కళ్యాణి మాలిక్ కళ్యాణ రమణ గా ఎందుకు మారాల్సి వచ్చింది ?
నిజానికి కళ్యాణి మాలిక్ కళ్యాణ రమణ గా మారలేదు. కళ్యాణ రమణే కళ్యాణి మాలిక్ గా మారారు. పుట్టినప్పుడు ఆయనకి తలిదండ్రులు పెట్టిన పేరు కళ్యాణ రమణ. ’అన్నమయ్య’ చిత్రానికి కీరవాణి సంగీత సహకార బృందంలో ’కళ్యాణ రమణ’ అనే పేరే వుంటుంది. ఆయన మొదటసారి తన పేరుని స్క్రీన్ మీద చూసుకున్న సందర్భం కూడా అదే. ’అన్నమయ్య’ చిత్రానికి కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు వచ్చినప్పుడు కృతజ్ఞతా సూచకంగా తిరుపతికి వెళ్ళి మెట్లను కాలినడకన ఎక్కి ఆ స్వామి దర్శనం చేసుకుని తన అన్నయ్య పట్ల తనకు గల ప్రేమను వ్యక్తం చేసుకున్నారు కళ్యాణ రమణ. అదీ కళ్యాణి మాలిక్ గా పాపులర్ అయిన కళ్యాణ రమణ పేరు వెనుక కథ.