This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

    à°¸à°¿à°¨à°¿à°®à°¾ అంటే అన్నిరకాలూ రాయాలి

’దాశరథీ కరుణాపయోనిధీ’ అన్నది ఎప్పట్నుంచో ఉన్న మాట. ’దాశరథీ కవితా పయోనిధీ’ అన్నది సినీజనులు అన్నమాట.’ఖుషీ ఖుషీ à°— నవ్వుతూ" పాట ద్వారా పాప్యులర్ అయిన దాశరథి à°† చిత్రం కోసమే మొదట à°’à°• కవాలీ గీతాన్ని రాయవలసి వచ్చింది. అప్పట్లో అన్నపూర్ణా వారి ఆఫీసు à°Ÿà°¿.నగర్లో ఉండేది. "మాకో కవ్వాలి కావాలి’’ అన్నారు దుక్కిపాటి మధుసూదనరావుగారు. ట్యూన్ ముందరే ఇచ్చి దానికి సాహిత్యాన్ని సమకూర్చమనడం రాజేశ్వరరావుగారి పద్దతి. ఆయన చేసిన ట్యూన్ ని ఇలా వినిపించారు: "తన్నానా తన్నానా తా తన్నన తన్నా తానానా' అని ’చాలా కష్టమండోయ్ రాయడం’ అని కూడా అన్నారు రాజేశ్వరరావుగారు. "అవును. చాలా కష్టంగానే ఉంది" అని అన్నారు చుట్టూ ఉన్న నిర్మాణ బృందమంతా, 'మీకు కావలిసింది కవ్వాలియే కదా" అని à°“ రెండు క్షణాలు ఆలోచించి "నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే ఇవ్వాలి" అని అన్నారు దాశరధి. అందరికి ఆశ్చర్యం!  సాహిత్యం ట్యూన్ à°•à°¿ నూటికి నూరుపాళ్ళూ సరిపోయింది. అదీ à°…à°‚à°¤ తక్కువ వ్యవధిలో ... చూస్తుండగానే పాటంతా తయారయింది. 'భలే à°—à°¾ ఉందే హైదరాబాద్ దెబ్బ" అని అనుకున్నారట. à°† రోజు అందరూ.
"నవ్వాలీ నవ్వాలీ" అనే à°† కవ్వాలీ గీతం "నీకున్న చింతా వంతా ఈనాడే తీరాలీ" అనే వాక్యం ఉంది. à°† "చింతా వంతా" అనే ప్రయోగాన్ని ఆయన ఇంకో పాటలో కూడా జొప్పించటం జరిగింది. అది "నాదీ ఆడజన్మే" చిత్రం. అందులో "చిన్నారి పొన్నారి పువ్వు" అనే పాటని దాశరథి రాశారు. చరణాలలో ' ఏ à°šà°¿à°‚à°¤ ఏ వంత లేని పసివాడే నిజమైన మౌనీ" అని ఆయన రాశారు. అందరూ ఎంతో బావుందన్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లలో ఒకాయన 'మౌని అంటే ఏమిటండి?' అని అడిగారు. "మౌనంగా వుండే వాడు మౌని సాధారణంగా మునులను మౌని అని ఆంటారు' అన్నారు దాశరధి. "ఏమో ... à°ˆ వాక్యం చాలా కష్టంగా ఉందండీ’ అన్నారాయన. "నిజం చెప్పాలంటే à°ˆ మునులు ఋషులు వాళ్ళందరికీ ఏవో చింతలు వుంటూ వుంటాయి - à°Žà°‚à°¤ సంసార బాధ్యతల్ని ఒదుల్చుకున్నా! పసివాడికే అవేవి వుండవు . అందుకే అలా రాశాను' అని అన్నారు దాశరధి. "స్టాండర్డ్ ఎక్కువగా వుంది. అందరికీ అర్ధం అవ్వాలి' అని అన్నారాయన. అంతవరకూ బావుంది బావుందన్న వారంతా కూడా ’పోనీ మార్చి ఇంకోటి రాయకూడదా’ అని అన్నారు. దాశరథి మనసు చివుక్కుమంది. సినీ రంగంలో నిర్మాణ బృందానికి కావలసింది రాయటం, అదీ అతి త్వరగా ఇవ్వడం ఇండస్ట్రీలో వుండాల్సిన లక్షణాలు. à°“ రెండు నిముషాలు వరండాలో పచార్లు చేసినతర్వాత. 'పసివాడు పలికేటి మాట ముత్యాల రతనాల మూట" అని చెప్పి "ఇది సరిపోతుందా" అని అడిగారు దాశరథి, అంతా 'బాగా కుదిరింది' అని అన్నారు. చివరికి à°ˆ వాక్యమే పాటలో ఉంచడం జరిగింది.
