This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
 à°…నుకోనిది జరిగితే ఆశ్చర్యం
అది మహత్తరమైనది అయితే అద్భుతం
à°† అద్భుతాన్ని అనుకున్న ప్రతిసారీ ప్రదర్శించ గలగడం 
కేవలం పూర్వ జన్మ పుణ్యం.
ఆ పుణ్యాన్ని తన నైపుణ్యంగా మలచుకున్న ఒకే ఒక గాయకుడు
మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
అప్పటికి - ఘంటసాల , పి.బి. శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం
వంటి గాయకులు నాలుగు దిక్కులూ ఆక్రమించేసుకుని ఏలుతుంటే -
వెన్నలా మృదువుగా - ఈ నాలుగు గళాలకూ భిన్నంగా ఉండే గొంతుతో
ప్రేక్షకుల గుండె తలుపులు తట్టాడీయన. 
అప్పుడప్పుడు à°’à°•à°Ÿà±€ à°…à°°à°¾ వంటి మంచి పాటలతో 
ఒక్కోసారి సినిమాకి మూడు నాలుగు పాటలతో 
శ్రోతల హృదయాలలో మెలమెల్లగా తనకంటూ à°“ గుర్తింపుని తెచ్చుకున్నాడు. 
ఇప్పుడు à°† గుర్తింపు తో  అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే అద్భుతాన్ని ప్రదర్శించాలి,
అది వైవిధ్యంగా ఉండాలి.
à°† పీరియడ్ లోనే -గులేబకావళి à°•à°¥, దాగుడుమూతలు, పూలరంగడు 
సినిమాల్లో ముద్దు ముద్దు మాటలతో పద్మనాభం చేసిన కామెడీ 
ప్రేక్షకుల తెగ నవ్వించడమే కాదు అతని బ్రాండ్ à°—à°¾ ముద్ర వేసుకుంది. 
ఈలోగా ఎన్.టి.ఆర్. సంస్థలో పాడడానికి టి.వి. రాజు గారి దగ్గర్నుంచి పిలుపు.
అది కూడా à°“ వైపు ఎన్.à°Ÿà°¿.ఆర్. à°•à°¿ à°“ పాట, మరో వైపు పద్మనాభం à°•à°¿ మరో పాట. 
à°“ వైపు అనుకోని అదృష్టం మరో వైపు కాదనలేని అవకాశం. 
ఈ రెండిటికీ తనెప్పుడూ ప్రయత్నించలేదు. కానీ పిలుపు వస్తే ప్రయత్నలోపం వుండకూడదు.
ఎన్.టి.ఆర్., కీ ఏయన్నార్ కీ ఘంటసాల ప్లేబ్యాక్ ని బాగా అలవాటు పడిపోయిన పరిస్థితి అది.
ఇక మిగిలింది పద్మనాభం పాట .
అంతకు ముందు శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న లోనూ, ఆస్తులు-అంతస్తులు లోనూ పద్మనాభం గారికి à°ªà°¾à°¡à°¿à°¨à°¾ అక్కడి వేదిక వేరు. ఇది à°Ÿà°¿.వి. రాజు గారిదీ ... ఎన్.à°Ÿà°¿.ఆర్. గారిదీ ...
’అమ్మమ్మమ్మ ఏం మొగుడివి ?’ అనే పల్లవితో సాగే కొసరాజు గీతం. ఎల్లారీశ్వరి తో 
ఇటువంటి టీజింగ్ సాంగ్స్ అంటే ఆవిడెలా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. 
పైగా అందరూ ఆవిడ అలానే పాడాలనే కోరుకునే వారు కూడా . 
గత్యంతరం లేదు . ఎక్కడైనా ఏదో వైవిధ్యం చూపించాలి.
’మంగళగిరి గోపురంలా నెత్తి మీద పిలకుంది’ అని ఎల్లారీశ్వరి ఎద్దేవా చేస్తే
’మాయల ఫకీరు ప్రాణమూ చిలక లోనె వున్నది’ అంటూ
’మా నాన్న ప్రాణమూ నా పిలక లోనె వున్నది’ అని కౌంటరిచ్చే దగ్గర
పద్మనాభం ముద్దు ముద్దు మాటల ఇంటొనేషన్ ని యధాతథంగా అనుకరించాడాయన.
