This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
News..News..News.

                 à°°à°¾à°®à°œà±‹à°—య్య శాస్త్రి వేరే పేరు తో పాటలు ఎందుకు రాశారు ?

తెలుగు లో ప్రస్తుతం విపరీతమైన బిజీ à°—à°¾ వున్న గీత రచయిత శ్రీ రామజోగయ్య శాస్త్రి వేరే పేరు తో పాటలు రాశారని తెలిస్తే ఆశ్చర్యంగానే వుంటుంది. నిజమే ... కానీ అది ఇప్పుడు కాదు. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టక ముందు. అంటే 2001 లో.  à°°à°¾à°®à°œà±‹à°—య్య శాస్త్రి గారికి సాయిబాబా అంటే ఎనలేని భక్తి.  à°¤à°¨à± పాట రాసే ముందు ’ సాయి ప్రసాదం’ అని రాసి మొదలు పెడతారు. అలాగే హైదరాబాద్ (మణికొండ) లో కట్టుకున్న ఇంటికి కూడా ’ సాయి ప్రసాదం’ అని పేరు పెట్టుకున్నారు కూడా. అప్పట్లో అంటే 2001 à°•à°¿ ముందు క్యాసెట్లకి పాటలు రాసే రోజుల్లో తన పేరుని ’సాయిచంద్ర’ అని పెట్టుకున్నారు. à°† తర్వాత à°®à±‚డు à°•à°¨à±à°¨à°¡ సినిమాలలో 5 పాటలు రాశారు. à°† అయిదు పాటలూ ’సాయిచంద్ర’ అనే పేరుతోనే వచ్చాయి. à°† పాటల వివరాలు ఇవీ :

(1)  à°…మ్మా నిన్న తోళి నల్లి (2001) (రమేష్ అరవింద్ హీరో) ఆనె మేలె అంబారి              
        (2 పాటలు - 2 వెర్షన్ లు)
(2) ఆంటీ ప్రీత్ సే (ఖుష్ బూ హీరోయిన్) (2001) ఒందు తారయ హాడిదు , స్నేహా దీపావళి
      (2 పాటలు)  (తెలుగు లో వచ్చిన ’ఆంటీ’ ఆధారంగా నిర్మించబడిందీ చిత్రం)
(3) మూరు మనసు - నూరు కణసు (2003) (ప్రేమ హీరోయిన్) మోనికా మోనికా (1 పాట)
à°† తరువాత 2004 లో విడుదలైన ’యువసేన’ నుంచి తెలుగులో తన సత్తాని చాటుకుంటూ వచ్చిన రామజోగయ్య శాస్త్రి మధ్య మధ్య తమిళ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ చిత్రాల్లో కూడా తన ప్రత్యేకతని నిరూపించుకుంటూ - ఇటీవల మళ్ళీ మరో కన్నడ చిత్రంలో 2 పాటలు రాశారు. ఈసారి మాత్రం రామజోగయ్య శాస్త్రి పేరు తోనే. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ హీరో à°—à°¾ వస్తున్న à°ˆ ’గోళీసోడా’ చిత్రం లోని పాటలు - ఎద్దెళో  à°•à°£à± బిట్ నోడో , రంగ్ రంగ్ రంగీలా ! సాయి కార్తీక్, రామ్ నాథ్ సంగీతాన్ని సమకూర్చారు. à°ˆ చితం ఆడియో à°ˆ మధ్యనే విడుదలయింది. 

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే - మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.à°¡à°¿.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌' ద్విభాషా చిత్రానికి సింగిల్ కార్డ్ రైటర్ à°—à°¾ పాటలను అందిస్తున్నారాయన. రాజమౌళి శిష్యుడు à°Ž.మహదేవన్ à°ˆ చిత్రానికి దర్శకుడు కాగా థమన్ సంగీత దర్శకుడు.
ఇదీ రామజోగయ్య శాస్త్రి గారి మారు పేరు వెనుకనున్న కథా, కమామీషూ ..
డా. రాజా (మ్యూజికాలజిస్ట్)