This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
" నా అంత వరస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొకడు లేడు "
 â€‹à°ˆ మాటలన్నది ఎవరో కాదు ... కళ్యాణి మాలిక్ à°—à°¾ తెలుగు సినీ సంగీతాభిమానులకు పరిచయమైన కళ్యాణి కోడూరి. ఆశ్చర్యంగా వుండొచ్చు. ఆడించి అష్టాచెమ్మ (అష్టా చెమ్మ), ఇది అదేనేమో (గోల్కొండ హైస్కూల్), అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే (అలా మొదలైంది) లాంటి మంచి మంచి పాటలను అందించి ప్రేక్షక శ్రోతల హృదయాల్లో కమిటెడ్ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ à°—à°¾ గౌరవ ప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా తన గురించి తానెందుకలా అనుకుంటున్నారు అని అనిపించడం సహజం. కానీ ఆయనలా ఎందుకనుకోవలసి వచ్చిందో ఆయన మాటల్లోనే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ విందాం ....
" కళ్యాణి మాలిక్ అని మీకు పేరు పెట్టడానికి కారణం - మీ అన్నయ్య కి కీరవాణి అనే రాగం పేరు పెట్టారు కాబట్టి మీక్కూడా కళ్యాణి రాగాన్ని దృష్టిలో పెట్టుకుని , షిరిడీ సాయిబాబా ప్రభావంతో మాలిక్ చేర్చారని కొంతమంది అభిప్రాయం. క్లారిఫై చెయ్యాల్సింది మీరే ... "
"అదేం కాదండి ... మా అమ్మ గారికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఆయన్ని కళ్యాణ రమణుడు అని కూడా అంటారు కదండీ .... అంచేత కళ్యాణి అని పేరు పెట్టింది. "
"రాగ పరంగా కానప్పుడు అది ఆడవాళ్ళకు పెట్టే పేరు అని ఎవరూ అనలేదా ?"
" ఎవ్వరికీ అనిపించలేదు ... నాక్కూడా .... "
" మరి మాలిక్ ? "
" వెంకటేశ్వర స్వామి తో పాటు నాకు మల్లికార్జున స్వామి అంటే కూడా ఇష్టం. అంచేత మల్లిక్ అని కలుపుతూ కళ్యాణి మల్లిక్ అని మార్చుకుందాం అనుకున్నాను. పెద్దన్న (కీరవాణి) 'మాలిక్ అని పెట్టుకో ... బావుంటుంది ' అని సలహా ఇచ్చాడు. దాంతో అలా ఫిక్స్ అయిపోయింది ."
" ఫిక్స్ అయిపోవడం సరే, మీరది పక్కాగా రూల్స్ ప్రకారం చేశారని విన్నాను. నిజమేనా ?"
"అవునండీ ... గవర్నమెంట్ గజిట్ లో కూడా వచ్చేట్టు చేశాను. అది ఆథంటిక్ కదా ... అలాగే పాస్ పోర్ట్ లో కూడా ... కళ్యాణి మాలిక్ అనే వుంటుంది."
"మరి ఇన్ని పక్కాగా చేసుకున్న తర్వాత 'కళ్యాణి కోడూరి' అని ఎందుకు మార్చుకోవలసి వచ్చింది ? "
" దయచేసి ఆ ఒక్కటి అడక్కండి ... అది ప్యూర్లీ పర్సనల్ ..."
" పోనీ ఇది చెప్పండి ... ఈ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ, చిరంజీవి - అల్లు అరవింద్ ఫ్యామిలీ తరువాత శాఖోపశాఖలు గా విస్తరించుకున్న ఫ్యామిలీ మీది. మీ ఫ్యామిలీ లో ఇంటిపేరు ని స్వంత పేరుతో కలుపుకుని బైట పెట్టింది మొట్ట మొదట మీరే కదా ? "
"అవునండి "
" అయితే మొత్తం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎందుకంటే చాలా మందికి డౌట్లు వున్నాయి - ఎవరు ఎవరికి ఓన్, ఎవరు కజిన్ ... ఇలా ... "
" మా నాన్నగారికి మేం 6 గురం సంతానం. మొదట పెద్దన్న (కీరవాణి), తర్వాత ఇద్దరు అక్కలు, ఆ తర్వాత శ్వేతనాగు, కంచీ, చివరికి నేను. మా నాన్నగారికి వైపు బ్రదర్స్ మళ్ళీ 6 గురు. అందులో ఒక బ్రదర్ కూతురు శ్రీలేఖ ... ఇంకో బ్రదర్ విజేంద్ర ప్రసాద్ గారబ్బాయి రాజమౌళి. నా కన్నా రాజమౌళి ఏడాదిన్నర చిన్న. మొత్తం ఆ 6 గురి బ్రదర్స్ సంతానంలో కీరవాణే పెద్ద కాబట్టీ అందరం పెద్దన్న అని అంటాం ..