"ఇలా à°“ వాక్యం రాసిన తర్వాత, పిక్చరైజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా మార్చడం జరిగిందా ?’ అన్న ప్రశ్నకు "డాక్టర్ చక్రవర్తిలోని à°“ పాట à°† బాధకు గురైంది" అన్నారు దాశరధి."à°“ బొంగరాల బుగ్గలున్నదానా నీ కొంగు తాకి పొంగిపోతి జాణ ... నీ తస్సదియ్య తాళలేనే" అంటూ రాశారు దాశరథి. పాట చిత్రీకరణ కూడా అయిపోయింది. కానీ సెన్సారు అధికారులు à°ˆ చరణాన్ని ఒప్పుకోలేదు. "తస్సదియ్య అంటే బూతు" అని అన్నారు.

"తస్సదియ్య అన్నది ఊతపదం. పల్లెపదం. దీన్లో తప్పేంలేదండి" అని వాదించారు దాశరధి. "à°ˆ తస్సదియ్య మాత్రం తీసేయ్యాల్సిందే"అని పట్టుబట్టారు అధికారులు. అప్పటికే రికార్డయిపోయి, చిత్రీకరణ అయిపోయి ఉన్న పాటకి లిప్ సింక్ చెడకుండా à°† ఒక్కలైనూ మార్చాలి."సరే.నువ్వు కస్పుమంటే తాళలేనే" అని అంటే ఫరవాలేదా ?” అని అన్నారు దాశరధి. సెన్సారు వారు ’ఓకే’ అని అన్నారు. అప్పటికప్పుడు తిరిగి పాడించి డబ్ చేశారు. "ఇదీ à°† పాట వెనకనున్న à°•à°¥. వ్యథ" అని అన్నారు దాశరధి. అప్పటికప్పుడు సరిపడే మాట తట్టడం సినీ కవికి తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యార్హతల్లో ఒక్కటి. అదే ఆశుగుణం. అది ఉన్నవాళ్ళే సినిమాల్లో రాసుకుపోగలరు, దూసుకుపోగలరు కూడా.
ఓసారి 'మూగమనసులు' చిత్రం కోసం పాట కంపోజింగ్ కని కూర్చున్నారు - దాశరథి, మహదేవన్, పుహళేంది, ఆదుర్తి... హైదరాబాద్ తాజ్ హొటల్లో ! అప్పటికి తమిళ నాట à°“ పాట విశేష ప్రచారంలో ఉంది. à°† పాటని ఆదుర్తి సరదాగా ప్రారంభించారు. ’కావేరీ కరై ఇరిక్కీ” అని. వెంటనే దాశరథి "గోదారీ గటుంది" అని అన్నారు. వెనువెంటనే రెండో లైను "కరైమేలే మర మిరిక్కి" అని అన్నారు ఆదుర్తి. à°† వెంటనే "గట్టు మీద చెట్టుంది" అని అన్నారు దాశరధి, "బ్రహ్మాండం... à°Š ...తరువాత' అని అన్నారు ఆదుర్తి "తమిళం చెప్పండి మరి ?" అని అడిగారు దాశరథి. "జ్ఞాపకం లేదండీ" అన్నారు ఆదుర్తి.
