Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Lyrics Writer : Ravuri Satyanarayana Rao / రావూరి సత్యనారాయణ రావు ,
Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా ,
Song Category : Others
Song- Ragam :
I pATanu E.eM.rAjA pADagA akkinEni nAgESvararAvu aBinayiMcAru. pATa civarna BAnumati kUDA vacci sannivESaMlO pAlgonaDaM jarugutuMdi.E.eM.rAjAku ennO maMci pATalunnAyi. A ennO maMci pATalalO ati arudugA laBiMcE pATa idi. I pATaku hiMdUsdhAnI saMpradAyAniki ceMdina Suddha sAraMg rAgAnni upayOgiMcAru. hEmaMt kumAr saMgIta darSakatvaMlO vaccina nAgin (1954) 'jAdUgar sayyA cODO morebayyA' pATa, ravi saMgItAnniccina 'dhUl kAPUl ' lO 'tErE pyAr kA As rA' anE pATa I rAgAniki maMci udAharaNalugA ceppukOvaccu. A rOjullO I rAgAnni hEMDil ceyyaTaMlO saMgIta darSakuDu nauShAd ki O oravaDi uMDEdi. I 'O javarAla ' pATatO 'ponnala nIDalalO naDayADeDi ' caraNaM muMdara vaccE iMTarlUD ni kanuka viMTE BAnumati mIda kUDa nauShAd praBAvaM uMdanipistuMdi. okasAri viMTE maLLI maLLI vinAlanipiMcE pATa idi.
ఈ పాటను ఏ.ఎం.రాజా పాడగా అక్కినేని నాగేశ్వరరావు అభినయించారు. పాట చివర్న భానుమతి కూడా వచ్చి సన్నివేశంలో పాల్గొనడం జరుగుతుంది.ఏ.ఎం.రాజాకు ఎన్నో మంచి పాటలున్నాయి. ఆ ఎన్నో మంచి పాటలలో అతి అరుదుగా లభించే పాట ఇది. ఈ పాటకు హిందూస్ధానీ సంప్రదాయానికి చెందిన శుద్ధ సారంగ్ రాగాన్ని ఉపయోగించారు. హేమంత్ కుమార్ సంగీత దర్శకత్వంలో వచ్చిన నాగిన్ (1954) 'జాదూగర్ సయ్యా చోడో మొరెబయ్యా' పాట, రవి సంగీతాన్నిచ్చిన 'ధూల్ కాఫూల్ ' లో 'తేరే ప్యార్ కా ఆస్ రా' అనే పాట ఈ రాగానికి మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఈ రాగాన్ని హేండిల్ చెయ్యటంలో సంగీత దర్శకుడు నౌషాద్ కి ఓ ఒరవడి ఉండేది. ఈ 'ఓ జవరాల ' పాటతో 'పొన్నల నీడలలో నడయాడెడి ' చరణం ముందర వచ్చే ఇంటర్లూడ్ ని కనుక వింటే భానుమతి మీద కూడ నౌషాద్ ప్రభావం ఉందనిపిస్తుంది. ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది.
రాజా
డిటిపి కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