యు.ఎస్. లో కనీవినీ ఎరుగని రీతిలో దేవిశ్రీ మ్యూజిక్ షోస్
ఇటీవల అమెరికా లో జరిగిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ షో లకు విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. నాటా సభలలో భాగంగా జరిగిన ఈ మ్యూజిక్ షో కి 10,000 మందికి పైగా హాజరవడం ఓ విశేషం. దేవిశ్రీ పాడుతూ స్టెప్స్ వేస్తుంటే ఎంజాయ్ చెయ్యడమే కాకుండా కొంతమంది స్టేజ్ ఎక్కి డాన్స్ చేశారు కూడా. అట్లాంటా లో జరిగిన ఈ షోకి ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం తనకు చాలా థ్రిల్ కలిగించిందని అన్నారు దేవిశ్రీ.
ఈ కార్యక్రమానికి జార్జ్ గవర్నర్ నాథన్ డీల్ ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలిపారు.
యు.ఎస్. లో నెలరోజుల పాటు దేవిశ్రీ మ్యుజిక్ షోస్ జరుగుతాయి. వీటిని నిర్వహిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త తిరుమల రెడ్డి మాట్లాడుతూ " దేవిశ్రీ అంటే యూ.ఎస్. లో ఎంత క్రేజ్ వుందో ఈ షోస్ ద్వారా తెలుస్తోంది. అన్నీ గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఈ షోస్ ద్వారా దేవిశ్రీ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకోగలుగుతున్నారు. దేవి తో ఈ ప్రోగ్రామ్స్ చెయ్యడం ఎంతో ఆనందంగా వుంది." అని అన్నారు.
యు.ఎస్. లోని శాన్ జోస్ ఈవెంట్ సెంటర్ ఎరీనా లో జూలై 12, 13 తేదీల్లో జరగబోయే డెవిశ్రీ ప్రోగ్రామ్ కి మొత్తం టిక్కెట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ లోనే సేల్ అవడం ఒక విశేషంగా అక్కడి రేడియో ఖుషి పేర్కొంది.
దేవిశ్రీ ని అహ్వానించిన ఫేస్ బుక్ సంస్థ
ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కి ఎంతటి ఆదరణ వుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. దేవిశ్రీ యూ.ఏస్. వచ్చిన సందర్భంగా ఫేస్ బుక్ సంస్థ తమ ఆఫీస్ కి సాదరంగా
ఆహ్వానించి ఘన స్వాగతం పలిసింది,
దేవిశ్రీ ప్రోగ్రామ్స్ పై వచ్చిన ప్రొమో తో పాటు మహేశ్ బాబు రెస్పాన్స్ ఈ లింక్ ద్వారా చూడొచ్చు .
youtu.be/y_KTl9cKaaQ