This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
గురువుకు కృతజ్ఞతగా ఉండలేని వాడి కంఠాన సరస్వతి ఉండదు. ఘంటసాలకు గురుభక్తి ఎక్కువ. తన గురువు పట్రాయని సీతారామశాస్త్రి అంటే చాలా గౌరవం. భక్తితో మసలేవారు. అంతేనా? వారి అబ్బాయి సంగీతరావును తనసహాయకులుగా నియమించుకున్నారు. ఇరవై ఏళ్ల పాటు ఘంటసాల దగ్గర సన్నిహితంగా మెలిగిన సంగీతరావు దగ్గర ఘంటసాల జ్ఞాపకాల రాశి ఉంది. ఘంటసాల జయంతి సందర్భంగా వాటిలో కొన్ని పల్లవులు పద్యాలు వరుస కట్టిన జ్ఞాపకాలు...

ఘంటసాల à°•à°‚à° à°‚ à°’à°• మంత్రదండం. అందులో మంద్ర, మధ్యమ, తారస్థాయులు అలవోకగా పలుకుతాయి. ఆయనతో పని చేసేవారే ఆయన ప్రతిభ చూసి అప్రతిభులు అయ్యేవారు. ఒకరోజు ఏదో పని ఉండి వాహిని స్టూడియోకి వెళ్లాను.  ‘కృష్ణా ముకుందా మురారీ’ పాట రికార్డింగ్‌ జరుగుతోంది. అక్కడున్న వాద్యబృందం, టెక్నీషియన్లు ఘంటసాల పాడుతున్న విధానానికి మంత్రముగ్ధులవుతున్నారు.  à°† రోజు ఆర్కెస్ట్రాలో సన్నాయి సత్యం ఉన్నారు.  ఘంటసాల పాడిన అనేక పాటలకు సత్యం పని చేశారు. అయినప్పటికీ  పాటచివర ‘హే కృష్ణా! ముకుందా! మురారీ!’ అనే సాకీ తారస్థాయిని చే రే సందర్భంలో à°† కంఠంలోని సామర్థ్యం, దైవత్వం చూసి సన్నాయి సత్యం ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమవడం నాకు గుర్తుంది...

లవకుశ సినిమాకు సంగీతం ఘంటసాల అందించారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే à°† సినిమా నిర్మాణంలో ఉండగా కొన్నాళ్లు షూటింగ్‌ వాయిదా పడింది. కాని అప్పటికే కొన్ని పాటలను ఘంటసాల రికార్డు చేశారు. à°† పాటలు బాగా వచ్చాయి. అవి జనానికి చేరువ కావడంలో జాప్యం అవుతుండటంతో, కనీసం తన సంగీత దైవానికైనా వినిపిద్దామనుకుని, తిరువయ్యూరు వెళ్లి త్యాగయ్యగారి సమాధి దగ్గర à°† పాటలను గానం చేసి వచ్చారు. à°Žà°‚à°¤ మంచి విషయం, విశేషం అది...

‘రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ à°“ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది à°ˆ తత్త్వం. ‘à°ˆ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. అది నిజమైన తత్త్వం వింటున్నంత తన్మయత్వం కలిగించింది నాకు. ఏ పాట చేసినా సంపూర్ణంగా దాని మూలాన్ననుసరించి చేయాలనే దృష్టి ఆయనది. స్త్రీల పాటలు – మంగళ హారతులు కూడా అలాగే చేసేవారు... 

శాస్త్రీయ సంగీత రచనలేవీ లేని స్కేల్స్‌లో కూడా ఆయన చాలా పాటలు చేశారు. బందిపోటు చిత్రంలోని ‘ఊహలు గుసగుసలాడే’ పాట ఇటువంటిదే. సగమపనిస – సనిపమగస... à°ˆ మూర్ఛన అమృతవర్షిణి, శుద్ధ ధన్యాసి, ఉదయ రవిచంద్రిక వంటి అనేక రాగాలకు సమానమే కాని సరిగ్గా ఏ రాగమో తెలియలేదు. పరిశీలిస్తే సౌదామిని రాగం అని తెలిసింది. అంతలోనే ‘సుమనేశ రంజని’ రాగ లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. ఇలా రాగాలను సంలీనం చేసి అపూర్వ ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నమాచార్యులను గురించి ఎక్కువగా ప్రస్తావించని రోజుల్లోనే అన్నమయ్య కృతుల్ని రాగబద్ధం చేసి పాడారు ఘంటసాల.

