కిశోర్ - పెపర్తి గారు ’రుద్రవీణ’ సినిమాలోని ’ఒంటరిగా కూర్చొని దిగులు పంచబోకు నేస్తం’ పాటకు సంబంధించి ఓ మంచి ప్రశ్న పంపించారు. ఆ ప్రశ్నను బాలూ గారికి పంపిస్తే - ఆయన కూడా ప్రతి స్పందించి, సహృదయంతో సమాధానం పంపిస్తూ - ప్రచురించడానికి అనుమతిని కూడా ఇచ్చారు. కిశొర్ గారికి అభినందనలు. బాలూ గారికి కృతజ్ఞతలు.
కిశోర్ గారు పంపిన ప్రశ్న ఇది :
రాజా గారు! రుద్రవీణ చిత్రములో 'చెప్పాలనివుంది గొంతు విప్పాలనివుంది...' అనే పాట ఆరంభంలో వినిపించే 'ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం...మౌనం చూపెడుతుందా సమస్యలకు మార్గం?!...' పియల్ నారాయణ గారి భాగాన్ని పాడిందెవరు? మనో గారని నా అభిప్రాయం. దయచేసి సమాధానమివ్వగలరు. ధన్యవాదాలు.
ఈ ప్రశ్నకు బాలూ గారు పంపిన సమాధానం స్క్రీన్ షాట్ లో చూడండి.