అంతే ... ’అద్భుతం ’ అంటూ ఆశ్చర్యపోయారంతా .
అటు తమిళ నాడులో వున్న ఇండస్ట్రీ తో పాటు ఇటు త్రిలింగ దేశం మొత్తం థ్రిల్లింగ్ దేశం అయిపోయింది. 
అంతకు ముందూ , à°† తర్వాతా - రెండవ స్థానంలో వున్న హీరోలకు, చిన్నా చితకా హీరోలకు, à°®à°§à±à°¯ మధ్య కమేడియన్ లకూ పాడుతూ బిజీగా వున్నా సరే 
మళ్ళీ మరోసారి అటువంటి ప్రయోగాన్ని చేయవలసి వచ్చింది. 
ఇది టాప్ కమేడియన్ రాజ్ బాబుకి - ’బడిపంతులు’ సినిమాలో ...  ’ఓరోరి పిల్లగాడా’ పాటలో...
అందులో అతని టైపు ’ఒయ్ ... ఓయ్, à°† , à°†’ కౌంటర్ లతో, à°•à°¿à°š à°•à°¿à°š నవ్వులతో యధాతథంగా దించేశాడు à°°à°¾à°œà± బాబుని. 
à°ˆ సారి జనం ’ఆశ్చర్యం ... అద్భుతం’ అనలేదు. పాటని పదే పదే విన్నారు. పడి పడి నవ్వారు.
 
'ఇలాంటివి బాలూ కాకపోతే ఇంకెవరు చేస్తారు ?’ అంటూ ఆయన్ని , ఆయన టాలెంట్ ని నమ్మారు.
బాల సుబ్రహ్మణ్యం - బాలూ - అయిపోయాడు. 
à°† తర్వాత ఎన్.à°Ÿà°¿.ఆర్. à°•à°¿ ’మాయా మశ్చీంద్ర’ లో పాడే అవకాశం - ’ప్రణయ రాగ వాహిని’ పాటతో. à°µà±€à°²à°¯à°¿à°¨à°‚à°¤ లో సాధ్యమైనంతగా ఎన్.à°Ÿà°¿.ఆర్. పద్ధతిలో గళంలో మాధుర్యంతో పాటు గాంభీర్యాన్ని కూడా à°¨à°¿à°‚పుకుంటూ పాటని ఆవిష్కరించాడు. ’బాలూ గొంతు ఎన్.à°Ÿà°¿.ఆర్. à°•à°¿ కూడా భలేగా నప్పిందే’ అనుకున్నారు జనం.
 
’నువ్వు పాడకపోతే నా పాట ఏం కావాలి ?’ అని సత్యం వంటి సంగీత దర్శకుడు అడిగే స్థాయికి , ’పాటలో బాలూ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ వల్ల చాలా మందికి నటించడం సులువయిపోయింది’ అని రమేశ్ నాయుడు à°¸à±à°Ÿà±‡à°Ÿà± మెంట్ ఇచ్చే స్థానానికి 
’ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ à°•à°¿ నా మొదటి పాట బాలూయే పాడాలి’ అని చక్రవర్తి సెంటిమెంట్ à°—à°¾ ఫీలయ్యే పొజిషన్ à°•à°¿ à°šà±‡à°°à±à°•à±à°¨à±à°¨ - బాలూ - à°† క్రమం లో - బాలు గారు - అయిపోయారు. 
మరో రెండు సంవత్సరాలకి - ఒకే సంవత్సరం అటు ఏయన్నార్ à°•à±€ ’ఆలుమగలు’ లోను , à°‡à°Ÿà± ఎన్.à°Ÿà°¿.ఆర్. à°•à°¿ పాడే ’దాన వీర శూర కర్ణ’ లోనూ పాడాల్సి వచ్చింది. 
