ఆ లైన్స్ ని రాసిందెవరు ?
’ఉలవచారు బిర్యాని’ సినిమా బిగినింగ్ లో అక్కినేని నాగేశ్వర రావు మొదలైన నలుగురి ప్రముఖుల మరణానికి చింతిస్తూ, వారి ఔన్నత్యాన్ని ప్రసంశిస్తూ ఓ టైటిల్ కార్డ్ ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ తో వస్తుంది. కానీ అందులోని మ్యాటర్ని రాసిందెవరు ? ’ఇలా ఫలానా ఫలానా వారి సేవలను గుర్తుచేసుకుంటూ వారికి నివాళిగా ఓ నాలుగు వాక్యాలను చెపాలనుకుంటున్నాను. అవి కవితాత్మకంగా వుంటే బావుంటుంది. మీరు రాసివ్వగలిగితే ఇంకా బావుంటుంది. ఇస్తారా ? ’ అని చంద్రబోస్ ని అడిగారు ప్రకాశ్ రాజ్. అలాగేనని రాసిచ్చారు చంద్రబోస్. ఆ వాక్యాలనే చదివారు ప్రకాశ్ రాజ్. అదీ సంగతి.