This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 

 
'' హనుమంతుడు సంగీతం లో దిట్ట.
నారదుడు, తుంబురుడు వంటి వారినే ఆశ్చర్య చకితుల్ని చేశాడు.
అలాగే రెహమాన్ కూడా. 
అందుకే అప్పుడు హనుమాన్. ఇప్పుడు రెహమాన్ అని అనాలనిపిస్తుంది "
ఈ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు.
కర్ణాటక సంగీతానికి మనకున్న పెద్ద దిక్కు - 
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ.
కాలం తో సమానం à°—à°¾ ప్రయాణించలేక చతికిలపడ్డ వారు కొందరైతే 
కాలాన్ని అర్ధం చేసుకుంటూ ఆస్వాదించే వారు మరికొందరు.
కానీ కాలం కన్నా ముందుకు దూసుకుపోయి కాలమే తన వెంట వచ్చేట్టు 
చేసుకోగల సామర్ధ్యం గల వారు మాత్రం ఒకరో .. ఇద్దరో వుంటారు.
వారిలో ఏ ఆర్ రెహమాన్ ఒకరు ... 
కాదు .. ఏ ఆర్ రెహమాన్ ఒక్కరే ... (ఈ తరానికి)
లేకుంటే బాలమురళి వంటి వారి నోట అంత గొప్ప ప్రశంస వెలువడదు.
కాకపోతే రెహమాన్ అనే సరికి ఫాస్ట్ బీట్, సాహిత్యాన్ని మింగేసే విపరీతమైన ఆర్కెష్ట్రా 
వంటి అభియోగాలు ఎన్నున్నా అవన్నీ అభిప్రాయాలు గానే మిగిలిపోయాయే గానీ అతని అభివృద్ధికి ఆటంకం కాలేకపోయాయి. అటువంటి వాటిలో మెలోడీ కూడా ఒకటి. కానీ మెలోడీ లో రెహమాన్ చాలా కొత్త పుంతలు తొక్కాడు. నిజానికి రెహమాన్ తెలుగు సినిమాకి నేరుగా కన్నా డబ్బింగ్ పాటల ద్వారా అందించిన సంగీతమే ఎక్కువ. అందుకే వాటినీ, వీటినీ కలగలుపుకుంటూ - మెలోడీ వరకే పరిమితం అవుతూ- రెహమాన్ పాటలలో కొన్నిటిని స్పృశించే చిన్ని ప్రయత్నం ఇది ... జనవరి 6 రెహమాన్ పుట్టిన రోజు సందర్భం గా ....
సాధారణంగా తెలుగులోనూ, తమిళం లోనూ ఆదరణ పొందిన పాటని ఉత్తరాదికి పరిచయం చెయ్యడానికి అంత ఉత్సాహం చూపించరు. వేరే ట్యూన్ తో ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా మూడు భాషల్లోనూ ఒకే పాటతో పరిచయమై ఆ ఒక్క పాటతో భారతదేశం లోని సంగీతాభిమానులందర్నీ తన వైపు తిప్పుకున్న ఘనత రెహమాన్ ది . అదేమిటో అందరికీ తెలుసు - చిన్ని చిన్ని ఆశ (రోజా) - ఆ పాటంతా మెలొడీయే ... ఉషా ఊతుప్ వంటి సీనియర్ గాయని సైతం తన షోల్లో జూనియర్ మోస్ట్ గాయని మిన్మిని పాడిన ఆ పాటను రెగ్యులర్ గా కొన్నేళ్ల పాటు పాడేదంటే అర్ధం చేసుకోవచ్చు ఆ పాట దేశం మొత్తం ఎలా ఆక్రమించుకుందో ...
 
'జెంటిల్మన్' సినిమాలో 'మావేలే మావేలే' పాట తీసుకుంటే పాట ఓపెనింగ్ లోనూ, రెండో చరణం (పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు) మొదలయ్యే ముందు - వయొలిన్ తో వచ్చే ఇంటర్లూడ్ అటు క్లాసికల్ ఫార్మాట్ ని ఇటు మెలొడి ని కలుపుకుంటూ ఈ జెనరేషన్ కి కూడా కనెక్ట్ అయేలా వుంటుంది.
 
