అ: ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలనీ....||౨||
నింగినేల, వాగువంక చెట్టు చేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
కో: లలలాలల.... లాలల లాలలాలాల ||ఒక తోటలో||
అ: ఎన్నొరంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైనపువ్వు పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చుడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే... హాయిగా ఉండాలి....
కో: లలలాలల.... లాలల లాలలాలాల ||ఒక తోటలో||
ఆ: నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా
ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా...
దేవుడు వేరే లేడు కదా... తోటమాలే పువ్వుకి దేవుడుగా....
మాలికి పువ్వుకి మధ్యన అనుబంధం ఎన్నడూ వాడదుగా... అ: ||ఒక తోటలో||