‘కృష్ణకుచేల’ సినిమాలో రాజసూయ యాగ ఘట్టంలో పద్యాలన్నీ వేషధారులే పాడారు – అద్దంకి శ్రీరామ్మూర్తి, సియస్సార్‌ మొదలైనవాళ్లు. అద్దంకి శ్రీరామ్మూర్తి తన పద్యాన్ని పాడేశారుగాని ‘నిలుపంజాలను నెమ్మనంబు’ పద్యాన్ని వయసు కారణంగా సియస్సార్‌ సరిగా పాడలేకపోవడంతో ఘంటసాల పాడారు. అయితే à°† తర్వాత సియస్సార్‌ని కలిసినప్పుడు ‘మాస్టారూ! మీరు పాడిన పద్యం నేను తిరిగి పాడవలసి వచ్చింది. కానీ మీరు పాడిందే ఎంతో భావయుక్తంగా ఉంది. నేను కేవలం పద్యం పాడానంతే’ అంటూ మనఃపూర్వకంగా చెప్పారు. à°† నిజాయితీయే ఆయనను అపూర్వ వ్యక్తిని చేసింది. 

‘‘ఘంటసాల గారికి సాహిత్యంలో వస్తున్న గీతాలు, ప్రజాజీవితంలో పాటలంటే చాలా ఇష్టం. ఆయన వాటిని వెతుక్కుంటూ శ్రీకాకుళం దాకా వెళ్లారు. ‘రావయాన రావయాన రాజా నామాలుకి (నా మహలుకి)’ అంటూ జముకు వాయిస్తూ జానపదులు పాడిన పాటను ఆయన ఇలాంటి అన్వేషణలో జానపదుల నుంచి విని సినిమాకు వాడారు. ఆయన వల్ల ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా’ లాంటి పాటలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. సినిమాలతో సంబంధం లేకుండా ప్రైవేట్‌ గ్రామఫోను రికార్డులు కూడా చేశారు. కరుణశ్రీ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ ‘పుష్పవిలాపం’, ‘కుంతీకుమారి’ రసజ్ఞుల హృదయాలను దోచుకున్నాయి. శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ’, గురజాడ వారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ పాటలు ప్రాచుర్యం పొందాయి. ఆరోజుల్లో రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు ఘంటసాల. ‘à°ˆ చల్లని రేయి తిరిగి రానేరాదు’, ‘తూరుపు దిక్కున అదిగో చూడు’, ‘బహుదూరపు బాటసారి’ వంటి పాటలెన్నో. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రరాష్ట్ర గానం వంటి ఆంధ్రమాతను ప్రస్తుతించే పాటలు, ‘ఆంధ్రుల చరితం అతిరసభరితం’ వంటి పాటలు ఎంతో ఉత్తేజకరంగా గానం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరుని మీద పాడిన భక్తిగీతాలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. తిరుమల గిరులు ఘంటసాల గారి భక్తిగీతాలతో ప్రతిధ్వనించాయి.ఘంటసాల తన జీవిత చరమాంకంలో గానం చేసినది భగవద్గీత. ఇది రాగబద్ధం చేస్తున్నప్పుడే చాలా ఆసక్తికరంగా ఉండేది. భగవద్గీత సంగీత ప్రధానమైన à°°à°šà°¨ కాదు. ప్రధానంగా తాత్త్విక చర్చ వంటిది. అటువంటి రచనను సంగీతానికి అనుకూలంగా చేయడంలో కృతకృత్యులయ్యారు ఘంటసాల. ఘంటసాల స్వర్గస్థులై, అమరగాయకుడై నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పాడిన పాటల్ని వర్ధమాన గాయకులు ఇంకా పాడుతూండడం తెలుగువారికి ఆయనపట్ల à°—à°² అపారప్రేమకు, అభిమానానికీ నిదర్శనం. నేటికీ అనేక తెలుగు కుటుంబాలలో ఘంటసాల ప్రాతఃస్మరణీయుడు.

రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ à°“ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది à°ˆ తత్త్వం. ‘à°ˆ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కేళీ గోపాలంలో రాసిన నృత్యనాటకం తరవాతి రోజుల్లో ‘రహస్యం’ సినిమాలో ‘గిరిజాకల్యాణం’à°—à°¾ ఉపయోగించారు. అది à°Žà°‚à°¤ ప్రసిద్ధి చెందిందో తెలిసిందే. 
– పట్రాయని సంగీతరావు, 
చెన్నై (ఘంటసాల గురువులైన 
పట్రాయని సీతారామశాస్త్రి కుమారుడు)
 
చందమామ నవ్విన రోజు పల్లవి పులకించిన రోజు
చరణం చకితమైన రోజు
గానం పరవశించిన రోజు
పాట గుండెకందిన రోజు

అనుభూతి అనుభూతించిన రోజు
మన కోసం అదృష్టం పుట్టిన రోజు
జీవితానికి ఒక తోడు వచ్చిన రోజు
ఘంటసాల పుట్టిన రోజు
పాట చిరయశస్సు పొందిన రోజు

నిట్టా జనార్దన్‌ సుప్రసిద్ధ సితార్‌ విద్వాంసులు. ఘంటసాలతో పని చేశారు. ఆయన పాటలకు సితార్‌ సహకారం అందించారు. ఘంటసాల జయంతి సందర్భంగా జనార్దన్‌ పంచుకున్న జ్ఞాపకాలు. 1958, జూన్‌ 6à°¨ ‘భాగ్యదేవత’ సినిమా కోసం మాస్టర్‌ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సుశీల పాడిన పాటకు మొట్టమొదట సితార్‌ అందించాను. నేను వాయించడం à°…à°‚à°¤ దూరం నుంచి చూసిన ఘంటసాల ‘à°Žà°‚à°¤ హాయిగా ఉంది బాబూ నీ రాగం’ అని ఆలింగనం చేసుకున్నారు. అలా ఆయనతో నా సినిమా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ఒకప్పుడు గుడికి వెళ్లే సందర్భం, ఆనంద సంబరం, శోభన సన్నివేశాలలో మాత్రమే సితార్‌ ఉపయోగించేవారు. ఒకసారి à°’à°• సినిమా విషాద సన్నివేశంలో ‘సరోద్, సారంగి వాయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడెలా?’ అన్నారు ఘంటసాల. అప్పుడు నేను సితార్‌ మీద వాయిస్తానని చెప్పి మంద్రస్థాయిలో ‘బిలాస్‌ఖాన్‌ తోడి రాగం’ లో వాయించేశాను. ఘంటసాల పరుగుపరుగున నా దగ్గరకు వచ్చి నన్ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తాన్‌సేన్‌ కుమారుడు బిలాస్‌ఖాన్‌. తాన్‌సేన్‌ మరణించినప్పుడు బిలాస్‌ఖాన్‌ ఏడవకుండా à°’à°• రాగాన్ని పలికించాడు. అది బిలాన్‌ఖాన్‌ తోడి రాగంగా స్థిరపడిపోయింది. దానిని à°† సందర్భానికి ఉపయోగించడం మంచి జ్ఞాపకం. à°¡à°¾.చక్రవర్తి సినిమాలో ‘మనసున మనసై... బతుకున బతుకై’ పాట à°Žà°‚à°¤ ఫేమస్సో అందరికీ తెలిసిందే. à°† పాట కోసం జయజయంతి రాగం వాయించమన్నారు ఘంటసాల. ఆయన మేధావితనం వల్లే à°† పాట నిలబడింది. ఆయన స్వరపరచిన ‘లవకుశ’ సినిమాలో అన్ని సీన్స్‌à°•à°¿ నేను సితార్‌ వాయించాను. పునర్జన్మ చిత్రంలో ‘ఎవరివో నీవెవరివో’ పాటలో ఘంటసాల గొంతు, నా సితార్‌ పోటాపోటీగా వినపడతాయి. ‘‘ఘంటసాల ‘పయనించే à°“ చిలుకా’ ‘బంగరు బొమ్మా సీతమ్మా’ పాడుతుంటే నాకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఆయన పాటలో ఉండే అనుభూతి, స్పష్టతల వల్ల ఆయన పాటలో నిమగ్నమైపోతాం. అలాగే ఘంటసాల ఆలపించిన ‘జయదేవుడి అష్టపదులకు’ సితారు అందించడం నేను నా జీవితంలో మరచిపోలేను. ఒకసారి ఘంటసాల భార్య సావిత్రమ్మ... ‘మీరు జనార్దన్‌ గారు ఎలా వాయించినా విని ఊరుకుంటారేంటి’ అన్నారు. అందుకు ఆయన ‘జనార్దన్‌ విద్వాంసుడు. మనం చెప్పక్కర్లేదు’ అని నా మీద ఉన్న నమ్మకాన్ని వివరించారు. ఘంటసాల తనకు మూడు కోరికలున్నాయని చెప్పేవారు. భగవద్గీత స్వరపరచుకుని గానం చేయడం, విదేశీ పర్యటన, తన పేరుతో à°’à°• సంగీత పాఠశాల ప్రారంభించడం. ఆయన బతికుండగా మొదటి రెండు జరిగాయి. గతించాక మూడోది కూడా జరిగింది. 
ఘంటసాలగారికి విదేశీ పర్యటన చేయాలనే కోరిక 1971లో నెరవేరింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి అక్కడ పాటలు పాడి అందరినీ అలరించారు. ఆయన వెంట నన్ను కూడా తీసుకువెళ్లారు. నేను ముందుగా à°’à°• పావుగంట సేపు శాస్త్రీయ సంగీతకచేరీ చేశాక, ఆర్కెస్ట్రాలో వాయిస్తానని చెప్పాను. ఆయన నిండు మనసుతో అంగీకరించారు. ఆఖరి రోజుల్లో స్వరపరచిన భగవద్గీతకు ‘జనార్దనే సితార్‌ వాయించాలి’ అని పట్టుబట్టారు ఘంటసాల. ఒక్కో శ్లోకం ఒక్కో రాగంలో రూపొందించారు. ముందరి రాగాల నుంచి తరవాత రాగానికి చేరుకోవాలి. అంటే అది ఇంటర్‌లింక్‌ చేయాలి, అలాగే చేశాను. ఘంటసాల తుదిశ్వాస వరకు ఆయన పాటలకు సితార్‌ వాయిస్తూనే ఉన్నాను.  ‘ఘంటసాల గానగంధర్వుడు’. అలాంటివాళ్లు మళ్లీ పుట్టరు.
– జనార్దన్ మిట్టా , సితార్‌ విద్వాంసులు
 
 à°œà°¨à°¾à°°à±à°§à°¨à± గారు సితార్‌ వాయించిన ఘంటసాల పాటలు
మనసున మనసై (డా. చక్రవర్తి), దివి నుంచి భువికి దిగి వచ్చే (తేనె మనసులు), చెలికాడు నిన్నే రమ్మని పిలువ (కులగోత్రాలు), విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు), విన్నానులే ప్రియా (బందిపోటు దొంగలు), మల్లియలారా మాలికలారా (నిర్దోషి), మౌనముగానే మనసు పాడిన వేణు గానములు వింటిలే (గుండమ్మ కథ), మురిపించే అందాలే అవి నన్నే చెందాలే (బొబ్బిలియుద్ధం), పూవై విరిసిన (తిరుపతమ్మ కథ), ఊహలు గుసగుసలాడే (బందిపోటు), నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ), ప్రియురాల సిగ్గేలనే (శ్రీకృష్ణపాండవీయం), హిమగిరి సొగసులు (పాండవ వనవాసం), తొలివలపే పదే పదే (దేవత), విన్నారా అలనాటి వేణుగానం (దేవుడు చేసిన మనుషులు), జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశ ద్రోహులు), కిలకిల నవ్వులు చిలికిన (చదువుకున్న అమ్మాయిలు).