అప్పుడు - పాడితే ఘంటసాల గారిలా పాడు. లేదా à°ˆ హీరోలిద్దరూ మాట్లాడే పద్ధతి పట్టుకో ’ అంటూ à°¸à°‚గీత దర్శకుడు à°Ÿà°¿. చలపతి రావు గారు ఇచ్చిన సలహా బాలూ గారికి  నచ్చింది. 
భగవదత్తమైన సునిశిత పరిశీలన తో అబ్బిన నైపుణ్యాన్ని జత చేసి అటు ’ ఎరక్కపోయి వచ్చాను’ పాటతో ఏయన్నార్ ని,
ఇటు ’ చిత్రం హాయ్ భళారే విచిత్రం’ పాటతో ఎన్.à°Ÿà°¿.ఆర్. ని ప్రేక్షకుల మనసులలో ముద్ర కొట్టి మరీ నిలబెట్టారు.
ఆ తర్వాత నుంచీ బాలూ గారి స్వర పేటిక రకరకాల ప్రయోగాలకు పీఠిక అయిపోయింది.
’రావణుడే రాముడైతే’ లోని ’ఉప్పు చేపా పప్పు చారు’ పాటలో మందు కొట్టిన ఏయన్నార్ పాడినట్టుగా పాడితే ’ప్రేమంటే తెలుసా నీకు ?’ పాటలో అక్కినేని డైలాగులు చెబుతూ పాడితే ఎలా వుంటుందో చూపించారు. అలాగే
’బహుదూరపు బాటసారి’ లో కూడా ... పాటని డైలాగుల్తో కలిపి పాత్రని సజీవంగా సాక్షాత్కరింప జేశారు. 
 
ఇక ’ముద్దుల కొడుకు’ లోని ’దగాలు చేసి దిగాలు పడ్డ’ పాటలో అయితే పాట మాత్రం సుశీలది. మధ్యమధ్యన వచ్చే à°¡à±ˆà°²à°¾à°—ులన్నీ బాలూ గారివి .... కేవలం డైలాగులే ... అది కూడా ఏయన్నార్ కే.  à°† పాటని ఇప్పుడు మరోసారి విని
చూడండి. బాలూ గారికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.                               
 
 
à°ˆ పాట తర్వాతో , ఎప్పుడో స్వయంగా ఏయన్నార్ గారే à°¤à°®à°¾à°·à°¾à°—à°¾ అన్నారట బాలూ గారితో - ’ఏవిటి డబ్బింగ్ చెప్తారా నాకు ?’ అని.  
కమేడియన్ లలో ఆయన చాలా ఆలస్యంగా పాడింది అల్లు రామలింగయ్య గారికే . వాటిలో ముఖ్యమైనవి ముత్యాలు à°µà°¸à±à°¤à°¾à°µà°¾ (మనుషులంతా ఒక్కటే) , రాణీ à°“ రాణి (చిలక జ్యోస్యం) . à°ˆ పాటలు విన్నాక ఆయన ’ మరీ నేనంత ముక్కుతో
పాడతానంటావా ?’ అని అడిగారంట బాలూ గారిని.
’ఇంద్రుడు-చంద్రుడు’ లో ’నచ్చిన ఫుడ్డు - వెచ్చని బెడ్డు సిద్ధం à°°à°¾ ఫ్రెండు’ పాటకి బాలూ గారు - 
రాపాడిన గొంతు పాడితే ఎలా వుంటుందో చూపించి తన à°•à°‚à°  స్వరాన్నిఆపరేషన్ à°•à°¿ గురిచేసుకుని à°°à°¿à°¸à±à°•à± లో పడేసుకున్న సంగతి అందరికీ తెలుసు.  
ఇప్పటివరకూ  పేర్కొన్నవి - బాలూ గారు తనలోని సునిశిత పరిశీలనకు అనుకరణ విద్యను జోడించి, వాటికి అభినయ కళను à°œà°¤à°šà±‡à°¸à°¿ అద్భుతంగా ఆవిష్కరించిన స్మైలు రాళ్ళనదగ్గ  మైలు రాళ్ళ వంటి పాటలు. à°µà±€à°Ÿà°¿à°¨à°¿ గాక గిన్నీస్ బుక్ లోకి నమోదు చేయదగ్గ , అంతకన్నా గొప్పదేదైనా వుంటే à°… రికార్డులలో మొదటి పేజీలోకి రాయవలసిన à°®à°°à±‹ రెండు పాటల గురించి చెప్పుకోవాలి.
