ప్రభాస్ హీరోగా 'రాఘవేంద్ర' అనే సినిమా 2003 లో వచ్చింది. అందులో 'నమ్మిన నా మది మంత్రాలయమేగా' అనే పాట బాగా హిట్ అయింది. ఆ పాట పల్లవి లో 'నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగా దళాల సేవా తులసి దళాల పూజా అందుకో' అని వినిపిస్తుంది.
నిజానికి తుంగ (భద్ర) అనేది జలం, తులసి అనేది దళం అలా కాకుండా 'తుంగా దళాల సేవా తులసి దళాల పూజా' అని వుండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. (తుంగా జలాల సేవ, తులసీ దళాల పూజ అని వుండటం కరెక్ట్)
వెంటనే ఆ పాటను రాసిన వేటూరి వారి దగరికి వెళ్ళి అడగడం జరిగింది. ఆయన నమ్మలేక పోయారు. టేపు వినిపించాను. 'నా ఖర్మ కాలిపోయిందయ్యా ' అంటూ నుదుటి మీద అరచేత్తో ఠప ఠప ఠప ఠప మని కొట్టుకున్నారు. "నేనెంత శుభ్రంగా రాస్తానో నీక్కూడా తెలుసు కదా ... మళ్ళీ అసిస్టెంట్ లతో రాయిస్తారు. సగం తప్పులు వీటి వల్లే జరిగిపోతుంటాయి. పోనీ ఫెయిర్ చేశాక చూపిస్తారా అంటే మళ్ళీ ఉరుకులు పరుగులు. మన తల రాత బాగులేనప్పుడు చేతి రాత ఎంత బాగుండి ఏం లాభం ?" అంటూ తెగ మథనపడిపోయారు వేటూరి. కావాలంటే ఆ పాటలో ఆ లైన్లు విని చూడండి.
రాజా (మ్యూజికాలజిస్ట్)
Gumma Ramalinga Swamy
ఎంతటి వారికయినా ఈ పొరపాట్లు తప్పవు. పెద్దమనిషి కనుక తల బాదుకున్నాడు. సున్నిత మయిన చిన్న తప్పులను బయటికి తీసి నొప్పించ కుండా చెప్పడం మీకే చెల్లు - రాజా.
Aug 30, 2013