This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rojulu-marayi-
Song » Eruvaka sagaro ranno / ఏరువాక సాగారో రన్నో
Click To Rate




* Voting Result *
18.18 %
4.55 %
0 %
4.55 %
72.73 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 telugu sinimA saMgItaMlO jAnapada gItAla praBAvaM anE aMSaM guriMci evarainA prastAviMcavalasi vastE 'rOjulu mArAyi' citraMlOni 'EruvAka sAgArO rannO cinnanna' pATanu udahariMcakuMDA muMduku veLLalEru. okka telugunATa mAtramE caudari rAsina I pATanu pADinadi jikki. vahidA rehamAn nRutyaM cEsi aBinayiMcagA akkinEni nAgESvararAvu, ShAvukAru jAnaki, sItArAM modalaguvAru sannivESa prAdhAnyaMgA kanipistAru. I pATalO Dappu vAyistU vahidA rehamAn pakkana kanipiMcE oka vyakti ke.yas. reDDi. tarvAta rOjullO nRutya darSakuDigA, darSakuDigA pEru teccukunnAru.


telugu sinimAllO jAnapada sAhityAniki saMbaMdhiMcina gItAlu rAyAlannA, hAsya gItAlu rAyAlannA kosarAjuni miMcina kavi lErannadi nirvidAvAMSaM.  Ayana tarvAta A lOTu ippaTikI BartIkAlEdu ganuka AyanE 'kosa' rAju ani sinIjanulu camatkaristuMTAru kUDA. palleTULLalO polaM dunnukunE vAri nuDikArAniki O prAkAraM kaTTi pATarUpaMlO Ayana svarArcana cEsina I pATalOni pratIpadaM jIvana guNAnni saMtariMcukunnadE. 

pATalO pallaviki kaTTina TyUnE iMTarlUDugA vADukunnAru. nijAniki appaTiki adO prayOgaM. pallavi mIda eMta nammakaM lEkapOtE dAnini tirigi iMTarlUDgA vADukuMTAru? E mAtraM bAgOlEkapOyinA adi monATamI ayyE pramAdaM uMdi kadA!? A prayOgaM eMtagA vijayaM sAdhiMciMdaMTE A tarvAta tamiLa raMgaMlO okEsAri ayidu citrAllO iTuvaMTi pATalu vaccAyi. ivannI oka ettu. mottaM saMgIta darSakulaMdarU eMtO gauravaMgA 'barmandA' aMTU pilucukunE es.Di.barman kUDA I 'EruvAka sAgArO' TyUnni tIsukuni 'boMbai kA bAbu' citraMlO 'dEKanE mE BOlA hai bAbU cinnanna' anE pATanu svaraparacaDaM marO ettu. saMgIta darSakuDigA mAsTar vENu GanavijayaMgA ceppukOvaccu I saMGaTanani. marOvidhaMgA TyUntO pATu 'cinnanna' anE telugu padaM praBAvaMlO tappiMcukOlEni vidhaMgA barman mahAnuBAvuNNi saitaM paDEsina kosarAju vijayaM kUDA.
Important information - Telugu

 తెలుగు సినిమా సంగీతంలో జానపద గీతాల ప్రభావం అనే అంశం గురించి ఎవరైనా ప్రస్తావించవలసి వస్తే 'రోజులు మారాయి' చిత్రంలోని 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' పాటను ఉదహరించకుండా ముందుకు వెళ్ళలేరు. ఒక్క తెలుగునాట మాత్రమే చౌదరి రాసిన ఈ పాటను పాడినది జిక్కి. వహిదా రెహమాన్ నృత్యం చేసి అభినయించగా అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, సీతారాం మొదలగువారు సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. ఈ పాటలో డప్పు వాయిస్తూ వహిదా రెహమాన్ పక్కన కనిపించే ఒక వ్యక్తి కె.యస్. రెడ్డి. తర్వాత రోజుల్లో నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.


తెలుగు సినిమాల్లో జానపద సాహిత్యానికి సంబంధించిన గీతాలు రాయాలన్నా, హాస్య గీతాలు రాయాలన్నా కొసరాజుని మించిన కవి లేరన్నది నిర్విదావాంశం.  ఆయన తర్వాత ఆ లోటు ఇప్పటికీ భర్తీకాలేదు గనుక ఆయనే 'కొస' రాజు అని సినీజనులు చమత్కరిస్తుంటారు కూడా. పల్లెటూళ్ళలో పొలం దున్నుకునే వారి నుడికారానికి ఓ ప్రాకారం కట్టి పాటరూపంలో ఆయన స్వరార్చన చేసిన ఈ పాటలోని ప్రతీపదం జీవన గుణాన్ని సంతరించుకున్నదే. 

పాటలో పల్లవికి కట్టిన ట్యూనే ఇంటర్లూడుగా వాడుకున్నారు. నిజానికి అప్పటికి అదో ప్రయోగం. పల్లవి మీద ఎంత నమ్మకం లేకపోతే దానిని తిరిగి ఇంటర్లూడ్గా వాడుకుంటారు? ఏ మాత్రం బాగోలేకపోయినా అది మొనాటమీ అయ్యే ప్రమాదం ఉంది కదా!? ఆ ప్రయోగం ఎంతగా విజయం సాధించిందంటే ఆ తర్వాత తమిళ రంగంలో ఒకేసారి అయిదు చిత్రాల్లో ఇటువంటి పాటలు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు. మొత్తం సంగీత దర్శకులందరూ ఎంతో గౌరవంగా 'బర్మన్దా' అంటూ పిలుచుకునే ఎస్.డి.బర్మన్ కూడా ఈ 'ఏరువాక సాగారో' ట్యూన్ని తీసుకుని 'బొంబై కా బాబు' చిత్రంలో 'దేఖనే మే భోలా హై బాబూ చిన్నన్న' అనే పాటను స్వరపరచడం మరో ఎత్తు. సంగీత దర్శకుడిగా మాస్టర్ వేణు ఘనవిజయంగా చెప్పుకోవచ్చు ఈ సంఘటనని. మరోవిధంగా ట్యూన్తో పాటు 'చిన్నన్న' అనే తెలుగు పదం ప్రభావంలో తప్పించుకోలేని విధంగా బర్మన్ మహానుభావుణ్ణి సైతం పడేసిన కొసరాజు విజయం కూడా.