ముదటిది - ’మేడమ్’ సినిమాలో”మహిళా ఇక నిదుర నుంచి మేలుకో’ . ఇది పూర్తిగా స్త్రీ à°•à°‚à° à°‚ తో పాడినది. అంతకు ముందు ’చంటబ్బాయ్’ లో 
’ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ వంటి బిట్ సాంగ్ ని ఫిమేల్ వాయిస్ తో పాడినా ’మేడమ్’ లోని పాటే వేరు. పాట లో తార స్థాయి వుంటుంది. 
చివర్న స్కేల్ ఛేంజ్ వుంటుంది. అక్కడ కూడా తార స్థాయి వుంటుంది. ఇలా పాడడం, పాడ గలగటం. అనితర సాధ్యం . సినిమా రికార్డింగ్ లో
కంప్యూటర్ టెక్నాలజీ తో , సాంకేతిక పరిజ్ఞానం తో మార్చి వుంటారని అపోహ పడే అవకాశం వుంది. అలాటి వారు 27 ఆగష్టు  2017 à°¨ ప్రసారమైన 
’స్వరాభిషేకం’ యూ ట్యూబ్ లో వుంది. చూడండి. ఆయన à°† ప్రోగ్రామ్ లో à°† పాటని అందరి ముందు పాడేరు.. 

 
ఇక రెండవది. ఇది ఒక తమిళ గీతం. ఈ పాట గురించి చెప్పే ముందు కొంత చరిత్ర చెప్పాలి. ఎమ్మార్ రాధ అనే ఓ నటుడు తమిళం లో విలన్ గా,
కమేడియన్ à°—à°¾ సుప్రసిద్ధుడు . ’రక్త కన్నీరు’ నాటకం ఈయన ద్వారానే పాపులర్ అయింది. ఈయన గొంతు చాలా విచిత్రం à°—à°¾ వుంటుంది. à°’à°• విధంగా
అనుకరణకు అసాధ్యం అనే చెప్పాలి. మన నాగభూషణంకి తెలుగు ’రక్త కన్నీరు’ ద్వారా పేరు రావడానికి, తద్వారా తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి
ప్రేరణ ఈయనే . ఈయన పిల్లలే చాలా తెలుగు చిత్రాల్లొ నటించిన రాధిక, నిరోషా, ఇంకా రాధారవి, ఎమ్మార్ ఆర్ వాసు మొదలైన వారు. ఇందులో రాధారవి మనకి రజనీ కాంత్ నటించిన ’నరసింహ" ద్వారా తెలుసు. అతను 1983 లో ’సూరకోట్టయ్ సింగ కుట్టి’ సినిమాలో నటించాడు. అందులో ’అప్పాన్ పేచ్చే’ అనే పాట వుంది. అది బాలూ పాడేరు. అది మామూలుగా కాదు. రాధారవి తండ్రి అయిన ఎమ్మార్ రాధ వాయిస్ తో.   
 
యూ ట్యూబ్ లో ఎమ్మార్ రాధ కామెడీ సీన్ లతో పాటు, రాధా రవి à°•à°¿ బాలూ గారు పాడిన à°† తమిళ గీతం కూడా దొరుకుతుంది.  అంతే కాదు సంభ్రమాశ్చర్యాలక అద్భుతానికి వీటన్నిటికీ కలిపి ఒకే à°’à°• à°¨à°¿à°°à±à°µà°šà°¨à°‚, సదుపమానం కలిపి బాలూ రూపంలో మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది ఇటువంటి సృష్టి à°¨ భూతో à°¨ భవిష్యతి అనిపిస్తుంది. అందుకే ఆయన గళం-అనర్గళం. 
రాజా 
(మ్యూజికాలజిస్ట్)