ఇది పూర్తిగా విన్న కథ. కర్ణాకర్ణిగా బాలీవుడ్ లో ఒకానొక రోజుల్లో చెప్పుకునేవారే తప్ప దీనికి ఆధారం లేదు.
ఉత్తరాది సంగీత దర్శకులు లక్ష్మికాంత్-ప్యారేలాల్ ద్వయానికి మరొక సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ అంటే పడేది కాదట. ఆర్డీ బర్మన్ ని అతని తండ్రి ఎస్.డి. బర్మన్ ముద్దుగా 'పంచమ్' అని పిలుచుకునేవారు. చిన్నప్పట్నించీ ఆర్డీ. బర్మన్ ఆర్కెష్ట్రా లో వుండేవాడు కనుక ఆర్కెష్ట్రా వాళ్లు కూడా ఆ పేరు తోనే ఆర్డీ బర్మన్ ని పిలిచేవారు. ఏ సంగీత దర్శకుడైనా ఆర్కెష్ట్రా కి నొటేషన్ చెప్పాల్సి వస్తే పాటలో గనుక ’ప’ అనే స్వరం వుంటే ’ ఇధర్ పంచమ్ డాల్ నా’ అని చెప్పి తీరాలి. ’పంచమ్’ అంటే ఆర్డీ బర్మన్ పేరు పలికినట్టే అవుతుందని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల పాటలు ’ ప ’ అనే స్వరం లేకుండా, అది పలకాల్సిన అవసరం రాకుండా తమ పాటలను స్వరపరిచారట లక్ష్మికాంత్-ప్యారేలాల్.