వేటూరి కి వర్తమాన, వర్ధమాన గాయనీ గాయకుల నివాళ
1. సామజవరగమన......శంకరాభరణం - శ్రీకృష్ణ, హిమబిందు
2. లేత చలిగాలిలో ......మూడు ముళ్లు - శ్రీతేజ, అమృతవర్షిణి
3. నడక కలిసిన......... హిట్లర్ - శ్రీతేజ, గీతామాధురి
4. నీ వయస్సులో ........ బలరామకృష్ణులు - శ్రీకృష్ణ, అమృత వర్షిణి
5. మిన్నంటి సూరీడు ..... సీతాకోక చిలుక - శ్రీకృష్ణ, సురేఖ
6. గంగోత్రి జీవన వాహిని.... గంగోత్రి - శ్రీకృష్ణ అండ్ కోరస్
7. నీ చూపు సుప్రభాతం ...... మాధవయ్యగారి మనవడు - శ్రీకృష్ణ, హిమబిందు
8. శశివదనే ..........ఇద్దరు - కృష్ణ చైతన్య, అమృత వర్షిణి
9. ప్రియతమా ప్రియతమా........ పెద్దరికం - శ్రీకృష్ణ, హిమబిందు
10. గోపెమ్మ చేతిలో ...... ప్రేమించు పెళ్ళాడు - శ్రీకృష్ణ, సురేఖ
11. యమునా తీరం ...... ఆనంద్ - శ్రీకృష్ణ, హిమబిందు
12. చెక్కిలిగింతల రాగం....... కొదమ సింహం - కృష్ణ చైతన్య, స్పందన
13. చలిగాలి కొట్టిందమ్మ ...... ఖైదీ నెం.786 - సతీష్ వినాయక్, ప్రియ
14. అచ్చా అచ్చా............. రాక్షసుడు - కృష్ణ చైతన్య, గీతా మాధురి
15. సుందరము సుమధురం .....అమావాస్య చంద్రుడు - శ్రీతేజ, గీతా మాధురి
16. హిమసీమల్లో ........ అన్నయ్య - శ్రీకృష్ణ, గీతామాధురి
17. స్వాతిలో ముత్యమంత .........బంగారు బుల్లోడు - రాహుల్, సైకా బీర్వల్
18. వయస్సునామీ .......కంత్రీ - కృష్ణ చైతన్య, వల్లి గాయత్రి
19. పాడనా వాణి కళ్యాణిగా.........మేఘ సందేశం - డీవీ మోహన్ కృష్ణ గారు
20. వాన జల్లు .........యముడికి మొగుడు - శ్రీతేజ, హిమబిందు
21. మధుర మధుర ...... అర్జున్ - శ్రీతేజ, అమృత వర్షిణి
22. సందె పొద్దుల కాడ......అభిలాష - సూర్య ప్రకాష్, సౌమ్య
23. వీణా వేణువైన ....... ఇంటింటి రామాయణం - శ్రీతేజ, మోనిక
24. సిరిమల్లె నీవే....... పంతులమ్మ - రామజోగయ్య శాస్త్రి
25. మళ్లి మళ్లి ఇది రాని రోజు ...... రాక్షసుడు - కృష్ణ చైతన్య, మృదుల
26. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ..... మాతృదేవత - కృష్ణ
ఇవీ ఈ మధ్య హైదరాబాద్ శిల్పకళా వేదిక పై ఇటీవల బాగా పాపులర్ అవుతున్న, అయిన కొందరు గాయనీ గాయకులు పాడిన పాటలు. ఈ పాటల ప్రత్యేకతఏమిటంటే - బైట అరుదుగా వినిపించే - నీ వయస్సులో , నీ చూపు సుప్రభాతం , ప్రియతమా ప్రియతమా , చెక్కిలిగింతల రాగం వంటి పాటలను ఎంపిక చేసుకుని,రిహార్సిల్స్ చేసి పాడడం; అలాగే ప్రముఖ శాస్త్రీయ సంగీత కళాకారుడు శ్రీ డి.వి. మోహనకృష్ణ ’పాడనా వాణి కళ్యాణి గా’ పాటని, ప్రసిద్ధ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ’సిరిమల్లె నీవే’ పాటని పాడడం ...
ఇవిలా వుండగా - ముఖ్య అతిథి గా వచ్చిన కోటితో పాటు, రామజోగయ్య శాస్త్రి - ఎ.ఆర్.రెహ్ మాన్ కీరవాణి వంటి వారి దగ్గర పనిచేసిన మరొక వర్ధమాన సంగీత దర్శకుడు జోశ్యభట్ల, ఈ వెబ్ సైట్ నిర్వాహకుడు రాజా - వేటూరి గారి తో తమకు గల అనుబంధాన్ని వివరిస్తూ మాట్లాడడం చాలామందిని ఆకట్టుకుంది.
ఇవి కాక - లేత చలిగాలిలో పాటను వేటూరి గారు రాయకపోయినా, రాసింది ఆయన శిష్య సమానురాలు, అప్పటి కాలానికి ఏకైక మహిళా సినీ గీత రచయిత్రి జ్యోతిర్మయి కాబట్టి ఆ పాటను పాడడం ; ఈ మధ్య పెళ్ళయిన జంట కృష్ణచైతన్య-మృదుల కలిసి పాడడం, మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గాయకుడు శ్రీతేజ తండ్రి వేణుగోపాల సత్యనారాయణ శాస్త్రి పాటలన్నిటికీ వ్యాఖ్యానాన్ని రాయగా - శ్రీతేజ తల్లి శ్రీమతి సురేఖ ఆ వ్యాఖ్యానాన్ని అందించడంతో పాటు రెండు పాటలు కూడా పాడడం - వంటివి ఈ సంగీత కార్యక్రమానికి అదనంగా జత పడిన మరికొన్ని ప్రత్యేకలు. ఎప్పుడూ సినిమా రికార్డింగ్ లు, విదేశాలలో మ్యూజిక్ షో లతో బిజీగా వుండే గాయనీ గాయకులు తమ సహ గాయకుడు శ్రీతేజ కోసం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వారి మధ్య గల స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని తెలియజేస్తోంది. రొటీన్ టివీ ప్రోగ్రామ్స్ తో విసుగెత్తి పోతున్న సినీ సంగీతాభిమానులకు ఇలాటివి రిలీఫ్ గా వుంటాయి. అవసరం కూడా ...
https://www.youtube.com/watch?v=iaCBzw_saxw&index=1&list=UU6S89ayvsU_kR0KMEhsbstA