"నేనే స్వతంత్రంగా చెప్తా పోనీ" అంటూ "చెట్టు కొమ్మన పిట్టుందీ .. పిట్ట మనసులో ఏముందీ" అని పూర్తి చేశారు దాశరధి. "పల్లవి అద్భుతంగా వచ్చింద"ని అందరూ అనగానే అదే ఊపులో మొత్తం పాటని పూర్తి చేశారాయన. తర్వాత మహదేవన్ ట్యూన్ సమకూర్చారు. "అదే పాటలో చివర్న వచ్చే చరణం ’పిట్ట మనసు పిసరంతయినా పెపంచమంతా దాగుంది. అంతు దొరకని నిండు గుండెలో à°Žà°‚à°¤ తోడితే అంతుందీ’ అనే చరణాన్ని రికార్డ్స్ రిలీజయేటప్పుడు సమయం ఎక్కువైందని తొలగించారు. సినిమాలో మాత్రం ఉంది" అని అన్నారు దాశరథి.
"ఇలాటిదే మరొకటి, అది తమిళ ట్యూన్ కి రాసినది. ఇప్పటికీ అది ఫోన్ లో ట్యూన్ గా నాకు జ్ఞాపకం" అంటూ ఉపక్రమించారు దాశరధి.
"బాబూ మూవీస్ వారి "మంచిమనుసులు" చిత్రానికి ఆధారం "కుముదం" అనే తమిళ చిత్రం. à°† తమిళ చిత్రంలో "ఎన్నైవిట్టు ఓడిపోహ ముడియుమా' అనే హిట్ సాంగ్ ఉంది. అప్పుడు ఆదుర్తి సుబ్బారావుగారు అన్నపూర్ణ వారి రికార్డింగ్ కార్యక్రమంలో హైదరాబాద్ లోనే ఉన్నారు. కె.వి.మహదేవన్ గారు మద్రాసు నుంచి కదలడానికి వీలులేకపోయింది. ఆదుర్తి గారు నాకు ట్యూన్ వినిపించారు. à°† ట్యూన్ విని బాగా ఆకళింపుచేసుకొని "నన్ను వదిలి నీవు పోలేవులే అదీ నిజములే" అని రాశాను. పాట పూర్తయింది. సాహిత్యాన్ని విమానంలో మద్రాసుకు పంపారు. అప్పటికి యన్.à°Ÿà°¿.à°¡à°¿. సౌకర్యం లేదు. 
ముఖ్యంగా’తొలినాటి రేయి - తడబాటు పడుతు - మెల్లమెల్లగా నీవు రాగా - నీ మేని హొయలు- నీలోని వగలు- లోలోన గిలిగింతలిడగా -  హృదయాలు కలిసి- ఉయ్యాలలూగి ఆకాశమే అందుకొనగా - పైపైకి సాగి మేఘాల దాటి - కనరాని లోకాలు కనగా" ఆనే చరణం తమిళ ట్యూన్ à°•à°¿ సరిపోవటం, తమిళవాసన లేకుండా పూర్తిగా తెలుగు పాటే అనేట్టుగా తెలుగు పదాలు పడడం, అవన్నీ ఆవతల అనుకున్న భావాలకి సరిపోవటంతో ఆదుర్తి గారెంతో మెచ్చుకున్నారు. à°† పక్కనే ఉన్న దుక్కిపాటి వారు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు" అన్నారు దాశరధి.
'దుక్కిపాటి వార్ని మెప్పించడం అంత సులువైన పని కాదు. వారి రెండు చిత్రాలలో సారి నావి రెండు పాటలూ నాకు గురుంచుకోదగ్గ అనుభూతిని మిగిల్చాయి' అంటూ సినీ వినీలాకాశం లోని జ్ఞాపకాల
మబ్బుల చాటుకి వెళ్ళిపోయారు దాశరధి. .
"అది ఆత్మగౌరవం సినిమా అనుకుంటా. హైదరాబాదు సోమాజి గూడాలో అన్నపూర్ణ వారి కార్యాలయం ఉండేది. సాంగ్స్ కంపోజింగ్ కని మద్రాసు నుంచి రాజేశ్వరరావు, సహాయకులుగా కృష్ణయ్యర్, హార్మనీ చక్రధరరావు (సంగీత దర్శకులు కృష్ణ-చక్రద్వయంలోని చక్ర) వచ్చారు. ఆ ఆఫీసులోనే మాకందరికీ భోజనాలూ, బస... రాజేశ్వరరావు గారు డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ రోజు ఆయన నాకో రష్యన్ ట్యూన్ వినిపించారు. అంతా ఆ రష్యన్ ట్యూన్ ని మెచ్చుకున్నారు. ఎంత ప్రయత్నించినా తగిన తెలుగుమాటలు ఆ ట్యూన్ కి ఇమడటం లేదు.
