This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Profiles
Jonnavitthula Ramalingeswara Rao                జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

                                     జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

                         (Jonnavittula ramalingeswara rao)

 

జననం : 7 జూలై 1959,
 జన్మస్థలం : విజయవాడ
 తల్లిదండ్రులు : లక్ష్మీనరసమ్మ, సుబ్బారావు
 చదువు : భాషాప్రవీణ, ఎం.ఏ. (తెలుగు)
 భార్య : శేషుకుమారి
 సంతానం : కవలలు (లక్ష్మీ సువర్ణ, లక్ష్మీ అన్నపూర్ణ), కుమారుడు (మాణిక్య తేజ)
 తొలి చిత్రం పాట : రౌడీపోలీసు (1987) లో ఇది వరమా శాపమా... ఇది నీకు న్యాయమా
 సినిమా పాటల్లో అనేక ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు జొన్నవిత్తుల.
ఇప్పటివరకు సుమారు 600 పాటలు రచించారు.
సప్తస్వరాలను తీసుకొని వాటితో పూర్తిగా ఓ పాటను రాసిన తొలి తెలుగు సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. సప్తస్వరాలకు అర్థాలు ఉండవని చాలామంది అనుకుంటారు. కాని అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదని ఆ స్వరాలకు కూడా అర్థాలు ఉంటాయని నిరూపించారాయన.
 స్వరకల్పన అనే సినిమాలో సరిగమపదని నీ దానిని పాటలో... . స్వరాలను పదాలుగా మార్చి భాషతో చెడుగుడు ఆడుకున్నారు జొన్నవిత్తుల ఈ ఏడు స్వరాలను రాగం తప్పకుండా అర్ధవంతమైన పదాలుగా తయారుచేయడం అంత సులువైన ప్రక్రియ కాదు ఈ పాటలో. ఉదాహరణకు... సాగనీ, పదమనీ, దాగనీ, నీ దానినీ, నిగనిగ, మానిని, దా మరి, సరిదానిని... వీటిని చూస్తే, పైకి స్వరాల కూర్పులాగే అనిపిస్తుంది కానీ సరిగా అర్థం చేసుకుంటే అందులో దాగి ఉన్న పదం, ఆ పదం యొక్క అర్ధం స్పష్టంగా తెలుస్తుంది. . ఇది సినీ సంగీత సాహిత్యంలో సరికొత్త ప్రయోగం గా చెప్పుకోదగ్గ స్వరాక్షర ప్రయోగం
ఇతరవిషయాలు : 10 శతకాలు రచించారు. అవి శ్రీరామ లింగేశ్వర, బతుకమ్మ, తెలుగమ్మ, సింగరేణి, తెలుగుభాష, నైమిశ వెంకటేశ, రామబాణం, కూచిపూడి, రామప్ప, శ్రీరామలింగేశ్వర (ఆంగ్లం) శతకాలు. తెలుగుభాష గొప్పదనాన్ని చాటి చె పుతూ ‘తెలుగు శంఖారావం’ పేరుతో 56 తెలుగు గీతాలు రాశారు