నా చదువు సంధ్య అన్నీ కొవ్వూరు లోనే ... శ్రీలేఖ, నేను, రాజమౌళి మేం అంతా కర్ణాటకలోనే పుట్టాం. చదువుకోసం కొవ్వూరు షిప్ట్ అయ్యాం. సినిమాల్లో ప్రయత్నించడానికి పెద్దన్న, నాన్నగారు మద్రాస్ కి షిఫ్ట్ అయ్యారు. 1989 లో పెద్దన్న చక్రవర్తి గారి దగ్గిర జాయిన్ అయ్యాడు. 1991 లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత రాజమౌళి మద్రాస్ కి వెళ్ళి , క్రాంతికుమార్ గారి దగ్గర చేరి, అమ్మ కొడుకు, సరిగమలు సినిమాలకి అసిస్టెంట్ గా వర్క్ చేసి, రాఘవేంద్ర రావు గారి దగ్గర జాయిన్ అయ్యాడు.
రాఘవేంద్ర రావు గారు ఎన్.టి.ఆర్. గారి ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా కి యాడ్స్ చేసేవారు. ఆ బ్యాచ్ లో వర ముళ్ళపూడి (ముళ్ళపూడి వెంకటరమణ గారబ్బాయి), చంద్రశేఖర్ ఏలేటి (ఐతే దర్శకుడు) తో పాటు రాజమౌళి కూడా రాఘవేంద్రరావు దగ్గర పని చేశాడు. ఆ తర్వాత శాంతినివాసం సీరియల్, స్టూడెంట్ నం. 1 ... ఇవన్నీ అందరికీ తెలిసినవే "
"మరి మీ సంగతేంటి ... మీ కెరీర్ ఎలా మొదలయింది ?"
" కృష్ణ గారి స్వంత బ్యానర్ లో వచ్చిన 'పల్లెటూరి పెళ్ళాం' కి పెద్దన్న మ్యూజిక్ డైరెక్టర్ . అందులో కోరస్ సింగర్ గా నా కెరీర్ మొదలయింది. నేనందుకున్న నా తొలి పారితోషికం 325/- రూపాయిలు"
" అసలు మీరు సింగర్ అవాలనుకుని వచ్చారని , మీ పెద్దన్న కి ఆర్డీ బర్మన్ అంటే గౌరవం అనీ, మీకు ఆర్డీ బర్మన్ ప్లస్ కిషోర్ కుమార్ అంటే ఆల్మోస్ట్ పిచ్చి అని విన్నాను. ఎంత వరకు నిజం ? "
" పిచ్చి అంటే అలాంటి ఇలాంటి పిచ్చి కాదండీ ... అసలు ఆర్డీ బర్మన్, కిషోర్ కుమార్ అనే ఇద్దరు మహా కళాకారులు పుట్టి వుండకపోతే నేను ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చి వుండే వాణ్ణి కాదేమో ? అన్నట్టు మీకో విషయం తెలుసా ? "
" ఆర్డీ బర్మన్ పై అభిమానానికి సంబంధించినదైతే ఒకటి తెలుసు. మీ పెద్దన్నకి ఫిలింఫేర్ వాళ్ళు అవార్డ్ ఇచ్చాక , గతంలో ఎవరెవరికి ఇచ్చారని చూసుకుంటే - అందులో ఆర్డీ బర్మన్ కి ఇవ్వలేదని తెలుసుకుని - కోపంతో తనకు వాళ్ళిచ్చిన అవార్డ్ ని మీ పెద్దన్న అటక మీద పడేశారని తెలుసు ... అదేనా ? "
" అది పెద్దన్నకి సంబంధించి - ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు సంబంధించి - ఇప్పటి దాకా ఇది నేనెక్కడా, ఎవ్వరికీ చెప్పలేదు. అదేమిటంటే - ఎవరైనా సరే గృహప్రవేశం చేసుకునేటప్పుడు దేవుడి ఫొటో తో కొత్త ఇంటిలో అడుగుపెడతారు. నేను మాత్రం నా కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తున్నప్పుడు చేతిలో కిషోర్ కుమార్ ఫొటో పెట్టుకుని అడుగుపెట్టాను. అంత అభిమానం, గౌరవం, భక్తి, పిచ్చి ... మీరేదంటే అది ... ఆయనంటే ... "
" ఎందుకంత అభిమానం ఆయనంటే ? "
