This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sree-Venkateswara-Mahatmyam
Song » Sheshasailaa vaasa / శేషశైలా వాసా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

telugu sinimA pATalalO I yugAMtaM varaku nilicipOyE pATa Edi anE saMdEhaM evarikainA vastE aMduku samAdhAnaMlA nilicipOyE gItaMgA - 'SEShaSaila vAsa SrI vEMkaTESA' pATanu udahariMcavaccu. teluguvAru tanu susthirAstigA ceppukunE pratiShTAtmaka gAyakuDu GaMTasAla - tana aNuvaNuvU Bakti tatvAnni niMpukunna svarArcakuDu kAbaTTE - SASvatatvaM kaligina I gItAnni pADi, terapai aBinayiMcE adRuShTaM A gAnamayyaku dakkiMdani ceppAli. pUrvajanma sukRutamO lEka prastuta janmalO abbina saMskAramO uMTEnE gAni iTuvaMTi mahadBAgyAlu laBiMcavu. oka kRutiki ceMdavalasina gauravAnni svaMtaM cEsukunna I gItAnni raciMcina AtrEya kUDA A kRupaku samapAtruDu. I pATanu 'rIti gauLa' rAgaMlO svaraparicAru peMDyAla. I rAgaMlO vaccina pUrti sinimA pATa taruvAta rOjullO iMcumiMcugA iMkEdI lEdanE ceppAli. 'rahasyaM' citraMlO GaMTasAla svaraparicina 'girijA kaLyANaM' yakShagAnaMlO 'ISuni dAsuni cEtuvA' aMTU suSIla pADina caraNaM mAtraM marO udAharaNagA nilustuMdi.

Important information - Telugu

తెలుగు సినిమా పాటలలో ఈ యుగాంతం వరకు నిలిచిపోయే పాట ఏది అనే సందేహం ఎవరికైనా వస్తే అందుకు సమాధానంలా నిలిచిపోయే గీతంగా - 'శేషశైల వాస శ్రీ వేంకటేశా' పాటను ఉదహరించవచ్చు. తెలుగువారు తను సుస్థిరాస్తిగా చెప్పుకునే ప్రతిష్టాత్మక గాయకుడు ఘంటసాల - తన అణువణువూ భక్తి తత్వాన్ని నింపుకున్న స్వరార్చకుడు కాబట్టే - శాశ్వతత్వం కలిగిన ఈ గీతాన్ని పాడి, తెరపై అభినయించే అదృష్టం ఆ గానమయ్యకు దక్కిందని చెప్పాలి. పూర్వజన్మ సుకృతమో లేక ప్రస్తుత జన్మలో అబ్బిన సంస్కారమో ఉంటేనే గాని ఇటువంటి మహద్భాగ్యాలు లభించవు. ఒక కృతికి చెందవలసిన గౌరవాన్ని స్వంతం చేసుకున్న ఈ గీతాన్ని రచించిన ఆత్రేయ కూడా ఆ కృపకు సమపాత్రుడు. ఈ పాటను 'రీతి గౌళ' రాగంలో స్వరపరిచారు పెండ్యాల. ఈ రాగంలో వచ్చిన పూర్తి సినిమా పాట తరువాత రోజుల్లో ఇంచుమించుగా ఇంకేదీ లేదనే చెప్పాలి. 'రహస్యం' చిత్రంలో ఘంటసాల స్వరపరిచిన 'గిరిజా కళ్యాణం' యక్షగానంలో 'ఈశుని దాసుని చేతువా' అంటూ సుశీల పాడిన చరణం మాత్రం మరో ఉదాహరణగా నిలుస్తుంది.