'తెలుగు ట్యూన్ à°•à°¿ తెలుగు మాటలు పలుకుతాయి. ట్యూన్ కనీసం ఇండియన్ దైనా అయితే బాగుణ్ణు. రష్యన్ ట్యూన్ à°•à°¿  తెలుగు పదాలు కూడడం కష్టం' అని అన్నాను. రాత్రి పదయింది. అందరికీ చిరాకేసింది. అక్కడే ఆరుబైట మంచాలు వేసుకుని పడుకున్నాం. అర్థరాత్రయింది. అందరు నిద్రలోకి జారుకున్నారు. పైన చంద్రుడు కనిపించాడు. వెంటనే పల్లవి గుండెల్లో పలికింది. à°† వెంటనే పల్లవి నోటికి అందింది. ’ఏమనుకుంటాడో ఏమిటో’ అని అనుకుంటూ రాజేశ్వరరావు గారిని నిద్రలేపాను.
"ఒక్కసారి ఆ ట్యూన్ ని మళ్ళీ అందిస్తారా ?" అని అడిగాను.
నిజంగా మహానుభావుడాయన. ఏ మాత్రం విసుక్కోకుండా ట్యూన్ పాడి వినిపించాడు. "అందెను నేడే అందని జాబిల్లి ...  నా అందాలన్నీ అతని సొంతములే’ అన్నాను. 'సరిపోయిందండీ’ అంటూ మెచ్చుకోలుగా చూశారు రాజేశ్వరరావు. ఆకాశంలో జాబిల్లి నన్ను మెచ్చుకుంటున్నటు అనిపించింది. అప్పుడు నిద్రపట్టింది. మర్నాటికి పాటంతా à°“.కే.' అంటూ ఊపిరి పీల్చుకున్నారు దాశరథి.
ఇంకోసారి ’చదువుకున్న అమ్మాయిలు" చిత్రం కోసం రాజేశ్వరరావు గారు à°“ ట్యూన్ ఇవ్వడం జరిగింది.
’ఒకటే హృదయము కోసము ఇరువురి పోటీ దోషము’ అని పల్లవి రాశాను. ఎన్నాళ్ళు శ్రమపడ్డా చరణాలు సరిగ్గా రావటం లేదు. దుక్కిపాటి వారు విసుక్కోవడం మొదలు పెట్టారు. నేనే కాస్త గిల్టీగా ఫీలయి "నా మిత్రుడు ఆరుద్ర సాయం తెచ్చుకోనా ?" అని అడిగాను. ’à°“.కే’ అన్నారాయన. నేను కోరగానే వచ్చి కూచున్న ఆరుద్ర చరణాలలో అక్కడక్కడా సర్దాడు. కానీ నేను వేసిన పల్లవి మార్చడం కుదర్లేదు. "పల్లవి బావుందండి. సిట్యుయేషన్ à°•à°¿ సరిపోయింది కూడా' అని ఆరుద్ర అనడంతో దుక్కిపాటి వారు అప్పుడు ఒప్పుకున్నారు. à°† పాటలో... à°“ రెండు పద్యాలు రాశాను. "గుట్టుగా లేత రెమ్మల కులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచు ఏల ఇట్టుల చింతింతువే టొమేటో అతివలిద్దరి మధ్యన నా గతిని కనుమా’ 'ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి మధ్య నలిగినాడు మాధవుండు - ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమ. ఇదీ à°† పాట వెనుక à°—à°² à°•à°¥." అని ఆన్నారు దాశరథి- జ్ఞాపకాల మబ్బుల     à°¨à±à°‚à°šà°¿ బయట వడ్డ చందమామలా నవ్వుతూ.
