This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
 
గురుదత్ భార్య పాట పాడిన ఏయన్నార్ సినిమా ఏది  ?
ఎస్పీ కోదండపాణి సంగీతంలో వచ్చిన సినిమాలో గీతాదత్ పాడిన పాట ఏది ?
 
ఏ మ్యూజిక్ క్విజ్ లోనైనా ఇలాంటి ప్రశ్నలడిగితే ఆన్సరిచ్చే వాళ్ళు దొరకడం కష్టం.
వీటికి ఆన్సరుందా అంటే - అక్కినేని నటించిన 'మంచి కుటుంబం' సినిమాకి 
సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి. ఆ సినిమాలో  గీతాదత్ పాడిన 'డింగ్ డాంగ్
డింగ్ డాంగ్ డింగ్ లల్ల' అనే పాటుంది - అని జవాబు చెప్పొచ్చు. 
అసలివి నిజమైన ప్రశ్నలేనా అని లోతులకెళితే మాత్రం కరెక్ట్ కాదని ఒప్పుకోవలసి వస్తుంది.
 
జెమిని వాళ్ళు హిందీ లో తీసిన  'గృహస్తి' సినిమాలోదా పాట. ఆ పాటని ట్యూన్ చేసింది 
రవి. ఆ సినిమాని అటు తమిళం లో 'మోటార్ సుందరం పిళ్ళై' గా, తెలుగులో 'మంచి
కుటుంబం' గా తీసినప్పుడు సందర్భానికి సూట్ అవుతుందని ఈ పాటని యధాతధం గా
సీన్ తో సహా వాడుకున్నారు. అలా రవి పాట తెలుగు సినిమాలోకి డైరెక్ట్ గా వచ్చేసిందన్న 
మాట. 
కాకపోతే అంతకు ముందూ, ఆ తర్వాతా రవి చేసిన ట్యూన్లు తెలుగు సినిమాల్లోకి వచ్చేసిన 
సందర్భాలు చాలా వున్నాయి .
 
నిన్ను చూడనీ  నన్ను పాడనీ  (మనుషులు- మమతలు) - www.youtube.com/watch
(ఎ ఖామోషియా ఎ తన్ హాయియా - యే రాస్తే హై ప్యార్ కె)  www.youtube.com/watch
 
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు (మూగనోము)           www.youtube.com/watch
 
(తుమ్హారీ నజర్ క్యోం కఫా హోగయీ - దో కలియా)
అన్నా అన్నా విన్నావా చిన్నీ కృష్ణుడు వచ్చాడు (ఇలవేల్పు)
చందామామా దూర్ కి (వచన్)
 
 అందచందాల ఓ  తారకా (వరుడు   కావాలి) 
(ముస్కురాతీ హుయీ చాంద్ నీ - అల్బేలీ)            
 
నీలిమేఘ మాలవో నీలాల  తారవో (మదన కామరాజు కథ) 
(చౌద్ వీ క చాంద్ హో - చౌద్ వీ కా చాంద్) 
 
ఇవిలా వుండగా ఒరిజినల్ సినిమాని పూర్తిగా హక్కులతో సహా కొనుక్కోవడం వల్ల 
ఆయా సినిమాల్లో రవి చేసిన ట్యూన్లు ( కొన్ని) తెలుగులో పాపులరైనవి వున్నాయి.
అలా 
'మా బాబు' లోని 'బాబూ నిద్దుర పోరా '
'చల్ చలో యని స్వారి చేసెను' పాటలకి
'చిరాగ్ కహా రోష్ని కహా' లోనూ,
'భలే తమ్ముడు' లోని 'ఎంతవారు గాని' , 'గోపాల బాల నిన్నే కోరి' , 'గుమ్మా గుమ్మా 
గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా' పాటలకి 'చైనా టౌన్' లోనూ, 
'భలే అబ్బాయిలు' లోని 'గులాబీలు పూసేవేళ' , 'ఎవరో నా మది లో' , 'ఏమౌనో 
ఈవేళలో' పాటలకి 'వక్త్' లోనూ 
'మొనగాళ్ళకి మొనగాడు' లోని 'నేనున్నది నీలోనే' , 'వచ్చామే నీ కోసం' పాటలకి
'ఉస్తాదోం కె ఉస్తాద్' లోనూ వున్న ఒరిజినల్స్ ని చెప్పుకోవచ్చు.
 
ఇదిలా వుండగా 'భక్త జయదేవ' లోని 'నీ మధు మురళీ గానలీల' పాటకి ('స్వర్ణ మంజరి' లోని
'ఝనన ఝనన ఝణ నాదమే నాట్యం' పాటక్కూడా) 'నర్సీ భగత్' లోని 'దర్శన్ దో ఘన్ శ్యాం'పాటా,
'పెద రాయుడు' లోని 'కదిలే కాలమా' పాటకి 'హమ్ రాజ్' లోని 'యే నీలే గగన్ కి తలే' పాటా -
ఇన్స్పిరేషన్ అని విశ్లేషించే వారు కూడా లేకపోలేదు. ఇవి కూడా రవి ట్యూన్లే.
 
('ఉస్తాదోం కె ఉస్తాద్' లో 'మైనే కహాతా ఆనా సన్ డే  కో సన్ డే కో' పాటని
మనవాళ్ళు 'గూఢచారి 116 ' లో 'మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి' పాటకి 
వాడుకున్నరనే వాళ్ళున్నారు. కాకపోతే ఈ రెండిటికీ మూలం 'నెవర్ ఆన్ సన్ డే'
అనే ట్యూనుంది కనుక రవికి పూర్తి క్రెడిట్ ఇవ్వడం న్యాయం కాదు.)
 
ఇలా మన తెలుగు ప్రేక్షకులు 'ఇవి రవివి ' అని తెలిసో తెలియకో చాలా ట్యూన్ లు ఆయన చేసినవి 
ఎంజాయ్ చేసేసారు.ఇక రవి సంగీతాన్నిచ్చిన హిందీ సినిమాల్ని వాటిలోని పాటల్నీ ఉత్తరాది ప్రేక్షకులతో సమానం గా ఆదరించిన దక్షిణాది ప్రేక్షక శ్రోతలు కోకొల్లలు. 
 
సి యే టి క్యాట్- క్యాట్ మానె బిల్లీ, హమ్ కో మోహోబ్బత్ కరేగా (దిల్లీ కా థగ్),
చౌద్ వీ కా చాంద్ టైటిల్ సాంగ్,  యే హవా యే హవా, ఆజా ఆజారే తుఝ్ కో మేరా ప్యార్ పుకారే,
చలో ఇక్ బార్ ఫిర్ సే, ఆప్ ఆయే తో ఖయాలే (గుమ్ రాహ- తెలుగులో అభినందన), నీల్ గగన్ కి ఉడ్ తీ బాదల్ (ఖాన్ దాన్- తెలుగులో కలసి వుంటే కలదు సుఖం ),  జబ్ చలీ టండీ హవా (దో బదన్), న ఝట్ కో జుల్ఫ్ కె పానీ (షెహనాయి), తోరా మన్ దర్పన్ కేహలాయే , మేరె భయ్యా మేరె చందా , చూలేనేదో నాజుక్ హోటోం కో, యే జుల్ఫ్ అగర్ జుల్ఫే (కాజల్- తెలుగులో మా ఇంటి దేవత ), 
షిశిసే పీ, యే పైమానే సే పీ (ఫూల్ ఔర్ పత్తర్ - తెలుగులో నిండు మనసులు ) తుజ్ కో పుకారే మేరా ప్యార్, బాబుల్ కి దువాయే ( నీల్ కమల్ ), ఇవి కాక హమ్ రాజ్, వక్త్ లాంటి అల్ సాంగ్స్  హిట్ సినిమాలు ఎన్నో వున్నాయి రవికి. 
 
1926 మార్చ్ 3 న  ఢిల్లీ లో పుట్టిన రవికి తండ్రి పాడే భజనల నుంచే సంగీతం అబ్బింది. తనకు తాను గా హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం  కోసం కొన్నాళ్ళు ఎలక్ట్రీషియన్ గా పని చేసాడు. సింగర్ గా సెటిలవుదామని 1950 లో బొంబాయికి వచ్చేసాడు. ఇల్లు లేదు వాకిలి లేదు రోడ్ల మీదే మకాం. అలా హేమంత్ కుమార్ దృష్టిలో పడ్డాడు. 'ఆనంద్ మఠ ' లో 'వందే మాతరం' పాట లో కోరస్ పాడడానికి తీసుకుపోయాడు హేమంత్.
 
ఆ తర్వాత కథ అతని పాటల ద్వారా అందరికీ తెలిసిందే . అటు మహేంద్ర కపూర్ కి, ఇటు ఆశా భోంస్లే కి రవి పాటలే కొత్త లైఫ్ ఇచ్చాయని హిందీ సినీ సంగీత చరిత్ర తెలిసిన ప్రతివారూ ఒప్పుకుంటారు. ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్ అని అందరూ అనుకుంటూ వుండగా మ్యూజిక్ చేసిన 'నిక్కా' సినిమాలోని 'దిల్ కె అర్ మా' పాటతో సల్మా ఆగా బెస్ట్ సింగర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ తెచ్చేసుకుంది.  
 
ఆ తర్వాత బాంబే రవిగా మళయాళ చిత్రాలకు సంగీతం ఇస్తే రెండు సార్లు ( 'నక్షత్రంగల్' సినిమాలోని 'మంజల్ ప్రసాదవుమ్ ' పాటకి,  'వైశాలి' లోని 'ఇందుపుష్పం' పాటకి)  చిత్ర కి నేషనల్ అవార్డ్ 
వచ్చింది . మధ్యలో 'మహాభారత్' టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ తో ప్రాంతీయ బేధాల్లేకుండా దేశం మొత్తం ఇంటింటా రవి పేరు మార్మోగి పోయింది. అప్పటివరకూ ఆయన సంగీతాన్ని వేరే దారుల్లో తీసుకున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ 'సరిగమలు' చిత్రంతో నేరుగా స్వాగతం పలికింది. ఆ సినిమాలో జేసుదాసు పాడిన 'స్వర రాగ గంగా ప్రవాహమే' పాట ఔత్సాహిక గాయకులకి , మంచి పాటల కోసం ఎదురు చూసే శ్రోతలకి ఓ వరం లా నిలిచిపోయింది. 'ఎవరీ రవి ? ' తెలుగు వాళ్ళందరూ అడిగేలా చేసింది.
'సరిగమలు' సినిమాకి పాటలు రాసిన వేటూరి - ఆ పాటల గురించి , రవి గురించి ఇలా అన్నారు .
" ఇహానికి పరానికి పనికొచ్చే సాహిత్యం సృష్టించే ఆవకాశం వున్న సినిమాలు ఎప్పుడో గాని రావు. సంగీత సాహిత్య భరితమైన 'సరిగమలు' చిత్రం - పాటల రచయితగా నాకెంతో తృప్తిని , మంచి పాటలు రాశానన్న నమ్మకాన్ని కలిగించిన చిత్రం. దానికి కారణం - అన్నీ ట్యూన్ కి రాసిన పాటలైనప్పటికీ - ఇచ్చిన ట్యూన్ లు సందర్భానికి పనికి వచ్చేవిగా , సాహిత్యానికి ఉపకరించేవిగా , ప్రేరణ కలిగించే విధంగా వుండడం. ఈ చిత్రం లోని పాటలు ఇంత ప్రసిద్ధి పొందడానికి మూల కారకుడు - మహా సంగీత విద్వాంసుడు - మా అందరికీ పూజనీయుడు అయినటువంటి రవి. ఆయన ఇచ్చిన ట్యూన్లలోని శక్తే నాచేత అటువంటి పాటలు రాయించింది. రవి గారు ఇచ్చిన ట్యూన్ల వల్ల నేను రాసిన సాహిత్యం అక్కరకొచ్చింది. 'సరిగమలు' లో నేను రాసిన ప్రతీ పాటకీ నా మది లో గూడు కట్టుకున్న భావాలు అక్షరాలుగా మారి అమృతోపమానమైన సంగీత ప్రవాహంలో పూల పడవల్లా తేలి మీ హృదయ తీరాలకు చేరాయి ".
 
సర్వలోకాలకు చెందిన ఆ రవి కి అస్తమయం లేనట్టే స్వరలోకాలకు చెందిన ఈ రవికీ అస్తమయం లేదు. మరణం మరు జన్మకి శ్రీకారం అనుకుంటే మనం చెప్పే ఈ వీడ్కోలే వేడుకోలై స్వాగత వచనం  పలుకుతుంది. అందుకు వేటూరి వారి వాక్యాలే సాక్ష్యం, నివాళీ కూడా ... 
 
రాజా (మ్యూజికాలజిస్ట్)
 
The music of Bombay Ravi is an eternal flow of melody
by Musicologist Raja


In one of the movies of Akkineni Nageswara Rao, Guru Dutt’s wife rendered a song.  Can you name that movie? In a Telugu movie, with S.P.Kodandapani as its music composer, Geeta Dutt rendered a song.  What is that song?

If these kinds of questions are asked in any music quiz, it is very difficult to find people who can answer them. Do we know the answers to these questions? S.P Kodandapani is the music director for Manchikutumbam in which Akkineni Nageswara Rao is the hero.  This movie has a song 'Ding Dong Ding Dong Ding Lalla', and this song was sung by Geeta Dutt.  This could be an answer to above questions.  Are these questions really genuine in the first place?  If we make an in-depth study, we have to agree that these questions are not truthful.  In fact, this song is from the Hindi movie Gruhasthi made by Gemini, and this song was tuned by Ravi. Later this movie was remade in Tamil as Motor Sundaram Pillai and in Telugu as Manchikutumbam.  This song and the related scenes have been used in Manchikutumbam without any changes, since it has been felt that they are well-suited to the situations in the remade movie.  This is how Ravi’s song directly appeared in Telugu movies for the first time.  

However, there are several other instances where his tunes appeared in Telugu movies.  ‘Ninnu Choodanee Nannu Paadanee’(Manusulu Mamathalu) has his tune ‘Yeh Khamoshiyan Yeh Tanhaiyan’(Yeh Raaste Hain Pyar Ke).  ‘Ee Vela Naalo Enduko Aasalu’(Mooga Nomu) has Ravi’s tune ‘Tumhari Nazar Kyun Khafa Ho Gayi ’(Do Kaliyan). ‘Ninnu Anna Anna Vinnnava Chinni Krishnudu Vachchadu’(Ilavelpu) is based on ‘Chanda Mama Door Ke’(Vachan). ‘Andachandaala O Tharaka’(Varudu Kavali) is also a tune of Ravi—‘ Muskrati Hui Chandni’ (Albeli), ‘Neelimegha Maalavo Neelala Tharavo’(Madana Kaamaraju Katha) ‘Chaudhavin Ka Chan Ho’(Chaudhavin Ka Chand).  Let us leave these tunes for a while.

When the original Hindi movies were bought for remaking with full rights, there are several instances where Ravi’s tunes appeared in Telugu movies and became very popular. In this way, two songs ‘Baaboo Nidduraporaa’ and  ‘Chalo Chaloyani Swaari Chesenu’ (Maa Baabu) have their base in ’Chirag Kahan Roshni Kaha’—three songs ‘Enthavarugaani’, ‘Gopaalabala Ninne Kori’, ‘Gumma Gumma Gummethinche Muddulagumma’(Bhale Thammudu) are based on China Town—three songs ’Gulaabheelu Poosevela’, ‘Evaro Naa Madilo’, ‘Emouno Eevelalo’(Bhale Abbayelu) are based on Waqt. The two songs’ Nenunnadi Neelone’, ‘Vachchame Nee Kosam’ (Monagallaki Monagaadu) are based on Ravi.s tunes from Ustaadon Ke Ustad.

All these tunes apart, there are also opinions that ‘Nee Madhu Muralee Gaanaleela’ from Bhakta Jayadeva, (as well as ‘Jhanana Jhanana Jhana Naadame Naatyam’ from Swarnamanjari) are inspired by ‘Darshan Do Ghanshyam Nath’from Narsi Bhagat—and in a similar fashion ‘Kadile Kaalama’ from Pedaraayudu is inspired by ‘Neele Gagan Ke Tale’ from Hamraaz.  All these tunes are created by Ravi. There are also people who believe that the tune ‘Maine Kahan Tha Aana Sunday Ko’ from Ustaadon Ke Ustad  has been used in Goodachaari 116 as ‘Manasutheera Navule Navvule Navvali’.   Nevertheless there is an English tune ‘Never on Sunday’ which is the origin of both these tunes.  So it is not fair to give full credit to Ravi as far as this’ tune is concerned.

