ఓ మైడియర్ ఫ్రెండ్స్
డియర్ బూజర్స్
డియర్ ఓనర్స్
మందు మిత్రులారా ....
ఇక్కడే తాగి ఇక్కడే తూలి ఇక్కడే దొర్లాము
మందులమ్మ కల్లు పాకలో
వీడలేమంటు వీడుకోలంటు వీడిపోతున్నాము
మద్య నిషేదమ్ము దెబ్బతో
వియ్ మిస్ ఆల్ ది లక్
వియ్ మిస్ ఆల్ ది కిక్
వి మిస్ యూ
కిడ్డి బ్యాంక్ లోన పిల్లలు దాచిన చిల్లర పైసలు
పోపు డబ్బాలోన పెళ్ళాలు ఉంచిన పొదుపు డబ్బులు
ఫ్యూచర్ కోసం పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు
పెళ్ళి టైము లోన అత్తారు పెట్టిన నగలు, పుస్తెలు
బామ్మర్ది పెట్టిన గొడుగు, చెప్పులు
బంధువులిచ్చిన పెళ్ళి గిఫ్టులు
బిందెలు చెంబులు వెండి గ్లాసులు
స్నేహితులిచ్చిన హ్యాండులోనులు
మందు కొరకు అమ్మినట్టు గురుతులండి
ఇంకేమైనా మిగిలుంటే మన్నించండి
కల్లు పాక యజమానులు :
సెంటిమెంటు మాటలింక ఒగ్గేయండి
ఈ సిగ్గు ఎగ్గు లన్ని వదలి పెగ్గేయండీ
వియ్ మిస్ ఆల్ ది లక్
వియ్ మిస్ ఆల్ ది కిక్
వి మిస్ యూ
(ఎక్కడో పుట్టి ఏక్కడో పెరిగి పాటకు ప్యారడీ గా)
రాజా