"అలా దుక్కిపాటి వారి చిత్రాలకు రాయటంతో ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని గార్లతో పరిచయం పెరిగి వారిద్దరూ కలిసి తీసిన ‘సుడిగుండాలు'లో మీరు పాట రాయటం జరిగిందనుకుంటూను." 
’అవును, స్వాతంత్ర్య సంగ్రామం మీద, దేశభక్తి మీద à°“ పెద్ద పాటే రాశాను. à°† పిల్లలకు మూమెంట్స్ చెప్పడానికి బొంబాయి నుంచి à°“ మరాఠీ డాన్సు మాస్టరు వచ్చాడు. ఆయనతో కూచుని à°† పాటని కొన్ని రోజుల పాటు రాశాను. భోజనానికి ఇంటికి కూడా వెళ్ళకుండా వారి ఆఫీసులోనే వుండి, ట్యూన్ వింటూ రాసుకొంటూ వుండేవాణ్ణి. నా ఓర్పుకి ఆదుర్తిగారికి ఆశ్చర్యం వేసింది. ఏ పాటకూ పడని శ్రమ à°ˆ పాట విషయంలో పడ్డానని ఆదుర్తిగారు గుర్తించారు. à°“ రోజు నా దగ్గరకు వచ్చి "దాశరధి గారూ, మీరేం అనుకోకండి. మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టాం. డబుల్ రెమ్యూనరేషన్ ఏర్పాటు చేస్తాను" అని అన్నారు. 'à°† మాట మాత్రం అనకండి. నో రెమ్యూనరేషన్ ఫర్ దిస్ సాంగ్, నేను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవాణ్ణి. నేను పైసా కూడా పారితోషికం తీసుకోను. మీరు, ఏయన్నార్ గారూ చేయి కలిపి తీస్తున్న à°ˆ నో ప్రాఫిట్ చిత్రానికి నేను డబ్బు తీసుకుంటానా? పైగా స్వాతంత్ర్య సమర గాథ మీద పాట’ అని అన్నాను. ఆదుర్తిగారు ఆశ్చర్యంతో నిశ్చేషులై పోయారు à°† రోజు అలా అన్నందుకు ఇవాల్టికీ ఎంతో తృప్తిగా ఫీలవుతాను నేను’అని అన్నారు దాశరథి.
"మరి అక్కినేని గారితో ... ?  
"ఆయన పాటలక్కూడా మంచి అనుభవాలే ఉన్నాయి. వినండి. 'అమరశిల్పి జక్కన' చిత్రంలో ’అందాల బొమ్మతో ఆటాడవా’ అనే పాట రాశాను. 'పల్లవి సింపుల్ à°—à°¾, పాపులర్ అయ్యేట్టుగా కావాలి' అని అన్నారు. ఎన్నో పల్లవులు రాశాను. చివరకు ఇది ఓకే. అయింది. తమాషా ఏమిటంటే - మా యింట్లో పిల్లలందరూ అందాల బొమ్మతో ఆటాడవా- అని పాడుకుంటున్నారయ్యా దాశరధీ! ఇది శృంగార గీతం అని తెలియక - అన్నాడు నారాయణరెడ్డి సరదాగా.
"à°† చిత్రంలోనే ఇంకో పాట ’మధురమైన జీవితాన à°•à°¥ ఇంతేనా’ అనే పాట రాశాను. దర్శకుడు బి.యస్.à°°à°‚à°—à°¾ కన్నడిగుడు.తెలుగు భాషలో అంతగా ప్రవేశం లేనందున నాగేశ్వరరావుగారే à°ˆ పాటని నాతో కూచొని రాయించారు. à°…à°‚à°¤ బిజీ హీరో à°’à°• పాట ఎలా కావాలో, ఏ భావాలు రావాలో అంతా చెప్తూ రాయించడం మాటలు కాదు."
