చిత్రకారుడిగా, చలనచిత్రకారుడిగా బాపు చరిత్ర కారుడు. సినీ కళాకారుల పైన, వాల్ పోస్టర్ల పైన, వెండితెర నవలల లోనూ ఆయన వేసిన సినీ రేఖా చిత్రాలు కొన్ని వేలున్నాయి. అవన్నీ కొనియాడ దగ్గవి మాత్రమే కాదు కొని దాచుకోదగ్గవి కూడా. కానీ వాటిని కొని దాచుకోవడానికి వీల్లేక పోవడంతో కేవలం కొనియాడి దోచుకుని దాచుకుంటూ వచ్చారు అభిమానులు. ఇవన్నీ గమనించి - బాపు గారు వేసిన సినీ రేఖా చిత్రాలను సేకరించి - ఓ 5000లకు పైగా ఓ పుస్తకంగా వారి అభిమాని గంధం ప్రసాద్ గారు తీసుకురానున్నారు. ఈ నెలాఖరుకు ఆ పుస్తకం విడుదలకానుంది.