ప్రముఖ నటుడు చలపతి రావు తో 'దాన వీర శూర కర్ణ' లో ఎన్టీఆర్ నాలుగైదు పాత్రలు వేయించారట. 'ప్రేక్షకులు గుర్తు పట్టేస్తారు అన్నగారూ' అని అంటే 'ఏం ఫర్వాలేదు బ్రదర్' అని పట్టుబట్టి మరీ వేయించారటాయన. ఆ రోజుల్లో అటువంటివి చాలా సహజంగా జరిగేవి. 'మాయాబజార్' లో ఘటోత్కచుణ్ణి చూసి మూర్చపోయిన ద్వారపాలకుడి గానూ, రేలంగికి అనుచరుడి గానూ బాలకృష్ణ నటించినట్టు ....
1960ప్రాంతాల్లో దాదాపు అందరు హీరోలతోనూ నటించిన టాప్ హీరోయిన్ రాజశ్రీ ఆమె తొలి రోజుల్లో ఏవీయమ్ వారి ఆర్టిస్ట్. అంచేత వారు తీసిన 'భూకైలాస్' చిత్రంలో జమున చెలికత్తెలలో ఒకరుగా నటించింది. ఆ చిత్రంలో జమునపై చిత్రీకరించిన 'అందములు విందులయే అవని ఇదేనా' పాటలో ఆమె ప్రముఖంగా కనిపిస్తుంది. అంతేకాదు రావణాసురుణ్ణి ఆవహించడానికి మహావిష్ణువు పంపించిన మాయగా కూడా నటించిందామె. మాయ గా నటించిన సన్నివేశాల్లో ఆమెను పెద్ద తెరపై గుర్తుపట్టొచ్చు.