à°ˆ సినిమాలోనే మరో తమాషా ప్రయోగం ... 'నా ఇంటి ముందున్న పూదోటనడిగావో ' రూపంలో అందించాడు రెహమాన్. ఫోక్ మెలోడి ని చాలా తెలివిగా క్లాసికల్ ఫార్మాట్ లోకి మార్చి, దానికి లేటెస్ట్ ఆర్కెష్ట్రైజేషన్ జతచేస్తూ, రిథమ్ ని ఆపుతూ కొనసాగిస్తూ కొత్త పోకడలు పోయాడు.  à°…ంతకు  à°®à±à°‚దు శ్రోతలకి ఇదివరకే పరిచయమైన  à°ˆ పాట ఫోక్ ఫార్మాట్ ని వినాలనుకుంటే 1956 లో పెండ్యాల సంగీతంలో వచ్చిన  'ముద్దుబిడ్ద' లోని 'పదరా సరదాగా పోదాం పదరా' పాట మధ్యలో వచ్చే 'దాచిన వలపంతా దోచుకుని పోయావు కాచుకొని వున్నాను నీకోసమే' బిట్ ని విని చూడండి. తెలిసిపోతుంది.
 
ఇలాంటి ప్రయోగమే 'ప్రేమికుడు' సినిమాలో 'ఓ చెలియా నా ప్రియ సఖియా ' పాటలో మళ్ళీ చేశాడు రెహమాన్. ' ప్రేమంటే ఎన్ని అగచాట్లో' లైన్ దగ్గిర, 'అధరము ఉదరము నడుమ ఎదో అలజడి రేగెనులే' దగ్గిర ట్యూన్ క్లాసికల్ ఫార్మాట్, ఇంటర్లూడ్ లు, పాడించిన విధానం అంతా మెలొడీ. ఈ పాటతో అటు యూత్ కి, ఇటు నడి వయసు వాళ్ళకి మరీ దగ్గిరై పోయాడు రెహమాన్.
 
 à°«à±à°²à± ఫాస్ట్ బీట్ సాంగ్ అనుకుంటున్న 'ముత్తు' సినిమాలోని 'తిల్లానా తిల్లానా' పాట లో కూడా అద్భుతమైన మెలొడిని పెట్టాడు రెహమాన్. వెనక ఫాలో అవుతున్న రిథమ్ ని మర్చిపోయి, చరణం లోని  'పైట చెంగు పాడిందయ్యా పరువాల పాట'  à°²à±ˆà°¨à± దగ్గర్నుంచి మనసులో అనుకుంటూ చూడండి. ' వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మా '  à°¦à°—్గిర   à°Žà°‚à°¤ చక్కగా మలుపు తిరుగుతుందో, చివరికి ' సడే లేని కౌగిట్లో సడే చేసుకుందామా ' దగ్గిర à°Žà°‚à°¤ హాయిగా ల్యాండ్ అవుతుందో ఇవన్నీ స్వయంగా ఆస్వాదించి చూడాలే తప్ప à°Žà°‚à°¤ వర్ణించినా తక్కువే అనిపిస్తుంది.
 
'ఇందిర' సినిమాలోని 'లాలీ లాలియని రాగం పాడుతుంటె',  'ప్రేమ దేశం' లో 'వెన్నెలా వెన్నెలా' , 'డ్యూయెట్' లో  'నా నెచ్చెలీ నా నెచ్చెలీ' , 'మెరుపు కలలు' లో 'అపరంజి మదనుడే' , 'అమృత' లో 'మరు మల్లెలలో à°ˆ జగమంతా నిండగా' , 'ఏ మాయ చేశావే' లో 'వింటున్నావా' ఇవన్నీ అతి తక్కువ వాద్యాలతో,  à°’క్కొక్క చోట వాద్యాలేవీ అస్సలు లేకపోయినా à°ˆ కాలం లో కూడా విజయం సాధించవచ్చని నిరూపించిన గీతాలు. à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ కూచొని ఆలపించుకుంటూ వుంటే గుండె తడిని కళ్ళ ద్వారా బైటికుబికేట్టు చేయగల à°Šà°Ÿà°² పాటలు. ఒక్కొక్కటీ ఒక్కో బాణి ముత్యం .
 