"మరో విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కినేని నటించిన ’దొరబాబు' చిత్రం కోసం అన్నా చెల్లెళ్ళ యుగళగీతం రాయటం, రికార్డు చేయడం, పిక్చరైజేషన్ à°•à°¿ పంపడం జరిగింది. నాగేశ్వరరావు గారికా పాట నచ్చలేదని తెలిసింది. మళ్ళీ రాయమన్నారు. 'సాహిత్యం నచ్చలేదా, ట్యూన్ నచ్చలేదా" అని అడిగాను, ఫోన్ చేసి తెలుసుకుంటే ’ట్యూన్ మారాలి’ అని అన్నారని తెలిసింది. మరో ట్యూన్ చెయ్యడం జరిగింది. à°† ట్యూన్ à°•à°¿ à°ˆ సాహిత్యం కుదర్లేదు. అవ్పుడు ఇంకో విధంగా రాయడం జరిగింది. నాగేశ్వరరావు గారు à°† రెండో వెర్షన్ ని మెచ్చుకున్నారు. à°† పాటే - ’à°† దేవుడెలా ఉంటాడని ఎవరైనాఅడిగితే’ .
"ఇలా అన్నాచెల్లెళ్ల పాటలు మీరే ఎక్కువగా రాశారనుకుంటాను ... అన్నా నీ అనురాగంలాంటివి ?"
"అవుననుకుంటాను. à°ˆ అన్నా నీ అనురాగం పాట ’ఆడపడుచు’ చిత్రంలోనిది. పాట పూర్తిగా రాసేసి హైదరాబాద్ వచ్చాను. ఎందుకో నా పాట మొదట్లో వారికి నచ్చలేదు. తర్వాత అయిదుగురు కవులతో అయిదు రకాలుగా రాయించారట. చివరకు మళ్ళీ నేను రాసిందే ఓకే చేశారు. 'ఇలా జరిగిందండీ మరోలా అనుకోకండీ ' అని అన్నారు. నాకు కోపం దేనికండీ ? నచ్చనప్పుడు పోతుంది. నచ్చితేనే నిలుస్తుంది" అన్నారు దాశరథి అనుభవాలతో పండి నిండిన కంఠంతో..
"అయిదుగురు రాసిన తర్వాత కూడా మీ పాట ఒకే కావటం గ్రేట్ కాదా?"
"అలా అయితే నేను రాసిన తర్వాత అయిదుగురు రాయటం ఇందాక చెప్పాను. అయిదుగురు రాసిన తర్వాత నేను రాయటం ఇంకో చిత్రం కోసం జరిగింది. సినిమా గుర్తులేదు. పూర్ణచంద్రరావుగారు నిర్మాత. చలపతిరావు మ్యూజిక్. సినిమా అంతా రెడీ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉంది. జ్యోతిలక్ష్మి డాన్సు పెట్టాలి సందర్భం ఉన్నా సరే లేకున్నా సరే’ అని అనుకున్నారట. అప్పుడు సాహిత్య అకాడమీ
సభల సందర్భంగా హైదరాబాదులోనే ఉన్నాను. తిరిగి నేను మద్రాసు చేరుకునే సరికి పూర్ణచంద్రరావుగారు పిలిపించారు. 
అయిదుగురితో రాయించిన సంగతి నాకు తెలియదు. "రంజైన పాట కావాలి - నో స్పెషల్ సిట్యుయేషన్ స్కై ఈజ్ ది లిమిట్" అని అన్నారు. జ్యోతిలక్ష్మి అనే సరికి ఏవేవో శృంగార భావనలు గుర్తుకొచ్చాయి. 'సూదిలో దారం సందులో బేరం' అని అన్నాను. 'భేష్ భేష్' అని అన్నారు. పాట పూర్తయింది. ఆ పాటతో పిక్చరూ ఆడింది. గ్రామాల్లో ఆ రికార్డు పెట్టుకొని అక్కడి లోకల్ డాన్సర్స్ ని ఆడిస్తూ వికారపు చేష్టలు చేస్తూ యువకులు ఒకటే గెంతడం నాకిప్పటికీ గుర్తు.' మీరా .. ఇలాటి పాటలు రాయడమా ?' అని ఒకరడిగారు - 'సినిమా అంటే అన్ని రకాలు రాయాలి. లేదా పెన్ను జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి? అని
అన్నాను. 
