ఒరిజినల్ గా మనం మాస్క్ చాటు మహా నటులం
కరోనా తో పబ్లిక్ అయ్యాం
సూక్తి ముక్తావళి అను సుత్తి మొత్తావళి
ఆవిడ గారు ఆ ఇంటి చాగంటి
ఆమె మాటంటే అది సామవేదమే
ఇక ఆయన గారేపాటి ?
గరికపాటి !!
ఇన్నాళ్లూ
మంచితనం , సంస్కారం
ధరిస్తూ , భరిస్తూ
అలిసిపోయాడు
ఇకనుంచైనా
తనకోసం తనలాగ
బ్రతకనీ
శిరసు వంచి
పాదాభివందనం చేశాను
ఆ మాటల్లోని సంస్కారానికి
అది లౌక్యం అని తెలిశాక
వెన్ను వంగిపోయింది
తలెత్తుకోలేకపోతున్నాను