కిరీటం లో ఏ రత్నాన్ని ఎక్కడ పెడితే à°Žà°‚à°¤ కాంతులు వెదజల్లుతుందో తెలిసినట్టుగా సింగర్ల గొంతులోని జీవ స్వరాలను పట్టుకుని పాటలో ఎక్కడ పొదగాలో తెలిసిన సంగీతజ్నుడు రెహమాన్. అందుకు 'లవ్ బర్డ్స్ ' లో 'మనసున మనసున ' , 'తెనాలి' లో 'ప్రాణమా'  à°¦à°—్గిర్నుంచి 'కడలి'లో 'గుంజుకున్నా' పాట వరకూ ఎన్నో ఉదాహరణలు వెతుకుతున్నద్దీ కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి - అన్నీ మెలోడీలే ... ముఖ్యం à°—à°¾ 'తెనాలి' పాట వినిచూడండి ... చిత్ర 'ప్రాణమా' అంటుంటే ఇక్కడ మన ప్రాణం జిలార్చుకుపోతుంది.
 
రెహమాన్ పాటల్లో ఆర్కెష్ట్రా - సాహిత్యాన్ని , మెలోడీని డామినేట్ చేస్తుందన్న ఆరోపణ à°…న్నిసార్లూ కరెక్ట్ కాదు. సన్నివేశాన్ని బట్టి, పాత్రల స్వభావాన్ని బట్టి, చిత్రీకరించే దర్శకుడి అభిరుచిని బట్టి  à°¦à±‡à°¨à±à°¨à°¿ దేనికెంత మోతాదులో వాడాలో తెలిసిన తెలివైన టెక్నీషియన్ అతను. కావాలంటే ''పద్మవ్యూహం' సినిమాలోని 'కన్నులకు చూపందం' (బాలు, సుశీల వెర్షన్లు), నిన్న à°ˆ కలవరింత లేదులే' పాటలు గమనించి చూడండి. ఆసాంతం మెలొడీ తప్ప మరొకటి వినిపించదు.
 
అలాగే 'తెనాలి' లోని 'ప్రాణమా' పాటలోఆర్కెష్త్రయిజేషన్ చూసుకుంటే  à°°à±†à°‚డో చరణం 'హృదయాన  à°®à±à°°à±‹à°—ే à°ˆ రాగ హేల' కు ముందున్న ఇంటర్లూడ్  à°—ుండెల్లోని తంత్రుల్ని పట్టి లాగి ఒదుల్తున్నట్టు వుంటుంది.
అదే 'లవ్ బర్డ్స్ ' లోని 'మనసున మనసుగ' పాట కొచ్చే సరికి ఆర్కెష్ట్రా కొంత పెరిగినట్టనిపిస్తుంది. అందుకు కారణం ప్రభుదేవా  à°®à±ˆà°–ేల్ జాక్సన్ ప్రభావంతో స్పీడ్ మూమెంట్స్ తో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. అప్పటికీ à°…à°‚à°¤ స్పీడ్ లోనూ ఆర్కెష్త్రా లో కూడా మెలొడీ మిస్సవకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు రెహమాన్.
à°Žà°‚à°¤ జాగ్రత్త పడ్డాడు అని చెప్పడానికి à°“ చిన్న పరిశీలన ... 'ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా మీరూ' అనే త్యాగరాజ కృతి ని సంగీత ప్రియులు వినే వుంటారు. సినీ సంగీత ప్రియులకైతే - బాపు తీసిన 'త్యాగయ్య' లో జ్యోతిలక్ష్మి డాన్స్ ద్వారా లేదా క్రాంతికుమార్ తీసిన 'రాజేశ్వరీ కళ్యాణం' లో ఏయన్నార్, నాణిశ్రీ, మీనా, సురేష్ లు అభినయించిన పాట ద్వారా ట్యూన్ గుర్తుండే వుంటుంది. ఇది సారంగ రాగం. రెహమాన్ ఇదే రాగాన్ని ఆధారం à°—à°¾ చేసుకున్నాడు 'మనసున మనసుగ' పాటకి. à°“ వైపు à°† సారంగ రాగం లోని మాధుర్యాన్నంతా నింపుతూ మరోవైపు ఆర్కెష్ట్రయిజేషన్ లో ఆధునికత ఉట్టిపడేలా స్వరపరచడమే అతను తీసుకున్న అద్భుతమైన జాగ్రత్త. అదే అతని నైపుణ్యం - సంగీత ప్రియులు చేసుకున్న పుణ్యం. 
 