" ఆయన పాటలు వినడం వల్లే నాకు సంగీతం మీద ఒక అభిరుచి ఏర్పడిందని నా నమ్మకం. ఇళయరాజా గారి మ్యూజిక్ ప్రభావం వల్ల మంచి సంగీతంలో మెలకువలు ఎలా వుంటాయో తెలుసుకునే అవకాశం కలిగింది. ఒక విధంగా 70 ( సెవెన్టీస్ ) లో పుట్టడం నా అదృష్టం అండీ . 60 (సిక్స్ టీస్) లో పుట్టిన వాళ్ళు మాకన్నా అదృష్టవంతులు. వాళ్ళు సంగీతంలో స్వర్ణయుగం చూశారు. "
" కిషోర్ కుమార్ - ఆర్డీ బర్మన్ కాంబినేషన్ లో ఏ పాటంటే మీకెక్కువ ఇష్టం ? "
" హీరా పన్నా లో 'పన్నాకి తమన్నా హై కి హీరా ముఝె మిల్ జాయె' పాటంటే విపరీతమైన ఇష్టం ... (ఆ పాట ఆలపించుకుంటూ) చూడండి ... ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు తల్చుకుంటున్నా శరీరం ఎలా రోమాంచితం అయిపోతోందో ... ? "
" సరే .. కోరస్ సింగర్ గా మొదలు పెట్టిన మీ కెరీర్ సోలో సింగర్ గా ఎప్పుడు మారింది ?"
" యువరత్న సినిమాలో 'సన్నజాజి పువ్వా' అనే పాట సోలో సింగర్ గా నా మొదటి పాట. సింహాద్రి 'అమ్మైనా నాన్నైనా' పాట కూడా తర్వాత పాడాను గానీ సింగర్ గా అవకాశాలు పెద్దగా రాలేదు. మ్యూజిక్ డైరెక్షన్ నేనెంచుకున్న మార్గ కాదు. అయినా టీవీ సీరియల్స్ కి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది . ప్రియాంక మొదటి సీరియల్. దానికి నందీ అవార్డ్ వచ్చింది. తర్వాత అమృతం , నాన్న సీరియల్స్ . సినిమాల్లోకొస్తే 'ఐతే ' మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి సినిమా "
" మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు ? "
" మొత్తం 10 సినిమాలు ... పదేళ్ళలో పదే పది సినిమాలు. అందుకే ఇందాక మీతో అన్నాను కెరీర్ గ్రాఫ్ లో నా అంత వరస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొకడు వుండడు అని. "
" మీ గురించి మీరే అలా అనుకుంటే ఎలా ... మీకు మంచి బ్రేక్ ని ఇచ్చిన అష్టా చెమ్మా లో ఎంత మంచి పాటలిచ్చారు ? ఆడించి అష్టా చెమ్మా పాట శ్రీకృష్ణ కి లైఫ్ టైమ్ సాంగ్ అయిపోయింది కదా ? "
" ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మీరిప్పుడు చెప్పిన 'ఆడించి అష్టా చెమ్మా' పాట, ఆ సినిమాలోదే 'తిడతారా కొడతారా' పాట అష్టా చెమ్మా కోసం చేసినవి కావు. 'బాస్ ' సినిమా కోసం చేసినవి. అక్కడ రిజెక్ట్ అయ్యాయి. అష్టా చెమ్మా కి మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఈ పాటలు, ఇవి రిజెక్ట్ అయిన విషయం అన్నీ దర్శకుడు మోహన్ కృష్ణ కి చెప్పి, పర్మిషన తీసుకునే వాడాను. "
" మరి అష్టా చెమ్మా లో హల్లో అంటూ పిలిచి పాట ఎంత డిఫరెంట్ కంపోజిషన్ ? ఆ రకం బీట్స్, ఆ మెలొడీ - ఈ రోజుల్లో ఎవరైనా ఇచ్చారా ? "
" నిజమే ... ఆ బీట్స్ ని వాల్ట్ జ్ బీట్స్ (waltz beats) అంటారు. ఉదాహరణకి చెప్పాలంటే ఎమ్జీఆర్ నటించిన ' పణమ్ పడైత్తవన్ ' సినిమాలో ఎమ్మెస్ విశ్వనాథమ్ గారు 'కణ్ పోన పోక్కిలే 'అనే పాటలో ఈ రకం బీట్స్ ని ఉపయోగించారు."
( హల్లో డార్లింగ్ మాట్లాడవా (శభాష్ రాముడు) పాటకి ఒరిజినల్ అయిన ఏ దిల్ హై ముష్కిల్ జీనా యహా (సి.ఐ.డి) , జీనా యహా మర్ నా యహా (మేరా నామ్ జోకర్) , జానే కహా గయే ఓ దిన్ (మేరా నామ్ జోకర్) ఈ పాటలలో వినిపించేది వాల్ట్ జ్ బీట్సే)
" ఆ టైప్ బీట్స్ నే మీరెందుకు ఉపయోగించారు ? "
" 70 ల ( సెవెన్టీస్ ) మీద మమకారం "
" మీరు ట్యూన్ చేసిన పాటల్లో మీకు నచ్చినది ఏది ? "
" గోల్కొండ హై స్కూల్ లోని ' ఇది అదేనేమో ' "
" అష్టా చెమ్మా లో 'హల్లో అంటూ పిలిచి ' పాటలో శ్రీకృష్ణ తో పాటు వినిపించిన ఫిమేల్ వాయిస్ ఎవరిది ... సుష్మ అని వుంది ..."
" ఆ అమ్మాయి మీక్కూడా తెలుసండీ ... వరల్డ్ స్పేస్ లోనూ, రేడియో మిర్చి లోనూ పనిచేసింది .. తెల్లగా వుంటుంది , కళ్ళజోడు పెట్టుకుంటుంది .. "
" గుర్తొచ్చింది ... ఆ అమ్మాయి తోనే ఎందుకు ? "
" వీలయినంతవరకు కొత్త వాళ్ళకి చాన్స్ లివ్వాలని వుంటుందండీ ... ఎందుకంటే ఒక సింగర్ గా చాన్స్ ల కోసం నేనెంత ఎదురు చూసేనో ఆ బాధ నాకు తెలుసు ..."
" అలా మొదలయింది లో నిత్యా మీనన్ తో పాడించడం ఈ ప్రాసెస్ లో వచ్చిందేనా ? "
" నిత్య రియల్ గా ఒక పొఫెషనల్ సింగర్. తను సెట్స్ లో పాడడం నందిని (నందినీ రెడ్డి) వింది. పాడిద్దామంది. వింటే వాయిస్, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ అద్భుతం ... అలా ఒక పాట అనుకుంటూనే రెండు పాటలు పాడించేశాం "
" అవును ... 'అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే' పాట లో ' ఊహల్లో ' దగ్గిర ఆ అమ్మాయి గొంతులో పెర్ఫెక్ట్ గా పలికిన బేస్ కి నిజంగా హ్యాట్సాఫ్ ... "
" అంతే కాదండీ ... ఆ అమ్మాయి చాలా తెలివైంది. తెలుగు నేర్చుకుని, తన డబ్బింగ్ తానే చెప్పుకోవడమే కాకుండా పాటలు కూడా పాడేస్తోందంటే ఎంత టాలెంటెడ్ కాకపోతే అతి తక్కువ టైమ్ లో ఇన్ని సాధిస్తుంది ? అన్నట్టు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలండీ ... అష్టా చెమ్మా, అలా మొదలైంది టైటిల్స్ నేను పెట్టినవే "
" రెండూ ' అ' తో మొదలైనవే "
" ఒక విధంగా ' అ, ఆ ' తో మొదలైనవి నాకు కలిసొస్తాయనిపిస్తుంది "
" ఎలా ? "
" ఆంధ్రుడు, అష్టా చెమ్మా, అలా మొదలయింది, త్వరలో రిలీజ్ కాబోయే - అంతకుముందు ఆ తర్వాత ... ఇలా ... "
" మధ్యలో 'అధినాయకుడు' ఫ్లాపు ... అది ఒదిలేశారు ? "
" కరక్టే ... అది సినిమా ఫ్లాప్ అయినా పాటలకు మంచి మార్కులే పడ్డాయి. విచిత్రం ఏమిటంటే రిలీజ్ కి ముందు పాటలు బావున్నాయని ఎంత టాక్ వచ్చినా సినిమా ఫ్లాప్ అయితే చాలు ఆ పాటల ఊసెత్తరు మనవాళ్ళు ..."
" నిజమే ... ఈ క్వాలిటీ ఒక్క తెలుగు సినీ పరిశ్రమ కే స్వంతం. అందుకు మీ పెద్దన్న గారి పాండురంగడే పెద్ద ఉదాహరణ. సరే ... ఇది చెప్పండి . రాజమౌళి ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా మిమ్మల్ని ఎందులోనైనా వాడుకోవచ్చు కదా ? "
 
రాజా (మ్యూజికాలజిస్ట్)