'ఇంతవరకూ ఒకే పాటకి అయిదు వెర్షన్ల గురించి చెప్పారు. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంలో మీరు మరో ముగ్గురు రచయితలతో ఒక పాట రాశారు కదా?'
'అవును. అది అయిదు చరణాల పాట. విజయనరసింహం, అరుళ్ ప్రకాశ్, శ్రీనివాస్ రాశాం. నేను తెలుగు, ఉర్దూ వెర్షన్ లు రాశాను. ఉర్దూ అంటే జ్ఞాపకం వచ్చింది. 'రాం రహీమ్' చిత్రంలో తెలుగు - ఉర్దూ వెర్షన్ ల పాట ఒకటి నాచేత రాయించారు. సినిమాలో రహీం పాత్రధారి ఉర్దూ లో పాడాలి. దానికి రఫీ వస్తున్నారు. పాట రాయించడానికి బొంబాయి నుంచి ఎవరైనా కవిని పిలిపించాలని డైరెక్టర్ బి.ఏ. సుబ్బారావు అనుకున్నారట. 'తలకింద సముద్రం లా దాశరథిగారు మద్రాసులోనే ఉంటే బొంబాయి నుంచి ఉర్దూ కవి ఎందుకండి ?' అని ఒకరన్నారట. "యునానీ హాకీం హూ" అంటూ రాశాను. రఫీగారు సూడియోలో పాడే ముందు 'ఇంత బాగా ఉరూలో రాసేవాళ్ళు ఇక్కడ వున్నారా" అని అడిగారు బి.ఏ.సుబ్బారావుగారు నన్ను చూపించారు. ఆయన ఆనందానికి అవధులు లేవా రోజు. 'హమ్మయ్య అనుకున్నాను' అని అన్నారు దాశరథి.
"మీరు రాసిన భక్తిపాటలకు ఏ చరిత్రా లేదా?"
"లేకేం - రంగులరాట్నం చిత్రంలో 'నడిరేయి ఏ రూములో' అనే పాట రాశాను. అది రాయడానికి ముందు బి.ఎన్.రెడ్డిగారు అన్నారు - వెంకటేశ్వర స్వామి వార్ని స్తుతిస్తూ యూజువల్ గా వచ్చే పాట అయితే వద్దండీ. నాకు కొత్త రకంగా కావాలి" అని. అది విని నేనో మాట అన్నాను. "శ్రీ వైష్ణవ సంప్రదాయంలో
'పురుషకారం' అని ఒకటుందండీ. అదేమిటంటే అమ్మవారి చేత స్వామి వారికి చెప్పించడం. అంటే రికమెండేషన్ అన్నమాట. అంటే స్వామి వారిని కాకుండా అలివేలు మంగమ్మని ప్రార్దించడం"
బి.యన్. గారు ఎగిరి గంతేశారు. 'బాగుంటుంది. రాయండి' అన్నారు.
"మము గన్న మాయమ్మ అలివేలు మంగమ్మ - ప్రభువుకి మా మనవి వినిపించవమ్మా - అని రాశాను."
"అదీ కొత్తదనం" అని సంబరపడ్డారు బి.యన్.గారు. గోపాలం గారు ట్యూన్ చేశారు. భలే పేలిందాపాట. ఇప్పటికీ నేను తిరుపతి కొండకెళితే నా పాటే నాకు వినిపిస్తూ ఉంటుంది. అదో మధురానుభూతి, ఏదైనా తిరగేసి చెప్పటంలో కొత్తదనం వస్తుంది" అన్నారు దాశరధి అర్థ నిమీల నేత్రాలతో "కొత్త రుచిని సంతరించుకొంటుంది కూడా" ...
