This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sree-Venkateswara-Mahatmyam
Song » Gopala...nanda Gopalaa / గోపాల .... నంద గోపాలా
Click To Rate




* Voting Result *
25.00 %
0 %
0 %
0 %
75.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu SAMtakumAri gAnaM cEsi, AmeyE muKyapAtradhAriNigA aBinayiMcagA citrIkariMcAru. pIlU rAgAniki ati cakkani udAharaNa I pATa. I rAgaMlO idE anuBUtitO peMDyAla 'SrIkRuShNArjuna yuddhaM' citraMlO svaraparacina 'nIkai vEcitinayyA O EkAMta rAmayyA...' pATanu kUDA I saMdarBaMgA gurtu cEsukOgaligitE pIlU rAgaMpai koMta avagAhana kalugutuMdi. I pATa  sAhityAnni parikistE - dvApara yugaMlOni yaSOdayE kaliyugaMlO vakuLagA janiMciMdanna purANa gAdhala aucityAnni oMTa paTTiMcukuni - vakuLa goMtuku yaSOda manasu jata cEstU AtrEya rASArA anipistuMdi. muKyaMgA - 'vEci vEci I vennamuddavale karigipOyerA nA batuku, pAlanu muccili parula cEtilO debbalu tinakurA kannayyA I talli hRudayaM OrvalEdayA... lAMTi vAkyAlanu gamanistE mAtRu hRudayaM anE AlayaMlO akShara dIpAlanu peTTi - kavigA tana ruNaM Ayana tIrcukunnADEmOnannaMta unnataMgA uMdI BAvaprakaTana. SAMtakumAri gaLaM kUDA adE tadAtmyAni paMcutuMdi. ika I pATalO upayOgiMcina muccili (doMgaliMcuTa) anE padaM telugu sinimA pATallO A tarvAta vaccinaTTugA lEdu.

I citraMlO es.varalakShmi, SAMtakumAri pADina pATalanu vinna tarvAta A svarNa yugAnni tirigi poMdE adRuShTaM mana telugu sinimA saMgItAniki uMdA ani evarikainA anipistE - kAla pravAhAniki edurIdi nilabaDagaligE mAnavatvapu viluvalu vArilO iMkA unnaTTu lekka.

Important information - Telugu

ఈ పాటను శాంతకుమారి గానం చేసి, ఆమెయే ముఖ్యపాత్రధారిణిగా అభినయించగా చిత్రీకరించారు. పీలూ రాగానికి అతి చక్కని ఉదాహరణ ఈ పాట. ఈ రాగంలో ఇదే అనుభూతితో పెండ్యాల 'శ్రీకృష్ణార్జున యుద్ధం' చిత్రంలో స్వరపరచిన 'నీకై వేచితినయ్యా ఓ ఏకాంత రామయ్యా...' పాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోగలిగితే పీలూ రాగంపై కొంత అవగాహన కలుగుతుంది. ఈ పాట  సాహిత్యాన్ని పరికిస్తే - ద్వాపర యుగంలోని యశోదయే కలియుగంలో వకుళగా జనించిందన్న పురాణ గాధల ఔచిత్యాన్ని ఒంట పట్టించుకుని - వకుళ గొంతుకు యశోద మనసు జత చేస్తూ ఆత్రేయ రాశారా అనిపిస్తుంది. ముఖ్యంగా - 'వేచి వేచి ఈ వెన్నముద్దవలె కరిగిపోయెరా నా బతుకు, పాలను ముచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా ఈ తల్లి హృదయం ఓర్వలేదయా... లాంటి వాక్యాలను గమనిస్తే మాతృ హృదయం అనే ఆలయంలో అక్షర దీపాలను పెట్టి - కవిగా తన రుణం ఆయన తీర్చుకున్నాడేమోనన్నంత ఉన్నతంగా ఉందీ భావప్రకటన. శాంతకుమారి గళం కూడా అదే తదాత్మ్యాని పంచుతుంది. ఇక ఈ పాటలో ఉపయోగించిన ముచ్చిలి (దొంగలించుట) అనే పదం తెలుగు సినిమా పాటల్లో ఆ తర్వాత వచ్చినట్టుగా లేదు.

ఈ చిత్రంలో ఎస్.వరలక్ష్మి, శాంతకుమారి పాడిన పాటలను విన్న తర్వాత ఆ స్వర్ణ యుగాన్ని తిరిగి పొందే అదృష్టం మన తెలుగు సినిమా సంగీతానికి ఉందా అని ఎవరికైనా అనిపిస్తే - కాల ప్రవాహానికి ఎదురీది నిలబడగలిగే మానవత్వపు విలువలు వారిలో ఇంకా ఉన్నట్టు లెక్క.