This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Thodikodallu-
Song » Karulo Shikaru Kelle / కారులో షికారు కెళ్ళే
Click To Rate




* Voting Result *
31.25 %
6.25 %
0 %
0 %
62.50 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

ippaTivaraku konni sinimA pATalapai 'idi evaru rAsi uMTAru?' anE carca rAvaTaM, viShayaM tElAka A vAdAniki terapaDaDaM jarugutU vacciMdi. kAnI 'kArulO ShikArukeLlE' pATa viShayaMlO mAtraM rAsiMdi AtrEyEnani ennisArlu nirUpiMcabaDutunnA sarE 'SrISrI' yA ani agaDaTaM paripATigA - aDagakapOvaTaM porapATugA - vastOMdi. okE vijayAnni A sarasvatI putruliddarU pratyakShaMgA, parOkShaMgA paMcukunna arudaina saMGaTana idi. ika I pATa sAhitI vaiBAvAnni viSlEShiMci rAyAlaMTE mottaM pATani tirigi mananaM cEsukOvaTaM tappa marO gati lEdu. nijAniki I pATanu AtrEya sinimA kOsaM rAyalEdu.

 rOjU sAyaMkAlaM merInA bIcki veLLE alavATuMDEdAyanaki, kvIn mErIs kAlEjlO caduvukunE dhanavaMtulaina ammAyilu callagAli kOsaM kArlalO kAlakShEpAniki vaccEvArakkaDiki. vArini cUsi spaMdiMci AtrEya rAsukunna pATa adi. I citraMlO kathAnAyakuDu AdarSa BAvAlunna yuvakuDu. atanikO iMTraDakShan sAMg ani anukunpapuDu 'nA daggarO pATuMdi viMTArA?' aMTU AtrEya tanu rAsukunna pATanu cUpiMcaTaM dAniki dukkipATi madhusUdhanarAvugAru eMtO bAvuMdani meccukOvaTaMtO alA citraMlO cOTucEsukuMdA pATa. GaMTasAla hiTs lO okaTigA nilicipOyina A pATanu iMTar lUDs tO sahA sTaDI cEyagaligitE vENu pEruku muMdu mAsTar ani eMduku uMdO koMta arthaM avutuMdi.

Important information - Telugu

ఇప్పటివరకు కొన్ని సినిమా పాటలపై 'ఇది ఎవరు రాసి ఉంటారు?' అనే చర్చ రావటం, విషయం తేలాక ఆ వాదానికి తెరపడడం జరుగుతూ వచ్చింది. కానీ 'కారులో షికారుకెళ్లే' పాట విషయంలో మాత్రం రాసింది ఆత్రేయేనని ఎన్నిసార్లు నిరూపించబడుతున్నా సరే 'శ్రీశ్రీ' యా అని అగడటం పరిపాటిగా - అడగకపోవటం పొరపాటుగా - వస్తోంది. ఒకే విజయాన్ని ఆ సరస్వతీ పుత్రులిద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా పంచుకున్న అరుదైన సంఘటన ఇది. ఇక ఈ పాట సాహితీ వైభావాన్ని విశ్లేషించి రాయాలంటే మొత్తం పాటని తిరిగి మననం చేసుకోవటం తప్ప మరో గతి లేదు. నిజానికి ఈ పాటను ఆత్రేయ సినిమా కోసం రాయలేదు.

 రోజూ సాయంకాలం మెరీనా బీచ్కి వెళ్ళే అలవాటుండేదాయనకి, క్వీన్ మేరీస్ కాలేజ్లో చదువుకునే ధనవంతులైన అమ్మాయిలు చల్లగాలి కోసం కార్లలో కాలక్షేపానికి వచ్చేవారక్కడికి. వారిని చూసి స్పందించి ఆత్రేయ రాసుకున్న పాట అది. ఈ చిత్రంలో కథానాయకుడు ఆదర్శ భావాలున్న యువకుడు. అతనికో ఇంట్రడక్షన్ సాంగ్ అని అనుకున్పపుడు 'నా దగ్గరో పాటుంది వింటారా?' అంటూ ఆత్రేయ తను రాసుకున్న పాటను చూపించటం దానికి దుక్కిపాటి మధుసూధనరావుగారు ఎంతో బావుందని మెచ్చుకోవటంతో అలా చిత్రంలో చోటుచేసుకుందా పాట. ఘంటసాల హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ఆ పాటను ఇంటర్ లూడ్స్ తో సహా స్టడీ చేయగలిగితే వేణు పేరుకు ముందు మాస్టర్ అని ఎందుకు ఉందో కొంత అర్థం అవుతుంది.