కీరవాణి, శేఖర్ కమ్ముల డ్యూయెట్
శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ’అనామిక’ కి కీరవాణి సంగీత దర్శకుడన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ రోజున వీళ్ళీద్దరూ కలిసి ఓ ప్రయోగం చేశారు. శేఖర్ కమ్ముల కథని తయారు చెయ్యడం, కీరవాణి గారికి స్క్రిప్ట్ ని ఇవ్వడం, కథ బావుందంటూ కీరవాణి గారు సిరివెన్నెల గారిని పాటలు రాయడానికి పిలవడం - వీటన్నిటినీ కలిపి ఓ స్కిట్ లా తయారు చేశారు.
ఆ స్కిట్ లో డైలాగులుండవు. పాట లాగే ఉంటుంది. ఆ పాటకి శేఖర్ కమ్ముల తీసిన ’హ్యాపీ డేస్’ లోని ’ అరెరే ... అరెరే ... మనసే జారే’ పాట ట్యూన్ ఉపయోగిస్తూ కీరవాణి ప్యారడీ పాట రాసేశారు. దీపు, కీరవాణి పాడేరు. దీపు వెర్షన్ ని శేఖర్ కమ్ముల అభినయించగా , తన వెర్షన్ కి తనే నటించారు కీరవాణి. ఎంతోఆసక్తి దాయకంగా సాగిన ఈ స్కిట్ - ఆడియో ఆవిష్కరణకే ప్రదాన ఆకర్షణగా నిలిచింది.
ఆ ప్యారడీ పాట స్కిట్ స్క్రిప్ట్ ని చూదాలని వున్నా, ఆడియోతో వినాలని వున్నా ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి. స్పీకర్ బొమ్మ వున్నచోట క్లిక్ చేస్తే ఆడియో వినొచ్చు.
వీడియో చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి