గీతామాధురికి పుట్టబోయేదెవరు ?
గీతామాధురి పుట్టిన రోజు (ఆగష్టు 25) సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి విష్ చేశాను.
గర్వపు గాలిని పీల్చుకోవడం తెలియదామెకు.
అందుకే ఎప్పటిలాగే ఎంతో ఆప్యాయతతో రిసీవ్ చేసుకుని రెస్పాన్స్ ఇచ్చింది.
కెరీర్, వైవాహిక జీవితం గురించిన కుశల ప్రశ్నలు అయ్యాక
"ఏమ్మా ! ఏమైనా గుడ్ న్యూస్ వినిపిస్తున్నావా ?" అని అడిగాను.
" ఇప్పుడు కాదు బాబాయ్ గారు ... నెక్స్ట్ ఇయర్ వినిపిస్తా ... ఆడపిల్ల పుట్టిందని .."
అని అందామె
" అదేంటి ... స్కానింగ్ చేయించుకున్నంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నావు ? "
" లేదు బాబాయ్ గారూ ! ఇంకా ప్లాన్ కూడా చేసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ అని
అనుకుంటున్నాం. నాకు ఆడపిల్లే పుడుతుంది. కచ్చితంగా ఆడపిల్లే .." అందామె
నమ్మకంగా.
ఇలా - నా బోటి వాడిని తన కుటుంబ సభ్యుడిగా భావించి ఎంతో గౌరవంతో మాట్లాడుతూ
తన మనసులోని భావాలను పంచుకుంటూ ఇంత అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడేవారు
ఎంతమందిని ఈ తరం సింగర్లలో చూడగలం ?
డా. రాజా (మ్యూజికాలజిస్ట్)