Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Shantha Kumari . P . / పి. శాంతకుమారి ,
Song Category : Others
Song- Ragam :
AtrEya rAsina I pATalO SAMtakumAri muKya gAyani kAgA bAla, svarNalata akkaDakkaDa gAtra sahakArAnni aMdiMcAru. 'pUrva janmalO nIvu yaSOdavu' aMTU vakuLaku nAraduDu telupagA A pUrva janma j~jApakAlaku saMbaMdhiMicana sannivESaMlO I pATa vastuMdi. svarakalpanA paraMgA adhyayanaM cEyavalasina konni aMSAlunnAyi I gItaMlO. aMdulO modaTidi mahArAShTra saMgIta praBAvaM. SAMtakumAri, pi.sUribAbu IlapATa raGurAmayya modalaina vAru nATaka raMgaM nuMci vaccina 'gAnatAralu' - mana nATaka raMgaMpai mahArAShTraku saMbaMdhiMcina marAThI saMgItapu pOkaDalu, vATi praBAvaM A rOjullO ekkuvagA uMDEdi. saMgIta darvakuDu peMDyAla kUDA nATaka raMgaM nuMci vaccina vyaktE kAvaTaM valla A dhOraNulu pUrtigA telusAyanaki. A saMpradAyAnni dRuShTilO peTTukuni I pATani Ayana TyUn cESArA ani anipistuMdi. aMdukE pATa modaTlOnU toli caraNaMlOnU toMgi cUcE 'yaman' rAgaM sinI saMgIta darSakulu alavATu cEsina yamanlA uMDadu. marAThI saMpradAyapu 'nATyagIt'lA uMTuMdi. madhyalO pIlU rAgacCAyalu kUDA kanipistU uMTAyi.
ఆత్రేయ రాసిన ఈ పాటలో శాంతకుమారి ముఖ్య గాయని కాగా బాల, స్వర్ణలత అక్కడక్కడ గాత్ర సహకారాన్ని అందించారు. 'పూర్వ జన్మలో నీవు యశోదవు' అంటూ వకుళకు నారదుడు తెలుపగా ఆ పూర్వ జన్మ జ్ఞాపకాలకు సంబంధింఇచన సన్నివేశంలో ఈ పాట వస్తుంది. స్వరకల్పనా పరంగా అధ్యయనం చేయవలసిన కొన్ని అంశాలున్నాయి ఈ గీతంలో. అందులో మొదటిది మహారాష్ట్ర సంగీత ప్రభావం. శాంతకుమారి, పి.సూరిబాబు ఈలపాట రఘురామయ్య మొదలైన వారు నాటక రంగం నుంచి వచ్చిన 'గానతారలు' - మన నాటక రంగంపై మహారాష్ట్రకు సంబంధించిన మరాఠీ సంగీతపు పోకడలు, వాటి ప్రభావం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. సంగీత దర్వకుడు పెండ్యాల కూడా నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తే కావటం వల్ల ఆ ధోరణులు పూర్తిగా తెలుసాయనకి. ఆ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని ఆయన ట్యూన్ చేశారా అని అనిపిస్తుంది. అందుకే పాట మొదట్లోనూ తొలి చరణంలోనూ తొంగి చూచే 'యమన్' రాగం సినీ సంగీత దర్శకులు అలవాటు చేసిన యమన్లా ఉండదు. మరాఠీ సంప్రదాయపు 'నాట్యగీత్'లా ఉంటుంది. మధ్యలో పీలూ రాగచ్ఛాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి.