దటీజ్ చంద్రబోస్
ఈ ప్లేట్ లను చూస్తుంటే పూర్వం వచ్చే గ్రామ్ ఫోన్ రికార్డ్ ల్లా వున్నాయి కదూ !? నిజానికి ఇవి -వేడి తగ్గకుండా - టీ కప్ ల మీద పెట్టే టీ కోస్టర్స్. ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు చంద్రబోస్ చూసి - ఇలాటి తమాషా ఐటమ్స్ అంటే నాకు ఇష్టం అని గుర్తొచ్చి - కొని తీసుకొచ్చారు. ఇటీవల నాకు ఒంట్లో బావులేదని తెలిసి ( ప్రస్తుతం బాగానే వుంది) నన్ను చూడడానికి తన భార్య సుచిత్ర తో మా ఇంటికి వచ్చి , ఓ గంట గడిపి, ఈ టీ కోస్టర్స్ ఇచ్చి వెళ్ళారు. చంద్రబోస్ కి నేనంటే ఎంతో గౌరవం. 'ఆయన మా సంగీత సాహిత్య కుటుంబానికి పెద్ద' అని అంటుంటారు నా గురించి. ఇలాంటి మధురానుభూతుల్ని మనసులో దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలం ?