This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

నా బర్త్ డే ని అమెరికన్స్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు  - కీరవాణి

 
 
ఆయన మాటల్లో నిండైన తెలుగుదనం. పాటల్లో కూడా అంతే. తెలుగు పాట కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఎగురవేసిన ఆ సంగీత దర్శకుణ్ణి ఇవాళ ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి పరిచయం చేయనవసరం లేదు.
తెలుగు ధనానికి, తెలుగుదనానికి తన బాణిలో తన వాణీతో అతి చక్కగా ముడిపెట్టి, హృదయాల్ని మీటగల స్వరలేఖిని - కీరవాణి ! ఆయనను వివిధ కోణాల్లో ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. 2002 లో మామధ్య  జరిగిన సంభాషణని ఇంటర్వ్యూ à°—à°¾ మీముందుంచే ప్రయత్నమే  ఇది.
సంగీతం మీద తప్ప ఇక దేనిమీద మోజులేదని స్పష్టంగా చెబుతున్న కీరవాణి అడపా తడపా పాటల రచయితగానో గాయకుడుగానో ప్రత్యక్షమవుతున్నారు. ఆ వివరాలు, ఆయన అభిరుచులు ఆయన మాటల్లోనే చదవండి.
పాటల రచయితగా
ఆత్మబంధం' చిత్రం కోసం రాసిన 'పోరింక పడలేను' నా తొలిపాట. చాలా సరదాగా à°°à°¾à°¸à°¿à°¨ పాట ఇది నిజంగా రాయమంటే నేను రాయలేను. నాకు సాహిత్యం మీద కూడా à°…à°‚à°¤ కమాండ్ లేదు. నేను తెలుగువాణ్ణి ... నాకు తెలిసిన తెలుగు అంతే ... ఇప్పటికి à°“ 20-30 పాటలు రాసి వుంటాను (2002 నాటికి).
హైదరాబాద్ రైటర్స్ అసోసియేషన్లో నేను సభ్యుణ్ణి కూడా. నేను రాసిన పాటకు ఇంతవరకూ పారితోషికం తీసుకోలేదు. ఒకే ఒక్క పాటకి మాత్రం పారితోషికం తీసుకున్నాను. అది కూడా నా కోసం కాదు. తెలుగులో తప్ప ఇంకే భాషలోనూ పాట రాయలేదు. ఇతర భాషల్లో పాడటమే ఓ సాహసమనుకుంటే, రాయడం దుస్సాహసమవుతుంది. నా వృత్తి సంగీతం, ఇవన్నీ బోనస్ .
గాయకుడిగా...
'మొండి మొగుడు - పెంకి పెళ్ళాం' చిత్రంలో 'నాటకాల జగతిలో జాతకాల జావళి' అని వేటూరి గారు రాసిన పాటను నేను తొలిసారిగా పాడాను. ఇది అనుకోకుండా జరిగింది. నేను పాడిన ట్రాక్ విని 'ఇదే బాగుంది. వుంచేద్దాం' అన్నారు దర్శకులు వై. నాగేశ్వరరావు.
ఇప్పటికి ప్రైవేట్ ఆల్బమ్స్ తో కలుపుకుని 100 పాటలు పాడాను. ఏ సినిమా పాటకి నేను పారితోషికం తీసుకోలేదు.
à°† మధ్య 'పిలిస్తే పలుకుతా'  కోసం à°“ పాట పాడితే నిర్మాత విజయచందర్ గారు అడక్కండానే పారితోషికం పంపించారు. అప్పడాయన్ని నేను పిచ్చోడిలా చూసాను. ఎందుకంటే ఇంతవరకూ ఎవరూ à°† పని చేయలేదు కాబట్టి.
నా సంగీతంలోనే కాకుండా, బైట సంగీత దర్శకుల దగ్గర కూడా పాడాను. నేను తొలిసారిగా అలా బైట పాడింది 'ఆంటీ' రమేష్ దగ్గర. మౌళి గారి దర్శకత్వంలో రూపొందిన సినిమా అది. 'సొగసుల రాణివే' అనే ఆ పాటను నేను, మనో కలిసి పాడాం. ఇళయరాజా, కోటి, వందేమాతరం శ్రీనివాస్, మణిశర్మల దగ్గర కూడా పాడాను.
తొలిసారిగా ఎమ్మెస్ విశ్వనాధన్ గారి సంగీత దర్శకత్వంలో à°“ భక్తిగీతాల ఆల్బమ్ కోసం  పాడాను.
వేటూరి గారికి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన 'మాతృదేవోభవ' చిత్రంలోని 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాట నేను పాడటం నా అదృష్టం. 'రక్షణ'లో నాగార్జునకి పాడాను, 'ఒసేయ్ రాములమ్మ' లో పాడాను. 
'సూడెంట్ నెం.1'లో ఎన్.à°Ÿà°¿.ఆర్ à°•à°¿ పాడాను. 
తమిళ్,మలయాళం,కన్నడంలో కూడా పాడాను. 
హిందీలో 'ఇస్ రాత్ à°•à±€ సుభానహీ'  సినిమాకి నేనే సంగీత దర్శకుణ్ణి à°† సినిమాలో రెండు పాటలు పాడాను.'టాబూన్' అనే సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో à°“ హిందీ ప్రైవేట్ ఆల్బమ్ లో పాడాను. 
ఎన్ని పాటలు పాడినా అది నా ప్రొఫెషన్ కాదు.
నేను 1961జులై 4న పుట్టాను. నా బర్త్ డే ని అమెరికన్స్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కంగారు పడిపోకండి. జులై 4 అమెరికన్ ఇండిపెండెన్స్ డే. ఆరోజునే స్వామి వివేకానంద వర్ధంతి కూడాను.
సంగీత దర్శకత్వం.
నందమూరి తారకరత్న హీరోగా ఆకుల శివ దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లు కలిసి 'స్వప్న' సినిమా బేనర్ పై ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో ఇప్పటికి సంగీత దర్శకుడిగా నా సంఖ్య 155. తెలుగులో 115 సినిమాలు చేస్తే, హిందీలో 3, కన్నడంలో 10, తమిళంలో 10. మలయాళం లో 5 సినిమాలు చేసాను.
నటన- దర్శకత్వం - నిర్మాణం
దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు పదేళ్ళ నుంచి నన్ను నటించమని అడుగుతున్నాడు. నాది విలన్ ఫేస్ అట. అందుకని విలన్ గా చేయమని అడుగుతూనే వున్నాడు. కానీ నాకు నటన మీద ఆసక్తిలేదు.
దర్శకత్వం చేసే ఆలోచన అస్సలు లేనే లేదు.
నిర్మాణం విషయానికొస్తే నాకంత సీన్ లేదు. నేనింకా సెటిల్ కాలేదు. ఇంకా భుక్తిమార్గంలోనే వున్నాను. పేరు గొప్ప - ఊరు దిబ్బ అంటారే, అది నా పరిస్థితి. రేపు జీవితంలో స్థిరపడ్డాక అప్పడు అలాంటివన్నీ ఆలోచించాలి.
ఎవరెవరంటే ఇష్టం ?
పాత వాళ్ళందరినీ అభిమానిస్తాను, ఆరాధిస్తాను. కొత్త వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నచ్చుతుంది.
కొత్తవాళ్ళలో రహమాన్ కొంతవరకూ నాకు నచ్చుతాడు.
హంసలేఖ ఈ మధ్యనే 'శ్రీమంజునాధ' చిత్రం కోసం చేసిన 'ఈ పాదం' పాట తెగ నచ్చేసింది.
వి.ఎ.కె. రంగారావు గారి దగ్గర మ్యూజిక్ కలెక్షన్ ఎ టూ జెడ్ వుంది. నా దగ్గర కూడా కలెక్షన్ వుంది. కానీ అవన్నీ నాకు నచ్చినవి మాత్రమే.
à°ˆ మధ్యకాలంలో నా కలెక్షన్లో చేరిన పాట 'మనసంతా నువ్వే’ లో ఆర్పీ పట్నాయక్ చేసిన "తూనీగ తూనీగ" పాట. à°† పాట నాకు చాలా నచ్చింది.
ఇప్పడు వంద పాటలు రిలీజవుతుంటే, అందులో నాకు ఒక్కటే నచ్చుతుంది.
ఇళయరాజా గారి పాటలంటే నేను చెవికోసుకుంటాను. కానీ 1993 తర్వాత ఆయన చేసిన ఏ పాటా నాకు నచ్చలేదు.
నేను చేసిన వాటిలో 30 శాతం చెత్త పాటలు వున్నాయి. 30 శాతం పర్వాలేదు. కేవలం 40 శాతం మాత్రమే చాలా బాగున్నాయనిపించే స్థాయిలో వున్నాయి. ఆ 40 శాతంలో పాటల్ని ఈ రోజుకీ వింటే హాయిగా అనిపిస్తుంది. నూటికి నూరుశాతం మంచి మ్యూజిక్ ఇచ్చానని నేనెప్పడూ చెప్పను.
'ఆ 40 శాతంలో ఏది ධි బెస్ట్ ?' అంటే చెప్పడం అంటే చాలా కష్టం.
ఫేవరెట్ రైటర్ 
వేటూరిగారే నా ఫేవరెట్ రైటర్ అందులో ఏ మాత్రం సందేహం లేదు. 
ఫేవరెట్ గాయనీ గాయకులు
గాయనీ గాయకుల్లో్ చాలా మంది వున్నారు. ముఖ్యంగా బాలు, చిత్ర, కిషోర్ కుమార్, గీతాదత్ గాత్రాల్ని ఇష్టపడతాను.
ఇష్టమైన సినిమా
ఎన్టీ ఆర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణపాండవీయం' నాకు చాలా ఇష్టం. ఇప్పటికి ఓ యాభైసార్లు చూసి వుంటాను. టి.వి.రాజు గారు దానికి సంగీతం. నేను సంగీతం సమకూర్చిన వాటిలో నాకు నచ్చిన చిత్రం' సీతారామయ్యగారి మనవరాలు'.
ఇష్టమైన పాట
'నస్రత్ ఫతె అలీఖాన్ సంగమ్' ఆల్బమ్ లో పాడిన 'జిస్మ్ థక్తా' పాట అంటే నాకు ప్రాణం. జావేద్ అఖ్తర్ సాహిత్యం సమకూర్చారు. నాకిప్పుడు 40 ఏళ్ళు. à°ˆ మధ్యకాలంలో నాకు తెలిసి ఎక్కువ సార్లు పాడుకున్న పాట ఇదే. à°ˆ పాటని వందలు కాదు వేలసార్లు - ఇంటా బైటా, భోంచేస్తూ, నిద్రపోతూ, నడుస్తూ, స్నానం - చేస్తూ పాడుకున్నాను. ఇక నా విషయానికొస్తే నా పాటలేమీ నేనెక్కువ పాడుకోను. అది కూడా à°’à°•à°Ÿà°¿,రెండు సార్లు మాత్రమే. నా పాట నేనే పాడుకుంటే ఏం బాగుంటుంది .చెప్పండి? 
రాజా
(మ్యూజికాలజిస్ట్)