOvAli. ivALa eMtOmaMdi prakaTistunna BUsaMskaraNalu ArOjullOnE pATa dvArA teliyajEyaDAniki prayatniMcArani pATa sAhityaM mottaM avalOkistE avagatamavutuMdi. mUDO caraNaMlO - guttuku konarAdu / pAtani anarAdu / hakkai alarAru vaMTi padaprayOgAlani TyUntO sahA mananaM cEsukuMTU uMTE artha sauMdaryaMtO pATu Sabda sauMdaryAnni kUDA SrI SrI eMta rasAtmakaMgA AviShkariMcArO telustuMdi. alAgE GaMTasAla vAri gAtra mAdhuryAnni E rEMjlO upayOgiMcukunnA rasAnuBUti ceDadani AKari caraNAnni OsAri pADukuMTE anuBavaMlOki vas tuMdi.
ఈ పాటను శ్రీ శ్రీ రాయగా ఘంటసాల, బృందం ఆలపించారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, కొంతమంది ఉపపాత్రధారులపై చిత్రీకరించారు. ఈ పాటలో సాహిత్య గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇవాళ ఎంతోమంది ప్రకటిస్తున్న భూసంస్కరణలు ఆరోజుల్లోనే పాట ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించారని పాట సాహిత్యం మొత్తం అవలోకిస్తే అవగతమవుతుంది. మూడో చరణంలో - గుత్తుకు కొనరాదు / పాతని అనరాదు / హక్కై అలరారు వంటి పదప్రయోగాలని ట్యూన్తో సహా మననం చేసుకుంటూ ఉంటే అర్థ సౌందర్యంతో పాటు శబ్ద సౌందర్యాన్ని కూడా శ్రీ శ్రీ ఎంత రసాత్మకంగా ఆవిష్కరించారో తెలుస్తుంది. అలాగే ఘంటసాల వారి గాత్ర మాధుర్యాన్ని ఏ రేంజ్లో ఉపయోగించుకున్నా రసానుభూతి చెడదని ఆఖరి చరణాన్ని ఓసారి పాడుకుంటే అనుభవంలోకి వస్ తుంది.