"రుచి అన్నారు, కనుక ఇక్కడో తమాషా సంఘటన చెప్పాను వినండి. పిఏపి వారి "మనుషులు - మమతలు' చిత్రంలోని ఓ పాట. మద్రాస్ రామన్ స్ట్రీట్లో చలపతిరావు గారి మేడ గదిలో మ్యూజిక్ కంపోజింగ్. ఎన్ని కాఫీలు, టీలు తాగినా పాట పలకలేదు. 'చారు తెప్పిస్తాను తాగి చూడండి 'అన్నారు చలపతిరావు గారు. 'చారు తో పాట పలుకుతుందా" అని అనుకున్నాను. ఇంతలో వారి సతీమణి వేడివేడి చారును కప్పుల్లో అందరికీ పంపించారు. అది మసాలా వారు. ఘమఘమకి పాట వచ్చేసింది. "వెన్నెలలో మల్లియలు - మల్లియలో ఘుమఘమలు - ఘుమఘమలో గుసగుసలు - ఏవేవో కోరికలు" అని రాశాను."భేష్ భేష్ " అన్నారు నిర్మాత పి.ఎ.పి. సుబ్బారావు గారు, దర్శకులు ప్రత్యగాత్మ గారు. ఇలా రోజూ వాళ్ళింట్లో మసాలా చారు తాగడం. అన్ని పాటలూ బాగా వచ్చాయి. సుమారు 6 పాటలు రాశాను ఆ పిక్చరుకి. చారులో వున్న జోరు అప్పుడు తెలిసింది . బారులోను, బీరులోను లేని జోరు చారులో ఉందండీ" అన్నారు దాశరథి హుషారుగా 'రస' జగత్తు నుంచి ఊడిపడుతూ.
"మన కవులు రాసిన చాలా పాటల ఒరిజినల్స్ తమిళ కవి కీర్తిశేషులు కణ్ణదాసన్ రాసిన పాటల్లో వున్నాయంటారు. మీకలా ఏవీ లేవా ?"   
"జమీందారు గారమ్మయి సినిమా కోసం' తేనెశిందునేవానం' అంటూ కణ్ణదాసన్ ఎప్పుడో à°“ పాట రాశారు. ఆకాశం నుండి తేనె కురుస్తున్నదని దాని అర్ధం. à°† పాటని తమిళులు తెగ మెచ్చుకునే వారు, అదే ట్యూన్ లో  తెలుగులో పాట రాయాలన్నారు.'మ్రోగింది వీణ పదే పదే హృదయాల లోనా' అని అన్నాను. à°ˆ పాట కూడా ఇంచుమించు అంతే పాపులర్ అయింది. మిత్రుడు కణ్ణదాసన్ à°•à°¿ వినిపించాను. "రొంబ అళగాయిరుక్కె"(చాలా అందంగా ఉందే) అన్నారాయన. "రొంబనన్రి" (చాలా కృతజ్ఞతలు)" అని అన్నాను.
ఓసారి 'à°“ కౌన్ ధీ' అనే హిందీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు నేనూ, కణ్ణదాసన్ కలిపి పాటలు రాశాం. "ఆమె ఎవరు?" అని తెలుగులోను, 'యూర్నీ?" అని తమిళంలోనూ తీశారు. ట్యూన్స్ అన్నీ  హిందీవే. తెలుగులో అన్ని పాటలూ నేనే రాశాను. ఆయనా, నేనూ à°† రెండు వెర్షన్స్ à°•à°¿ పూటకోపాట చొప్పున రాశాం. అన్నీ బాగా వచ్చాయన్నారు అందరూ,
"నేను రాసినంత స్పీడ్ గా ఎవరూ రాయలేరు అని అనుకునే వాణ్ణి. ఇవాళ నుంచీ అలా అనుకోను" అని అన్నారుకణ్ణదాసన్. "నన్రి(కృతజ్ఞతలు)" అన్నాను.
“హోటల్లో కూచొని లోకాభిరామాయణం మాట్లాడుకునే వాళ్ళం. నేనిక్కడ ఆస్థాన కవిగా నియమించబడిన కొద్ది రోజులకే అతనూ అక్కడ మద్రాసులో ఆస్థాన కవి అయ్యాడు. ఇప్పుడతను చనిపోయాడు. ఆస్థాన పదవి అక్కడ ఉంది. ఇక్కడ పదవి పోయింది. నేను జీవించే ఉన్నాను.వాటె యాన్ ఐరనీ'అన్నారు దాశరథి ముగింపుగా.
-రాజా
(మ్యూజికాలజిస్ట్)