అహో ... ఆంధ్ర భోజా ...
పెరియారు మహాశాయా
ఉడిపి హొటలు నిర్మాణ తేజో విరాజా
ఈ కలశాలలో చిరంజీవివైనావయా
ఇడ్లిపై సాంబారు పోసినాడు
ఇడ్లిపై సాంబారు పోసినాడు
పెరియారు ప్లేటుకే అందాలు తెచ్చినాడు
ఇడ్లిపై సాంబారు పోసినాడు ...
జీర్ణమ్ము కరువైన వారికైన
జీర్ణమ్ము కరువైన వారికైన
మురిపించి మరిపించి అరిగించు రీతిగా
ఇడ్లిపై సాంబారు పోసినాడూ ..
సింగిలిడ్లిపైన సాంబారు పోయగా
నీరుల్లి ముక్కలే తేలియాడంగా
దంత స్తంభాలకే చేతనత్వము కలిగి
కరకరా పరపరా శబ్దాలు చేయగా
లుంగి ముడి వేసుకుని కొత్త ఖాతాలు
లుంగి ముడి వేసుకుని కొత్త ఖాతాలు
ఆర్డరివ్వాలని ఆరగించాలని
ఇడ్లిపై సాంబారు పోసినాడూ ...
ఒక వైపు ఉర్రూతలూపు ఘుమఘుమలు
ఒక పక్క వినిపించు పెనము పై శబ్దాలు
ఒక చెంప ప్లేటు గ్లాసుల తోటి విన్యాసాలు
షడ్రుచులు ఒలికించు హొటలుకే వచ్చాము
ధనము లేదని నీవు కలత పడవలదు
ధనము లేదని నీవు కలత పడవలదు
నా పర్సు నీదిగా చేసుకుని వాడు
ఇడ్లి పై సాంబారు పోసినాడు
పెరియారు ప్లేటుకే అందాలు తెచ్చినాడు
ఇడ్లి పై సాంబారు పోసినాడూ ...
(రాజా)
'మంచి మనసులు' సినిమాలోని ' శిలలపై శిల్పాలు చెక్కినారు ' పాటకి పేరడి