ఎలాగూ రాగాల ప్రస్థావన వచ్చింది కాబట్టి రెహమాన్ గురించి మరికొన్ని మంచి విషయాలు చెప్పుకోవాలి. 
మెలొడీని వదలకుండా ఒకే రాగాన్ని ఛాయామాత్రం à°—à°¾ స్పృశిస్తూ మూడు  à°ªà°¾à°Ÿà°²à±à°²à±‹ రకరకాలుగా 
వాడుకున్న సందర్భాలున్నాయి రెహమాన్ à°•à°¿.   మోహన రాగం స్వరాలని తీసుకుని 'జెంటిల్మన్' లోని 'మావేలే మావేలే' పాటకి ఎలా వాడుకున్నాడో,    
అలాగే ' నీ మనసు నాకు తెలుసు' లోని 'కలుసుకుందామా' పాటలోని 'ఏ దారిన వెళుతున్నాడో మీసం వున్న కుర్రాడు' లైన్స్ à°•à°¿ అదే రాగాన్ని మరో  à°ªà°¦à±à°¦à°¤à°¿à°²à±‹ ఉపయోగించాడు.  
à°ˆ రెండిటికీ భిన్నంగా 'బాయ్స్' లో 'బూమ్ బూమ్ షికికాక' లో 'ప్రేమా అదితే ఇదితే అని అడుగునా'  à°¦à°—్గిర పూర్తిగా మరో కోణంలో కలుపుకున్నాడు. à°ˆ 'బూమ్ బూమ్' పాటకి దర్శకుడు ఊహించిన చిత్రీకరణ కు తగిన విధంగా హెవీ ఆర్కెష్ట్రా తప్పనిసరి. అయినా మెలోడీని మిస్సవలేదు. ఆర్కెష్ట్రాని మైండ్ లోంచి మైనస్ చేస్తూ పల్లవి మాత్రం ఆలపించుకుని చూడండి. మీకే తెలుస్తుంది.
 
సినిమా సంగీతంలో ఎప్పుడు ఉపయోగించినా ఆకట్టుకునే రాగం - యమన్.   యస్. రాజేశ్వర రావు 'పాలకడలి పై శేష తల్పమున'  à°¦à°—్గర్నుంచి ఇళయరాజా 'సాయి శరణం బాబా శరణం శరణం' వరకూ à°ˆ రాగంలో ప్రతి పాటా హిట్టే.  à°ˆ రాగాన్ని కూడా ఎంతో చక్కగా ఉపయోగించుకున్నాడు రెహమాన్ 'బాబా' సినిమాలో. 'తల్లివి నీవే తండ్రివి నీవే' అంటూ క్లైమాక్స్ లో తాపి à°—à°¾ మొదలయ్యే à°† పాట లో సన్నివేశానికి తగిన స్ఫూర్తి ని నింపుతూ 'జులుమునణచుటకు భువిని  à°—ెలుచుటకు శక్తినివ్వూ' అంటూ యమన్ ని మిస్సవకుండా స్పీడ్ చేసి అభిమానులతో పాటు సంగీతం తెలిసినవారి నుండి కూడా కరతాళధ్వనులనందుకున్నాడు. 
 
రెహమాన్ మెలొడీల్లో గాయనీ గాయకుల ప్రతిభకు అద్దం పట్టేవీ, సామర్ధ్యానికి పరీక్ష పెట్టేవీ కొన్ని వున్నా à°“ రెండిటి గురించి కచ్చితంగా చెప్పి తీరాలి. అందులో 'డ్యూయెట్' లోని 'అంజలీ అంజలీ పుష్పాంజలీ' పాట à°’à°•à°Ÿà°¿. రెహమాన్ సెట్ చేసిన శ్రుతిలోనే  à°ªà°¾à°¡à±à°¤à±‚ à°ˆ పాటలో అతనిచ్చిన అప్స్ అండ్ డౌన్స్ ని రసభంగం కాకుండా అందిస్తూ శ్రోతల్ని మెప్పించగలగడం ఎవరికైనా à°“ పరీక్షే. అది ఒక్క బాలూకి, చిత్ర à°•à°¿ మాత్రమే చెల్లింది. 
అలాగే 'నానీ' లో 'స్పైడర్ మ్యాన్' పాట మరొకటి. చాలా మందికి ఈ పాట అంతగా పట్టలేదు గాని రెహమాన్ బెస్ట్ మెలొడీల్లో ఇదొకటి. ముఖ్యం గా చరణాల స్వరకల్పనలో రెహమాన్ తిప్పిన మలుపులు మామూలు సింగర్ల నిగ్గు తేల్చేస్తాయి.
ముల్లయ్ తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలూ 
దగ్గిర మెల్లగా మొదలై , 
మరి నేనే నిను పిలిచానా మది వాకిలి తెరిచుందని
రా రమ్మని అడిగానా చొరవగా చొరబడి పొమ్మని
 à°¦à°—్గిర అనుకొని మలుపు తిరిగి, 
అసలే మతి చెడి నేనుంటే అడుగడుగునా వెంటాడకు
నీ వలనే ఈ గొడవ అది తెలియని పసివాడివా
వద్ద తీయని మలుపుతో పైకీ కిందకీ తీసుకెళుతూ పల్లవిని చేరుకునేట్టు ట్యూన్ చేసిన రెహమాన్
నైపుణ్యానికి విషయం వున్న ప్రతి సంగీతజ్నుడూ జోహారు చేస్తాడు. à°ˆ చరణాలు స్వరపరుస్తున్నప్పుడు తిలంగ్, బహుదారి రాగాలు తట్టడం వలనో ఏమో చరణాలను బహు దారులు పట్టించాడు రెహమాన్. 
 
పాటల్లో మెలొడీ మనసుకి హత్తుకునేలా , హిట్ అయే విధంగా జొప్పించడం దగ్గిర్నుంచి, యువ తరాన్ని ఆకట్టునేలా ఫాస్ట్ బీట్ సాంగ్స్ ని స్వరపరచడం , అందులో సాటి టెక్నీషియన్లు కూడా ఆశ్చర్య పోయేలా ఆర్కెష్ట్రాని జతచేయడం, రీరికార్డింగ్ ద్వారా మూడ్ ని క్రియేట్ చేయడంలో రిచ్ నెస్, వీటన్నిటినీ మించి ఎంతో మంది తమ ఫోన్ లలో రింగ్ టోన్ à°—à°¾ సెట్ చేసుకునేలా హీరోల ఇంట్రడక్షన్ à°•à°¿ థీమ్ మ్యూజిక్ (ముత్తు, నరసింహ గుర్తుకు తెచ్చుకోండి) ఇవ్వడం ఇవన్నీ రెహమాన్ సంగీతం మీద అధ్యయనం గనుక చేస్తే  à°’క్కో అంశానికి ఒక్కొక్క డాక్ట్రేట్ రాదగ్గ సబ్జెక్ట్ లు. 
 
రెహమాన్ ఓ సంగీత సముద్రం. అందులో ఫాస్ట్ బీట్ లాంటి పోటెత్తే కెరటాలు, హోరెత్తెంచే ఆర్కెష్ట్రయిజేషను తో పాటు - మనకు తెలియకుండానే మన అరికాళ్ళను తడిమి గిలిగింతలు పెట్టే మెలోడీ - నిరంతరం ఉబుకుతునే వుంటాయి. ఉప్పునీళ్లనుకుని దూరంగా వుంటే అంతర్భాగం గా వున్న అంతులేని నిధుల్ని మిస్సవుతాం. అసలు ఈ సముద్రం ఉప్పునీటి సముద్రం కాదని, పాల సముద్రం అని గ్రహించడానికి రెహమాన్ చేస్తున్న నిశ్శబ్ద మధనమే అతని స్వర జైత్ర యాత్ర.
 
రాజా (మ్యూజికాలజిస్ట్)