In this way, knowingly or unknowingly, Telugu film audience enjoyed several tunes created by Ravi, and few people know their origins.  The number of music lovers from the South who enjoyed the music of Hindi movies with Ravi’s tunes along with those in the North are really uncountable.  ‘C A T Cat, Cat Mane Billi’, ‘Hum To Mohabbat Karega’ (Dilli Ka Thug), the title song of ‘Chaudhavin Ka Chand’; and ‘Yeh Hawa’, ‘Aa Bhi Ja’, ‘Aaja Aajaare Tujhko Mera Pyar Pukare’, ‘Chalo Ek Baar Phir Se’, ‘Aap Aaye Tho Khayale’(Gumrah). Incidentally Gumrah is remade as Abhinandana in Telugu.  ‘Neel Gagan Par Udte Baadal’(Khandaan—remade in Telugu as Kalasivunte Kaladu Sukham),  ‘Jab Chali Thandi Hawa’(Do Badan), ‘Na Jhatko Zulf Se Pani’(Shehnai), ‘Tora Mann Darpan Kehlaye’, ‘Mere Bhaiyaa Mere Chanda Mere’, ‘Chu Lene Do Nazook Hoton Ko Kaajal’, ‘Ye Zulf Agar Khul Ke’(Kaajal—remade in Telugu as Maa Inti Devatha), ‘Sheeshe Se Pee Ja Paimane Se Pee’(Phool Aur Patthar—remade in Telugu as Nindu Manasulu), ‘Aaja Tujko Pukare Mere Pyar Ho’, ‘Babul Ki Duwaein Leti Ja(Neel Kamal),  In addition, there are several super hit Hindi movies like Hamraaz and Waqt  that are full of hit songs.

Born on 3 March 1926 in Delhi, Ravi learnt the basics of music by playing harmonium for the bhajans sung by his father.  He learned to play harmonium all by himself without taking any lessons from anyone. He worked as an electrician in order to support his family.  He arrived in Bombay with an intention to settle as a singer in 1950. He did not have a house to live and roadside pavements offered shelter to this genius.  In this way he was spotted by Hemanth Kumar. Hemanth Kumar took Ravi to make use of his voice in the chorus of the song ‘Vande Matharam’  in Anand Math. The rest is history, and Ravi became very popular with all music lovers. All people, who are familiar with the history of Hindi film music, agree that the tunes of Ravi gave a new life to Mahendra Kapoor as well as Asha Bhonshle. When everyone were thinking that he was on the verge of retiring from his music career, his composition  ‘Dil k Armaan’ for Nikah fetched Salma Aga the Filmfare best singer award.Later as Bombay Ravi he offered music for Malayalam movies, and Chitra won National award twice from his movies: ‘Manjal Prasadavum’ from Nakshathrangal, ‘Indupushpam’ from Vaisali. In the meantime, the title song of Mahabharat TV serial composed by him won the hearts of all—transcending all regional barriers of our country and this song reverberated in all homes without exception. The movie world, that made use of his musical creations up till then in several other ways, invited his music in a totally different way in Sarigamalu directly, and the song ‘Swara Raga Ganga Pravahame’ sung by Jusudas in that movie is a masterpiece forever. The song ‘Swara Raga Ganga Pravahame’ has turned into a gift to all enthusiastic singers and listeners looking for music of good taste. This song made all music lovers of Telugu film world to contemplate: “Who is this Ravi?” Veturi, who wrote all the lyrics for Sarigamalu, has thus commented on Ravi and his music.

“We rarely come across movies that give an opportunity to create lyrics that help us in our earthly life and in our next life. The movie Sarigamalu is an excellent fusion of music and literature. It gave me immense satisfaction as its lyricist, and it made me believe that I wrote good lyrics for the movie. The reason for this is the inspiration of the tunes offered by Ravi.  While I wrote all the lyrics of this movie to pre-composed tunes, the tunes are perfectly suited to situations, and gave me scope to go after good literary values with the inherent musical inspiration of the tunes. The foremost reason for the unprecedented popularity of these songs is its composer—the great musical genius—Ravi—a highly venerable person.  It is the power in his tunes that made me inscribe all the lyrics with meaningful words.  His tunes forged a new animation into my lyrics. In every lyric that I wrote for Sarigamalu, several of my thoughts that remained dormant till then found expression in words, and surged forward like flower boats, under the influence of the ambrosial musical flow and reached their final shores of the hearts of their audience.”
   
The word Ravi literally means sun. There is no permanent setting to the sun who brings light to all worlds. If death is understood as a goodbye to the present life, it also is an invitation to the forthcoming life.  The words spoken by Veturi lend evidence to this adage, and it is also a tribute to the great composer Ravi who breathed his last on 7 March 2012.

Translator: suryaprakash.mothiki@yahoo.com